నీకు మంచి టేస్ట్ ఉంది బాస్ 2 114

అనంత్ తనకు వచ్చిన పార్శిల్ తీసుకొని అది వేసుకొని రోడ్డు మీదకు వెళ్లి నిలబడాడు అప్పుడు సడన్ గా వర్షం పడింది దాంతో ఆ రైన్ కోట్ కీ ఉన్న కలర్ పోయి అది అనంత్ నీ అందరి ముందు నగ్నంగా నిలబెట్టింది అప్పుడు అందరూ ఆ ఫోటో లు తీసి viral చేశారు దాంతో అనంత్ ఇంటికి వెళ్లుతుంటే దారిలో వాసు పేరు రాసి ఉంది సుసైడ్ చేసుకున్న అమ్మాయి ఎవరో అబ్బాయి తో బైక్ మీద వెళుతు కనిపించింది దాంతో అనంత్ ఇంటికి వెళ్లి తన పర్సనల్ రూమ్ లోకి వెళ్లాడు తన కంప్యూటర్ లో తీసి చూస్తే “your game site has been hacked” అని వచ్చింది ఎవరూ hack చేసి ఉంటారు అని రివర్స్ hack చేస్తే అది ఎక్కెడెక్కడో చూపిస్తూ వచ్చింది ఆ లింక్ లకి చిన్న బాక్స్ icon వచ్చింది అవి అని కలిపి చూస్తే అందులో వాసు ఫోటో వచ్చింది అది చూసి షాక్ అయ్యాడు అనంత్, ఇన్నాళ్లు తను ఎంతో కష్టపడి తయారు చేసుకున్న చీకటి సామ్రాజ్యం నీ వాసు ఎలా కనిపెట్టాడో అనంత్ కీ అర్థం కాలేదు.

(ఆ NERVOUS గేమ్ తయారు చేసింది అనంతే)

(కొన్ని నెలల క్రితం)

విద్య కీ ఎంత ప్రయత్నం చేసిన ఉద్యోగం రావడం లేదు దాంతో పాటు ఇంట్లో వాళ్ల నాన్న కీ ఉద్యోగం పోవడంతో పరిస్థితులు సహకరించడం లేదు తనకు అందుకే రోజు Instagram లో depression quotes రాసేది అలా ఒక రోజు తనకు NERVOUS గేమ్ కీ సంబంధించిన ఒక మెసేజ్ వచ్చింది దాంతో తను ఆ గేమ్ డౌన్లోడ్ చేసి ఆడటం మొదలు పెట్టింది ఆ తర్వాత తనకు వచ్చిన 1st టాస్క్ ఎవరినైన ఒక అబ్బాయి నీ కొట్టాలి దాంతో ఎప్పటి నుంచో తన చెల్లి దివ్య నీ ఏడిపిస్తున్న పక్కింటి వాడిని కోటాలి అని డిసైడ్ అయ్యింది దాంతో ఇద్దరు కవలలు కావడంతో దివ్య ప్లేస్ లో విద్య ఆ రోజు వాడితో మాట్లాడి ఊరి బయట ఉన్న పొలం దెగ్గర ఉన్న పాత బావి దగ్గరికీ రమ్మని చెప్పి వాడు రావడానికి అంటే ముందే వెళ్లి అక్కడ కెమెరా సెట్ చేసి వాడికి కోసం వెయిట్ చేసింది, వాడు రాగానే అక్కడ విరిగి ఉన్న చెట్టు కొమ్మ తీసుకొని కొట్టింది దాంతో వాడు తల పగిలి అక్కడే పడిపోయాడు ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయింది ఆ వీడియో నీ గేమ్ సైట్ లో upload చేసింది, ఆ తర్వాత ఇంకా కొన్ని ఇలాంటి డేరింగ్ టాస్క్ లు చేసింది, ఆ తరువాత విద్య వాసు కాలేజీ లో జాబ్ వచ్చింది మెల్లగ NERVOUS గేమ్ నీ మానేసింది దాంతో ఒక రోజు తను కొట్టిన అబ్బాయి చనిపోయిన న్యూస్ తెలిసి షాక్ అయ్యింది అప్పుడు తను వాడిని కొట్టిన వీడియో నీ తనకే పంపించి టాస్క్ చేయడం మానేస్తే ఆ వీడియో సెక్యూరిటీ ఆఫీసర్లకు పంపిస్తాను అని బెదిరించాడు దాంతో తన రొమాంటిక్ టైమ్ లో ఉన్నపుడు ఫోటో తీసి పెట్టమని చెప్పాడు ఆ తర్వాత విద్య వాసు తో లైబ్రరీ లో ముద్దు పెట్టిన ఫోటో నీ గేమ్ సైట్ లో పెట్టింది కాకపోతే తను చేసిన తప్పు నీ వాసు తో చెప్పి తన భారం దించుకుంది.

దాంతో వాసు తన స్టూడెంట్ ఒకడితో కలిసి ఆ సైట్ నీ హ్యాక్ చేసి విద్య మర్డర్ చేసిన వీడియో తీసేశారు దాంతో సంతోషం గా న్యూ ఇయర్ కీ స్వాగతం పలుకుదాం అని పార్టీ కీ వెళ్లితే విద్య చెల్లి దివ్య సరదాగా వాసు నీ ఆట పట్టిదాం అని ప్లాన్ చేసారు వాళ్లు హ్యాక్ చేసినప్పుడు వాసు ఇంటి WiFi ip address తో లింక్ అవ్వడం వల్ల కోపం తో వచ్చిన అనంత్ చీకటి తన మొబైల్ లైట్ లో దివ్య నీ చూసి విద్య అనుకోని పొడిచి ఆ తర్వాత బాల్కనీ నుంచి పారిపోయాడు తను పొడిచిన కత్తి కూడా అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు అనంత్ ఎప్పుడు క్రిమినల్ నీ పట్టుకునే విధానం ప్రకారం “తప్పు చేసిన వాడు ఆ తప్పుకు సంబంధించిన ఆధారాలు దొరకకుండా చేసినప్పుడు ఎక్కువ ఆధారాలు వదులుతాడు” అని అందుకే ఎలా ఉన్న దాని అలాగే వదిలేసి వెళ్లాడు.