నీకు మంచి టేస్ట్ ఉంది బాస్ 2 114

ఇంటికి వచ్చిన వాసు రక్తపు మడుగులో పడి ఉన్న దివ్య నీ పట్టుకుని ఏడుస్తున్న విద్య నీ దగ్గరికి వెళ్లి దివ్య పల్స్ చెక్ చేశాడు ఇంకా ప్రాణం ఉంది అని అర్థం అయ్యి తన ఫ్రిడ్జ్ కొన్నప్పుడు వచ్చిన కవర్ తో దివ్య బాడి కవర్ చేసి ప్రియాంక కీ ఫోన్ చేశాడు తను ఇంట్లోనే ఉన్నాను అంటే వెంటనే రమ్మని చెప్పి తన సీక్రెట్ రూమ్ లోకి తీసుకొని వెళ్లి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు దాంతో దివ్య బ్రతికింది అప్పుడు ఎవరూ చేసి ఉంటారా అనే ఆలోచనలో పడిన వాసు బాల్కనీ లోకి వెళితే అక్కడ కుండీ విరిగి ఉంది ఆ మట్టిలో ఒక షూ మార్క్ ఉంది, అది చూడగానే వాసు కీ ఆ షూ మార్క్ ఎక్కడో చూశాను అని గుర్తుచేసుకుంటు ఉన్నాడు అప్పుడు గుర్తుకు వచ్చింది ఒక సారి కాలేజీ స్పోర్ట్స్ మీట్ కీ ACP అనంత్ నీ చీఫ్ గెస్ట్ గా పిలిచారు అప్పుడు ఫుట్బాల్ మ్యాచ్ మొదలు పెట్టినప్పుడు అనంత్ బాల్ నీ ఎడమ కాలి తో వెనకు లేపి ముందరికి దుక్కి కుడి కాలితో కిక్ కొట్టాడు అప్పుడు వాసు ఆ షూ pattern చూశాడు చాలా వింతగా అనిపించింది అప్పుడు అనంత్ నీ అడిగాడు అది తను స్పెషల్ గా డిజైన్ చెయ్యించుకున్నా అని చెప్పడం గుర్తుకు వచ్చింది అంటే ఈ మర్డర్ చేసింది అనంత్ అని ఒక అవగాహనకు వచ్చాడు వాసు.

దివ్య నీ చంపాలి అని చూసిన అనంత్ నీ తను చేసిన క్రైమ్ నీ తనతోనే చెప్పిస్తే తప్ప వాళ్ల దెగ్గర వేరే ఆధారం లేదు అందుకే వాసు తన స్టూడెంట్స్ నీ ఇంటికి రమ్మని చెప్పాడు విద్య తో పాటు ప్రియాంక అందరికీ తన ప్లాన్ నీ పూస గుచ్చినటు చెప్పాడు ముందు ఇళ్లు మొత్తం శుభ్రం గా కడిగేశారు ఆ తర్వాత వాసు తన laptop లో రోజు జరిగే విషయాలు అని రాసి ఉంచుతాడు అలా మొత్తం గత మూడు నెలలుగా జరిగిన విషయాలు అని డెలిట్ చేసి అది తిరిగి రికవర్ చేయలేని విధంగా తుడిచేసాడు ఆ తర్వాత వాసు కొన్ని పేపర్ లు తీసుకొని అందులో తన రచన శక్తి వాడి సెక్యూరిటీ అధికారి లను ఏమార్చడానికి అందులో పిచ్చి పిచ్చి కథలు రాశాడు ఆ తర్వాత దివ్య నీ తీసుకొని ప్రియాంక ఇంటికి వెళ్లిపోయారు, అప్పుడు వాసు వాచ్ మ్యాన్ నీ పిలిచి గంట లో సెక్యూరిటీ అధికారి లు వస్తారు అని చెప్పి cctv footage మొత్తం డెలిట్ చేసి వాడికి ఐదు వేల రూపాయలు ఇచ్చి చెప్పినట్లు చేయమని చెప్పి ఆ తర్వాత NERVOUS గేమ్ సైట్ ఓపెన్ చేసి చూశారు అందులో చాలా మంది తమ కాలేజీ అమ్మాయిలు చనిపోవడంతో వాసు తన స్టూడెంట్ ఒక అమ్మాయి నీ రేపు సుసైడ్ చేసుకున్నట్లు నటించమని చెప్పి సెక్యూరిటీ అధికారి స్టేషన్ కీ వెళ్లి surrender అయ్యి తన ఆట మొదలు పెట్టాడు వాసు.

అనంత్ కీ మొదటి షాక్ తగిలింది తను మర్డర్ చేసిన ఫ్లాట్ కీ తనే investigation కీ వెళ్లడం రెండో షాక్ ఏంటి అంటే అక్కడ డెడ్ బాడి లేకపోవడం మూడో దెబ్బ తను చంపేశాను అనుకున్న విద్య తన సెక్యూరిటీ అధికారి స్టేషన్ కీ రావడం మళ్లీ martury లో విద్య డెడ్ బాడి గా పడి ఉండటం, ఇలా ఒక దాని తర్వాత ఒకటి వాసు అనంత్ కీ షాక్ ఇస్తూ వచ్చాడు దానికి తోడు తనకి తన తల్లి తండ్రులకు మధ్య ఉన్న విభేదాలు ఇంకో రకంగా కలిసి వచ్చింది వాసు కీ మొత్తం ప్లాన్ లో వాసు ఊహించ లేక పోయిన విషయం అనంత్ ప్రియాంక దాకా వెళ్లడానికి తనే ఒక ఈజీ రూట్ వేశాడు అని వాసు గుర్తించలేదు ఎందుకంటే వాసు కీ వచ్చిన బైల్ పేపర్ లో వాసు కీ ఉన్న psychological disease గురించి approve చేసిన గవర్నమెంట్ డాక్టర్ ప్రియాంక కాబట్టి తనని వెతుక్కుంటూ వెళ్లిన అనంత్ అక్కడ ప్రియాంక వాసు తో కలిసి దిగ్గిన ఫోటో చూసిన అనంత్ వాసు నీ ట్రాప్ లో ఇరికించాలి అని అనుకోని ప్లాన్ చేశాడు కాకపోతే వాసు తెలివిగా అనంత్ నీ divert చేసి తన గేమ్ లో తననే ఇరుకునేలా చేశాడు.

ఇది ఇలా ఉంటే అక్కడ అనంత్ ట్రాఫిక్ సెక్యూరిటీ ఆఫీసర్లకు ఫోన్ చేసి ఇందాక సిగ్నల్ దెగ్గర చూసిన అమ్మాయి ఫోటో పంపి తను ఎక్కడికి వెళ్లిందో తెలుసుకొని ఆ అమ్మాయి నీ అరెస్ట్ చేసి తీసుకొని రమ్మని చెప్పాడు ఇంకో టీం తో కలిసి వాసు ఉండే ఆపార్టమేంట్ నీ సెక్యూరిటీ అధికారి లు రౌండ్ అప్ చేశారు ఆ తర్వాత వాసు ప్రియాంక, విద్య, దివ్య ముగ్గురిని ఎదురు ఫ్లాట్ లో ఉన్న ముసలి వాళ్ల ఇంట్లో దాకోమని చెప్పి లిఫ్ట్ లో కిందకు వెళ్లాడు ఆ తర్వాత తన కార్ తో అక్కడి నుంచి పారిపోయాడు తరువాత ఆ అమ్మాయి కీ ఫోన్ చేశాడు అప్పుడు సెక్యూరిటీ అధికారి లు దాని స్పీకర్ లో వింటున్నారు అప్పుడు వాసు ఆ అమ్మాయి తో “మీ పార్కింగ్ లో ఉన్నాను 7659 కార్ నెంబర్ కీ వచ్చి ఎక్కు” అన్నాడు అందరూ పార్కింగ్ లోకి వెళ్లి వాసు చెప్పిన కార్ నెంబర్ పట్టుకొని ఆ కార్ తెరిచి చూశారు అందులో ఎవరూ లేరు ఈ లోపు వాసు తన కార్ తో వచ్చి ఆ అమ్మాయి నీ ఎక్కించుకోని వెళ్లాడు ఆ తర్వాత వాసు కార్ వస్తున్న రూట్ నీ ముందే తెలుసుకున్న అనంత్ హైవే నీ బ్లాక్ చేసి పెట్టాడు కానీ అనంత్ ఊహించని విధంగా వాసు 1st exist కాకుండా ముందుకు వెళ్లి 2nd exist లో u turn తీసుకొని ఒక ట్రక్ లోకి కార్ ఎక్కించాడు అలా కార్ నుంచి దిగి ఆ ట్రక్ నీ పంపించేశాడు, ఆ తర్వాత సడన్ గా అనంత్ తన కార్ తో వచ్చి వాసు నీ గుద్దేసాడు వాసు ఎగిరి రోడ్డు అవతల పడ్డాడు ఆ తర్వాత అనంత్ తన గన్ తీసుకొని వాసు మీదకు వెళ్లాడు కానీ వాసు కళ్లలో భయం కనపడక పోయేసరికి అనంత్ కీ నవ్వు వచ్చి అక్కడే పక్కనే కూర్చున్నాడు వాసు తో పాటు.