తరువాతి రోజు రాజు కాస్త ముభావంగా కనిపించాడు.. నేనే కల్పించుకొని మాట్లాడా.. గతరాత్రి సంగతి ఏమీ ఎత్తలేదు.. మాములుగా రోజులాగే మాట్లాడా… ముందు రాజు నా దగ్గర ఫ్రీ గా ఉండేలా, మాట్లాడేలా చేసుకుంటే తర్వాత అతన్ని పెళ్లికి ఒప్పించ వచ్చు అనేది నా ఆలోచన..
అందుకని నేను వీలైనంత ఎక్కువగా రాజుతో మాట్లాడే ప్రయత్నం చేయసాగాను.. ఏదయినా షాపింగ్ చేయాల్సి ఉంటే రాజునే తోడుగా తీసుకెళ్లడం , కొనేటప్పుడు రాజుని సలహాలు అడగడం, వాటిమీద డిస్కస్ చేయడం లాంటివి చేస్తూ , ఇంట్లో రాజు కి కావలసినవి అన్నీ దగ్గరుండి చూసుకోవడం, రాజు ఖాళీగా ఉన్నపుడు బోర్ కొడుతుందని చెప్పి అతని దగ్గర కూర్చొని కబుర్లు చెప్పడం ఇలా రకరకాలుగా ప్రయత్నాలు చేసాను…
క్రమంగా రాజు నాతో ఫ్రీగా మాట్లాడుతున్నాడు.. కానీ ఇంకా తన మనసులోని మాటలని పంచుకొనే అంత క్లోస్ అవ్వలేదు…
ఒక సారి మాటల మధ్యలో రాజుకి చెస్ అంటే బాగా ఇష్టమని తెలిసింది.. చెస్ ఆడే వాళ్ళు ఉంటే ఎన్ని గంటలైనా రాజు వాళ్ళతో ఆడుతూనే ఉంటాడట.. నాకూ చెస్ ఆడటం కొద్దిగా వచ్చు…
ఒకరోజు ఖాళీ టైంలో .. నీకు చెస్ బాగా వస్తుందటగా నాకు నేర్పవా అని అడిగా.. నాకు బేసిక్స్ తెలుసు కానీ బాగా రాదు అని చెప్పా..
రాజు సరే అని ఒక కబోర్డ్ తెరిచాడు అందులో రకరకాల చెస్ బోర్డ్స్, పావులు ఉన్నాయి… చెక్కవి గాజువి ,పింగానివీ, రకరకాల ఆకారాలు, రకరకాల సైజ్ లు..
“ఇన్ని ఎందుకు”
“నాకు ఎక్కడ ఏ బోర్డ్ బాగనిపిస్తే అది తీసేసుకుంటా.. ఇది నా బలహీనత” అంటూ ఒక బోర్డ్ తీసుకొని వచ్చాడు..
ముందు నీ లెవెల్ ఎంతో తెలుసుకోడానికి ఒక గేమ్ ఆడుదాం అన్నాడు.. నేను సరే అన్నా.. ఇద్దరం ఆడిన మొదటి గేమ్ లో నేను కావాలని కొన్ని తప్పులు చేసా.. గేమ్ అయ్యాక రాజు నాతో అన్నాడు.. నువ్ బాగా ఆడుతున్నావు.. కొన్ని కొన్ని తప్పులు సరి చేసుకుంటే ఇంకా బాగా ఆడుతావు అన్నాడు..
నువ్ నా తప్పులు చెప్తే నేర్చుకుంటా.. అన్నా నేను..
తరువాత మేమిద్దరమూ రోజూ చెస్ ఆడే వాళ్ళం..
మొదట్లో రాజు నేను ఆడుతున్నప్పుడే తప్పుడు ఎత్తు వేస్తుంటే అలా కాదు అని ఆ ఎత్తు తర్వాత వచ్చే ఎత్తులన్నీ చెప్పి..సరైన ఎత్తు ఏదో చెప్తూ ఆడేవాడు.. గెలుపు ఓటముల గురించి కాకుండా ఎలా ఆడాలో చెప్పడం వరకే సాగింది ..
చెస్ కి సంబంధించి కొన్ని పుస్తకాలు కూడా తెచ్చి ఇచ్చాడు.. “ఆరుద్ర” రాసిన “చదరంగం” బుక్ నాకు మొదట్లో బేసిక్స్ ఇంకాస్త మెరుగు పరుచుకునేందుకు సహాయపడింది… కొన్నాళ్ల తర్వాత ఇంకాస్త పై లెవెల్ పుస్తకాలు చదివాను..
రాజు ట్రైనింగ్, ఇంకా పుస్తకాలు చదవడం వల్ల నేను చెస్ ఆడడం బాగా నేర్చుకున్నా.. ఆరు నెలలు తిరిగే సరికి రాజు కి గట్టి పోటీ ఇచ్చే స్థాయికి వచ్చా…
ఈ కాలంలో రాజు నాతో పూర్తిగా ఫ్రీ అయిపోయాడు.. చెస్ ఆడడం మాత్రమే కాకుండా అన్ని విషయాలు నాతో మాట్లాడుతున్నాడు..
తను వేసుకునే డ్రెస్ సెలక్షన్ కి కూడా నన్ను తీసుకెళ్తున్నాడు..
బిసినెస్ విషయాల్లో కూడా కొన్ని సార్లు అత్తయ్య, రవిలతో పాటు నాతోను చర్చిస్తున్నాడు…
ఇంక ఏదో ఒకరోజు టైం చూసుకొని పెళ్లి విషయంలో రాజుకి నచ్చజెప్పాలి అనుకుంటూ సరైన సమయం కోసం చూస్తున్నాను…
*********************
ఇంతలో ఒకరోజు అకస్మాత్తుగా అత్తయ్యకు పక్షవాతం వచ్చింది… ఒక కాలు ఒక చెయ్యి పడిపోయాయి.. మాటకూడా పడి పోయింది.. హాస్పిటల్ లో జాయిన్ చేసాం … రవి, నేను, రాజు అందరమూ ఎంతో కంగారు పడ్డాం.. నెల రోజుల ట్రీట్మెంట్ తర్వాత అత్తయ్యకు మాట తిరిగి వచ్చింది … కానీ కాలు చెయ్యి ఇంకా అలాగే ఉన్నాయి..
హాస్పిటల్ లో ఉండనవసరం లేదని డిశ్చార్జ్ చేసారు .. ఇంటి వద్ద మందులు వాడితే క్రమంగా తగ్గొచ్చని చెప్పారు..
అత్తయ్య పరిస్థితి చూసి రవి కన్నా రాజు ఎక్కువ ఆందోళన చెందాడు.. ఎప్పుడూ అత్తయ్యని కనిపెట్టుకుని ఉండే వాడు.. డిశ్చార్జ్ చేసాక కూడా ఆఫీస్ కి వెళ్లడం మానేసాడు .. నేనే నచ్చజెప్పి ఆఫీసుకి వెళ్లేందుకు ఒప్పించాను..
అత్తయ్యను నేను జాగ్రత్త గా చూసుకుంటానని పదే పదే చెప్తే తప్పని సరిగా వెళ్ళేవాడు… ఆఫీస్ నుండి రాగానే అత్తయ్య దగ్గరే కూర్చుని ఆమె కి సేవలు చెసేవాడు.. కబుర్లు చెప్తూ అత్తయ్యకి బోర్ కొట్టకుండా చూసుకునే వాడు …
అత్తయ్యను నేను బాగా చూసుకుంటున్నాని నాకు చాల సార్లు థాంక్స్ చెప్పేవాడు..
‘అదేంటి రాజూ .. నాకు థాంక్స్ చెప్తావ్.. అత్తయ్యకి సేవ చేయడం నా బాధ్యత కాదా …” అంటే..
‘ అందరు కోడళ్ళు నీలా చూసుకోరుగా అక్షరా.. అందుకే నీకు థాంక్స్ చెప్తున్నాను” అనేవాడు..
మళ్ళీ తానే..” నీకు తెలీదు అక్షరా .. అమ్మ అంటే నాకెంత ఇష్టమో… అమ్మను ఈ రోజు ఇలా చూస్తుంటే నా గుండె తరుక్కు పోతుంది.. అమ్మే లేకపోతె ఈరోజు నేనెక్కడుండే వాడిని … ఏం చేసి నేను అమ్మ ఋణం తీర్చుకోగలను…. అమ్మకు నేనెంత చేసినా తక్కువే …” ఇలా చెప్పుకుంటూ పోయేవాడు ..
చిన్నప్పట్నుండీ అత్తయ్యతో తన అనుబంధాన్ని గురించి వివరంగా చెప్పేవాడు.. రాజు చెప్తూ ఉంటె నేను శ్రద్దగా వినేదాన్ని … అత్తయ్య గురించి మాట్లాడుతుంటే రాజుకి టైం తెలిసేది కాదు.. మా అమ్మా నాన్నల్తో కూడా నేను ఆలా లేనేమో అనిపించేది నాకు రాజు చెప్తుంటే…
కొన్నాళ్ళకి అత్తయ్య పరిస్థితి కొంచెం మెరుగయ్యింది.. ఆవిడ కోరిక మేరకు తనని ముంబైలోని ఇంటికి షిఫ్ట్ చేసాము.. తనకి అక్కడుంటే సంతోషంగా ఉంటుంది.. అందుకని అక్కడికి తీసుకెళ్లమంది.. నేనూ తనతో ఉంటాను అంటే అత్తయ్య వారించింది … రాజుని ఒక్కణ్ణే తనతో ఉంచుకొని మమ్మల్ని వెళ్ళిపోమంది.. తన ఇష్టప్రకారమే రాజుని మాత్రం ఉంచి మేము వచ్చేసాం… వారానికి ఒక సరి వెళ్లి చూసి వచ్చేవాళ్ళం.. రాజు పూర్తిగా ముంబైలోనే ఉండిపోయాడు..
Super excellent story.. keep taupe