ఇలా ప్రపంచంలోని అందాలన్నీ నీలోనే ఉన్నాయి – 4 50

కొన్నాళ్ళు అత్తయ్యకి బాగానే ఉంది.. పూర్తిగా బాగవుతుంది అని అనుకుంటున్న సమయంలో.. మరోసారి స్ట్రోక్ వచ్చింది.. ఈ సారి సివియర్ స్ట్రోక్ రావడంతో హాస్పిటల్ కి తీసుకెళ్లినా అత్తయ్యని మేము దక్కించుకోలేక పోయాము…

అది మాకందరికీ పెద్ద షాక్.. ఎవ్వరమూ ఆలా అనుకోలేదు.. ఒకరోజు తేడాతో అత్తయ్య మమ్మల్ని వదిలి వెళ్ళిపోయింది.. తట్టుకోవడం చాలా కష్టమైంది.. రవిని రాజుని ఓదార్చడం నాకు చేతకాలేదు.. ఎలాగో ఒకలా రవి కాస్త తేరుకున్నా రాజు మాత్రం తేరుకోలేకపోయాడు…
ఒంటరి వాడిలా ఫీల్ అయ్యేవాడు…. తనకి ఇక ఎవరూ లేరు అని ఏడ్చేవాడు..

అదేంటి రాజు మేమంతా లేమా అంటే ఏమీ మాట్లాడేవాడు కాదు.. ఆఫీసుకి వెళ్లడం పూర్తిగా మానేసాడు… అసలు తన గదిలోనుండి బయటకు రావడమే తగ్గించాడు..
భోజనానికి పిలిస్తే కొన్ని సార్లు వచ్చేవాడు.. కొన్నిసార్లు వచ్చేవాడు కాదు.. నేనే తన గదికి భోజనం తీసుకెళ్ళేదాన్ని..

రాజు పరిస్థితి గురించి రవి దగ్గర ప్రస్తావిస్తే…” వాడు అమ్మ మీద విపరీతమైన ప్రేమని పెంచుకున్నాడు అక్షరా.. ఒక రకంగా వాడు అమ్మ మీద ఢిపెండెంట్ పర్సన్. .. ఇప్పుడు అమ్మ లేకపోయే సరికి తట్టుకోలేకపోతున్నాడు.. మనకి కూడా బాధ ఉన్నా మనం ఇద్దరం ఒకరికి ఒకరం ఉన్నాం అన్న ఫీలింగ్ మన బాధని తగ్గిస్తుంది.. వాడికి ఆ అవకాశం లేదు కదా.. వాడికీ పెళ్లయి ఉంటె ఇంత బాధ పడేవాడు కాదేమో.. అసలు ఆ లావణ్య లంజ అలా మోసం చేయకుండా ఉండి ఉంటే ఎంత బాగుండేది.. ..

అది, ఆ ప్రకాష్ గాడు వాడి జీవితాన్ని నాశనం చేసినా వాడు ఇన్నాళ్లు అమ్మ ఇచ్చే ఓదార్పుతో బతుకుతూ వస్తున్నాడు… ఇప్పుడు అమ్మ దూరం అయ్యేసరికి వాడు బాధ భరించలేకపోతున్నాడు .. కాలం అన్ని గాయాల్నీ మాన్పుతుంది అంటారుగా.. అలాగే వాడూ కొన్నాళ్ళకు కోలుకుంటాడు.. అంతవరకూ మనం ఏమీ చేయలేము ..” అన్నాడు రవి…

రవి చెప్పినట్టు రాజుని కాలానికి వదిలేయడం నాకు ఇష్టం లేకపోయింది..
తనని ఇంతకు ముందులా మామూలుగా మార్చేందుకు నా ప్రయత్నం నేను చేయాలి అనుకున్నాను..
పనేం లేకపోయినా తన దగ్గర కూర్చొని ఏదో ఒకటి మాట్లాడేదాన్ని.. రవి దగ్గర రోజు వారీ బిజినెస్ విషయాలు తెలుసుకొని వాటిని రాజు వద్ద ప్రస్తావించి, వాటిల్లో డౌట్స్ అన్నీ రాజు దగ్గర అడిగేదాన్ని …

ఇంటర్నేషనల్ చెస్ గేమ్స్ కి సంబంధించిన ఎత్తులని తీసుకెళ్లి ఫలానా ఎత్తు ఆ ఆటగాళ్లు ఎందుకు వేసి ఉంటారు అంటూ చర్చ చేసేదాన్ని..
బయటకు వెళ్తుంటే నాకు తోడుగా రాజునే రమ్మని తీసుకెళ్ళేదాన్ని.. రాజు రాను అంటే.. రవికూడా రానంటున్నాడు నువ్వు కూడా రాకపోతే ఎలా .. అంటూ బలవంతం చేసైనా రాజుని తీసుకెళ్ళేదాన్ని.. ఒక సారి బయటకు వచ్చాక వీలైనంత ఆలస్యంగా ఇంటికి వెళ్లేలా చేసేదాన్ని..

ఏదో ఒకటి చేసి రాజుని మామూలుగా మార్చాలనే నా ప్రయత్నం అత్తయ్య పోయిన నాలుగయిదు నెలలకి ఫలించింది..
అత్తయ్య పోయిన బాధ నుండి రాజు కోలుకున్నాడు
తిరిగి ఆఫీసుకి వెళ్లడం మొదలు పెట్టాడు..
నాతో చెస్ ఆడుతున్నాడు..
సరదాగా మాట్లాడుతున్నాడు..
ఇప్పుడు రాజు తన జీవితంలో అత్తయ్య స్థానాన్ని నాకు ఇచ్చాడు…
ఒకరోజు..
“అమ్మ నాతో అమ్మలా కాకుండా ఓ ఫ్రెండ్ లా ఉండేది అక్షరా.. ఇప్పుడు ఆ ఫ్రెండ్ నాకు నీలో కనబడుతుంది ..: అన్నాడు…
నాకు చాలా సంతోషంగా అనిపించింది ఆ రోజు..
“నాక్కూడా నువ్వే బెస్ట్ ఫ్రెండ్ వి రాజూ ..” అంటూ బదులిచ్చా నేను..
ఏడాది కిందట నాతో మాట్లాడడానికే ఇబ్బంది పడ్డ రాజు ఈ రోజు నన్ను అత్తయ్య లాంటి ఫ్రెండ్ వి నువ్వు అనడం నాకు నిజంగా సంతోషంగా ఉంది..
రోజులు ఆనందంగా గడిచిపోతున్నాయి.. అయితే అన్ని రోజులూ అలాగే ఆనందంగా గడిస్తే అది జీవితం ఎందుకవుతుంది…
నా జీవితం ఎప్పుడూ సరళ లేఖలా సాఫీగా సాగలేదు… ఇప్పుడు కూడా అదే జరిగింది… ఒక పెద్ద కుదుపు నా జీవితంలో చోటు చేసుకుంది…
ఇక సాఫీగా సాగిపోతుంది అని నేను అనుకున్నటున్న సమయంలో నా జీవిత ప్రయాణం ఒక అనూహ్యమైన మలుపు తీసుకుంది..

ప్రకాష్ తో కలిసి ప్రారంభించిన వ్యాపారాన్ని మధ్యలోనే ప్రకాష్ కి అమ్మేశాక రవి, రాజులు మళ్లీ అదే వ్యాపారం సొంతంగా ప్రారంభించారు…
ఆల్రెడీ ఆ ఫీల్డ్ మీద చేసిన శ్రమ, రీసెర్చ్ అంతా వృధా కావద్దని వాళ్ళ ఉద్దేశ్యం… రవి పాత బిసినెస్ చూసుకుంటే రాజు ఈ కొత్త బిసినెస్ చూసే వాడు..
తక్కువ కాలం లొనే ప్రకాష్ కి పోటీ ఇచ్చే స్థాయికి పెరిగేలా చేసాడు రాజు … అయితే ఎప్పుడూ ప్రకాష్ కి పోటీగా అనుకునే వాడు కాదు.. ఎవరి బిసినెస్ వారిది అనుకుంటూ తన పని తాను చేసుకుంటూ వెళ్ళేవాడు…

అత్తయ్య సిక్ అయినప్పట్నుండీ అంటే ఇంచు మించు ఏడాదిగా రాజు సరిగా ఆఫీస్ కి వెల్లకపోవడం వల్ల ఆ బిసినెస్ కూడా రవే చూసుకుంటున్నాడు… రవికి తన బిసినెస్ పెంచుకోవడమే కాకుండా ప్రకాష్ ని ఆ బిసినెస్ లో లేకుండా చేయాలని మొదట్నుంచీ కసిగా ఉంది… కానీ రాజు వారించడంతో ఊరుకునే వాడు…
ఇప్పుడు రాజు రాకపోవడంతో తానే ఆ బిసినెస్ చూడడం మొదలు పెట్టినప్పట్నుండీ ప్రకాష్ ని ఎలాగైనా దెబ్బకొట్టాలని చూస్తున్నాడు…
అత్తయ్య పోయాక రాజు ఒంటరి వాణ్ణి అని ఫీల్ అవడానికి లావణ్యతో పాటు ప్రకాష్ కూడా కారణం అని రవి ప్రకాష్ మీద ఇంకా కోపం పెంచుకున్నాడు.. రాజు ఎలాగూ ఆఫీసుకు వెల్లకపోవడం వల్ల రవి ప్రకాష్ మీద ప్రతీకారం తీర్చుకోవాలని పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నాడు…

కార్పొరేట్ సెక్టార్ లో తనకు ఉన్న పలుకుబడిని అంతా ఉపయోగించాడు… ప్రకాష్ కి ముడి సరుకు సరిగా దొరకకుండా చేసాడు.. దొరికినా ఎక్కువ రేట్ పెట్టి కొనవల్సి వచ్చేది ప్రకాష్ కి..
కష్టపడి ఏదోలా ప్రొడక్ట్ తయారు చేసినా మార్కెటింగ్ లో కూడా ప్రకాష్ కి చిక్కులు తెచ్చి పెట్టాడు రవి…
ఆ విధంగా కొద్ది రోజులకే ప్రకాష్ తన బిసినెస్ ని నడపలేక అమ్ముకునే స్థితికి తీసుకొచ్చాడు… ప్రకాష్ అమ్మకానికి పెట్టాక కూడా ఎవరూ దాన్ని కొనేందుకు ముందుకు రాలేదు.. చివరికి రవే తక్కువ రేట్ కే ప్రకాష్ బిసినెస్ మొత్తం కొనేశాడు… రాజు తిరిగి ఆఫీస్ కి వెళ్లే సమయానికి ప్రకాష్ బిసినెస్ కూడా రాజు చేతికి వచ్చింది..

అయితే తన బిసినెస్ నష్టాలకు కారణం రవే అనే విషయం ప్రకాష్ కి తర్వాత తెలిసింది… అప్పటికే అంతా అయిపోయింది.. తనని నష్టపరిచిన వాడని తెలిసీ రవికే తన బిసినెస్ అమ్మాల్సి రావడం ప్రకాష్ కి చాలా అవమానంగా తోచింది…
దెబ్బకు దెబ్బ తీయాలని అనుకున్నాడు ప్రకాష్..
కానీ రవిని బిసినెస్ లో దెబ్బ తీయడం తన వల్ల కాదని ప్రకాష్ కి బాగా తెలుసు… రాజు, రవి ల సామర్థ్యం ఏంటో ప్రకాష్ దగ్గరనుండి చూసాడు..
కాబట్టి బిసినెస్ లో వాళ్ళను దెబ్బ కొట్టడం అతనికి అసాధ్యం…
అందుకని ప్రకాష్ ఇంకో మార్గాన్ని ఎంచుకున్నాడు…

ఒకరోజు రవి ఏదో పని మీద తాండూర్ వెళ్ళాడు….. పని ముగించుకొని కారులో తిరిగి వస్తుండగా వికారాబాద్ సమీపంలోని అనంతగిరి కొండల వద్ద.. ప్రకాష్ పంపిన రౌడీలు రవి కార్ ని ఆపారు… డ్రైవర్ ని, రవిని పక్కనున్న అడవిలోకి తీసుకెళ్లారు.. బలవంతంగా ఏదో ఇంజక్షన్ ఇవ్వడం వల్ల డ్రైవర్ స్పృహ కోల్పోయాడు…
తర్వాత వాళ్లు తమతో తెచ్చుకున్న కర్రలతో రవిని ఇష్టారీతిగా కొట్టడం మొదలు పెట్టారు… అప్పటికే చీకటి పడడంతో ఆ అడవిలో రవి కేకలు ఎవరికీ వినబడలేదు… ప్రకాష్ ఆ రౌడీలకి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టున్నాడు.. వాళ్ళు ఎక్కువగా కాళ్ళ మీదా, చేతుల మీద, నడుము మీద కొట్టారు.. తలకి దెబ్బలు తగలకుండా చూసుకున్నారు.. ప్రకాష్ ఉద్దేశ్యం రవి చనిపోకూడదు కానీ తిరిగి లేవకూడదు అని…

ఒక అరగంట పాటు దెబ్బల్ని తట్టుకున్న రవి స్పృహ కోల్పోయాడు… తర్వాత కూడా వాళ్ళు కొట్టారా లేదా అనేది ఎవరికీ తెలియదు…
ఇంజక్షన్ ప్రభావం తగ్గాక డ్రైవర్ మేల్కొనే సరికి రవి రక్తపు మడుగులో స్పృహ లేకుండా పడి ఉన్నాడు… వెంటనే డ్రైవర్ రాజుకి కాల్ చేసి విషయం చెప్పి రవిని వికారాబాద్ లోని ఒక హాస్పిటల్ కి తీసుకెళ్లాడు… అక్కడ ప్రైమరీ ట్రీట్మెంట్ చేసి హైదరాబాద్ తీసుకెళ్లమని డాక్టర్స్ చెప్పారు… ఈ లోపు రాజు వికారాబాద్ చేరుకొని రవిని హైదరాబాద్ కి తీసుకొచ్చి ఇక్కడ హాస్పిటల్ లో చేర్చాడు..

1 Comment

  1. Super excellent story.. keep taupe

Comments are closed.