అందమైన జీవితం 355

నేను : ఓకే…కానీ నేను ఎక్కడున్నానో అతన్ని అడగకూడదు.

ఆయన : ఓకే..ఓకే..

నేను : బిల్ క్లియర్ చేసిన వెంటనే వెళ్ళిపోవాలి..

ఆయన : ఓకే..

నేను : బయటకూడా నా కోసం చూడకూడదు. ఆగకుండా డైరెక్ట్ గా ఆఫీస్ కి వెళ్ళిపోవాలి.

ఆయన : అమ్మా, తల్లీ…అన్నిటికీ ఓకే..పంపించు.

నేను నవ్వుకొని, బేరర్ ని పిలిచి బిల్ ఆయన కి ఇమ్మన్నాను. బేరర్ బిల్ ఇవ్వగానే ఆయన పాపం ఏమీ అడగకుండానే పే చేసేసి వెళ్ళిపోయాడు. నేను మరో పావుగంట అక్కడే ఉండి, తరువాత ఇంటికి చేరుకున్నాను.

ఆయన వచ్చే టైముకి స్నానం చేసి, పింక్, బ్లూ కాంబినేషన్ ఉన్న చీర కట్టుకొని రెడీ అయ్యా. ఇంతలో ఆయన రానే వచ్చాడు. పలకరింపుగా నవ్వి, పోయి ఎప్పటిలాగే టీ.వీ ముందు కూర్చొని టీ ఆర్డర్ చేసాడు. నా చీర గుర్తించనందుకు నాకు మండిపోయింది. రుసరుసలాడుతూ టీ తయారుచేసి ఆయనకి విసురుగా అందించి ఎదురుగా నిలబడ్డాను. “అబ్బా, టీ.వీకి అడ్డులే నీరూ..” అన్నాడు టీ చప్పరిస్తూ. “టీ.వీ తరువాత చూడొచ్చు. ముందు నన్ను చూడండి.” అన్నాను. “కొత్తగా ఏం చూడాలే నిన్నూ! పక్కకి తప్పుకో.” అని కసురుకున్నాడు. నాకు ఆశ్చర్యమేసింది. పెళ్ళయిన ఇన్నాళ్ళుగా ఎప్పుడూ అలా కసురుకోలేదు. ఉక్రోషం వచ్చేసింది. “కొత్తగా ఏం చూడాలా? రాత్రి కొత్తగా ఏం కనిపించిందనీ, 34..26..34 అంటూ నలిపి పాడేసారూ?” అన్నా అదే ఉక్రోషంతో. ఆయన నవ్వేసి “అదా…దానికి వేరే కారణం ఉందిలే..” అన్నాడు. “అదే…ఆ కారణమే చెప్పండి.” అన్నా మొండిగా. “అబ్బా…అన్నీ చెప్పుకోగలిగే కారణాలుండవే…పోయి నువ్వు వంట చేసుకో..” అని మళ్ళీ కసిరాడు. ఇక ఆయన దగ్గర ఉండలేక కాళ్ళు టపటపా కొట్టుకుంటూ వంటగదిలోకి పోయాను. వెళ్ళిన పది సెకన్ల లోనే మెసేజ్ వచ్చింది. “ఏం చేస్తున్నావ్ బంగారం?” అని ఉంది. సెల్ ని నేలకేసి కొట్టాలనిపించింది. అంతలోనే తమాయించుకుంటూ “ఏంలేదు…ఖాళీగానే ఉన్నా.” అని మెసేజ్ పెట్టా. “అయితే సరదాకి ఒక ముద్దు పెట్టొచ్చుగా..” అని పంపాడు. “చచ్చినోడా..” అని తిట్టుకున్నా. ఎదురుగా ఇంత అందమైన పెళ్ళాం ఉంటే, కనీసం చూడడానికి మనసు లేదు గానీ, అదెవ్వత్తో, ఎలా ఉంటుందో తెలియని దానిని ముద్దులు అడిగేస్తున్నాడు. �మగబుద్ది..మగబుద్ది� అని మళ్ళీ తిట్టుకున్నా. ఇంతలో మళ్ళీ మెసేజ్ వచ్చింది “ఉమ్మా..ఉమ్మా..” అని. కంపరం వచ్చేసి, ఆ సెల్ ను డబ్బాలో పడేసాను. ఎందుకో మళ్ళీ మెసేజ్ రాలేదు. వంట అయ్యేవరకూ బయటకి వినబడకుండా ఏడుస్తూనే ఉన్నాను. వంట కాగానే బయటకు వచ్చి “వంట అయింది, రండి తిందురుగాని.” అన్నా. “ఆఁ..వస్తున్నా స్వప్నా..” అని పైకి లేచి, నన్ను చూసి నాలుక కరచుకొని “అదే..వస్తున్నా నీరూ..” అన్నాడు. “స్వప్న ఎవరూ?” అన్నా సూటిగా చూస్తూ. “అబ్బే…ఎవరూ లేరు.” అన్నాడాయన తడబడుతూ. “ఎవరూ లేకుండా ఆ పేరు మీ నోటి వెంట రాదు.

4 Comments

  1. Real romantic Super story

  2. Such a beautiful story

  3. లవ్ ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️యూ ఆంటీ beby ??????????

Comments are closed.