అందమైన జీవితం 355

రాత్రంతా గుడ్ నైట్ చేసిన నాకు కాఫీ తెమ్మని ఆర్డర్ వేసి, ముందుగా దీనికి గుడ్ మార్నింగ్ చెబుతావా…చెప్తా నీ పని..” అని కసిగా అనుకొని, “గుడ్ మార్నింగ్” అని రిప్లయ్ పెట్టి, ఆ సెల్ ని దాచేసి, స్టవ్ దగ్గరికి వచ్చా. ఆయన సెల్ సైలెంట్ మోడ్ లో పెట్టాడనుకుంటా. మెసేజ్ రిసీవ్ చేసుకున్న సౌండ్ కూడా రాలేదు. “ఈయనకి తెలివితేటలు బాగా పెరిగి పోతున్నాయ్.” అని ఉడుక్కొని, రెండు కప్పులు అందుకున్నా. అందులో పాలు పోసి, ఒక కప్పులో చక్కటి కాఫీ కలిపా. రెండో కప్పులో బోలెడంత కాఫీ పొడి వేసి, సుగర్ వేయకుండా కలిపేసి, మంచి కాఫీ నేను తీసుకొని, చెత్త కాఫీని ఆయనకి అందించా. ఆయన కాఫీ తాగుతుండగా, ఆయన మొహంలోకి చూసా. గరళాన్ని మింగిన శివుడు కూడా అంత ప్రశాంతంగా కనిపించడేమో. ఆనందం గా తాగేస్తున్నాడు. కొంపదీసి బాగుందేమో అని అనుమానం వచ్చి “కాఫీ బాగుందా?” అని అడిగాను. ఆయన నావైపు చూసి “మ్ఁ..బావుందే..” అన్నాడు. గబుక్కున ఆయన చేతిలోని కప్పు లాక్కొని టేస్ట్ చేసి తుపుక్కున ఊసేసి “ఇంత చెత్తగా ఉంటే అంత ప్రశాంతంగా ఎలా తాగేస్తున్నారండీ?” అన్నాను. నిజంగానే కాస్త బాధ వేసింది. “ఏమోనే ఎప్పుడూ బాగానే కలిపే నువ్వు, ఏదో అలోచనల్లో పడి ఇలా కలిపావనుకున్నా…ఒక్కసారి బాగోపోతే ఏమయ్యిందీ? ఇచ్చింది నువ్వే కదా.” అన్నాడు. ఒక్కసారిగా ఆయనకి నా మీద ఉన్న ప్రేమకి ఏడుపొచ్చేసింది. “సారీ అండీ..” అంటూ ఆయనా గుండెలపై వాలిపోయా. ఆయన నా తల నిమురుతూ “ఇదిగో..ఇలా బాధ పడతావనే చెప్పలేదు.” అని తలపై ముద్దు పెట్టుకొని, “లే…లేచి స్నానం చెయ్.” అన్నాడు. నేను మురిసిపోతూ ఆయన బుగ్గపై ముద్దుపెట్టి లోపలకి పోయా.

తరువాత మరో రెండు గంటలకి ఆయన ఆఫీస్ కి వెళ్ళిపోయాడు. వెళ్ళగానే డబ్బాలోంచి సెల్ తీసా. మనసులో రకరకాల ఆలోచనలు. అనవసరంగా ఆయన్ని పరస్త్రీ వ్యామోహంలో పడేస్తున్నానా? అంతలోనే ఉదయం ఆయన చూపించిన ప్రేమ గుర్తుకొచ్చింది. అంత ప్రేమ ఉన్న వ్యక్తి అసలు వేరే అమ్మాయికి పడతాడా? రకరకాల ఆలోచనలు. మెసేజ్ పెడదామా, వద్దా…మనసు అటూ ఇటూ కొట్టుకుంటుంది. ఇంతలో ఆ సెల్ కి మెసేజ్ రానే వచ్చింది. “ఏం చేస్తున్నారు మేడమ్?” అంటూ. ఇక ఫిక్స్ అయిపోయాను ఆయన దుంప తెంచాలని.

నేను : సార్ ఏం చేస్తున్నారా అని ఆలోచిస్తున్నా…

4 Comments

  1. Real romantic Super story

  2. Such a beautiful story

  3. లవ్ ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️యూ ఆంటీ beby ??????????

Comments are closed.