ఒక స్త్రీ యొక్క జీవిత గాధ 214

నిధి తన పని తాను చూసుకుంటుండగా అటెండర్ వచ్చి మేడం మేనేజర్ శ్రీనివాస్ గారు రమ్మంటున్నారు అన్నాడు, సరే వస్తున్నా పద అంటూ అటెండర్ తో పాటే మేనేజర్ కేబిన్ కి వెళ్ళింది. గుడ్ మార్నింగ్ సర్ పిలిచారంట, ఏమీ లేదు నిధి ఈ రోజు సుజన రాలేదు కదా క్లైంట్ కి మెయిల్ చేయాలి ఆ పని కూడా కొంచెం చూడరా. అలాగే సర్ అంటూ తన కేబిన్ వైపు వచ్చి టైం చూస్తే భోజనం వేల ఐంది ఏంటో తెలియకుండానే టైం మొత్తం గడిచి పోతుంది అనుకుంటూ లంచ్ తినడానికి కాంటీన్ కి వెళ్ళి ఏదో తిన్నాం అంటే తిన్నాం అన్నట్టు వచ్చి మేనేజర్ చెప్పిన పని పూర్తి చేసి తన వర్క్ కంప్లీట్ చేసుకోసాగింది. సాయంత్రం బస్ లో వెళుతుంటే మహి వచ్చి తన పక్కన కూర్చుంటూ ఏంటండీ ఎలా గడిచింది ఈ రోజు అంటూ మాటలు కలిపాడు, ఏమీ లేదండీ అంతా మామూలే , మీకెలా గడిచింది అంది నిధి, నాది సేమ్ మీలానే అంతా నార్మల్, ఉదయం నుండి వర్క్ లో బాగ స్ట్రేన్ అయ్యి తల నొప్పిగా ఉంది, ముందు ఒక కాఫీ షాప్ వస్తుంది అక్కడ కాఫీ చాల ఫేమస్ ఏమీ అనుకోకపోతే కొంచం కంపనీ ఇస్తారా అన్నాడు, నిధి కి కూడా వర్క్ ఎక్కువ గానే ఉండటం వలన కాదనలేక సరే అంది.

ఇద్దరు కాఫీ షాప్ దగ్గర బస్ దిగారు, ఇద్దరికి చెరొక కాఫీ ఆర్డర్ చేసి, ఏంటండి పెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నారు అంటూ అడిగాడు, అయ్యో నాకు పెళ్ళయ్యి ఒక బాబు కూడ ఉన్నాడండి అంది నిధి. మిమ్మల్ని చూస్తుంటే అసలు పెళ్ళైన వాళ్ళలానే లేరు ఇక ఒక బిడ్డ తల్లి అంటే ఎవరు నమ్ముతారు చెప్పండి అన్నాడు. నిజమండీ నమ్మకపోతే చూడండి అంటూ తన మెడలోని తాళి బొట్టును చూపించింది. ఛ ఇంత అందమైన అమ్మాయిని భార్య గా పొందేందుకు మీ హబ్బి పోయిన జన్మ లో ఏదో యజ్ఞం చేసుంటాడండి అంటూ తన కళ్ళలోకి చూసాడు. ఆ మాటకి నిధి బుగ్గలు ఎరుపెక్కసాగాయి. మీరు మరీ పొగుడుతున్నారు కానీ నేనేమి అంత అందగత్తేని కాదులెండి అంది. అయ్యో నిజమండీ ఇలా అందం గా ఉండి అబద్దాలు ఆడితే ఆడపిల్లలు పుడతారు జాగ్రత్త అండి అన్నాడు మహి. ఇంతలో గిరి ఫోన్ చేస్తుండటం తో నిధి ఫోన్ లిఫ్ట్ చేసి…
నిధి : హల్లో చెప్పండి.
గిరి : నిధి ఈ రోజు నైట్ ప్రాజెక్ట్ పని మీద ఢిల్లీ వెళ్ళాలి, లగేజ్ సర్ది ఉంచవా.
నిధి : సరేలే అండి, ఎన్ని రోజులు ఉంటారు అక్కడ?
గిరి : ఓ 15 రోజులు పడుతుంది.
నిధి : హ్మ్ సర్ది ఉంచుతాను, బాయ్
గిరి : బాయ్
నిధి మహి వైపు చూస్తూ సరే అండి కొంచెం పని ఉంది వెళ్ళాలి అంటూ లేచింది. మహి కూడా నవ్వుతూ థాంక్స్ అండి ఇప్పటి వరకు ఒక అందమైన వ్యక్తి తో కాఫీ తాగే అవకాశం ఇచ్చినందుకు అన్నాడు. దీంట్లో ఏముంది లెండి అంటు వెళ్ళబోతూ తిరిగి మీ మొబైల్ నంబర్ ఇస్తారా అంది. సరే అంటు మహి తన నంబర్ ఇచ్చాడు.నిధి వచ్చే బస్ ఆపి ఇంటికి వెళ్ళి పోయింది.

ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి గిరి లగేజ్ సర్దటం మొదలుపెట్టింది, నిధి అత్తయ్య వచ్చి ఏంటమ్మా ఎక్కడికన్నా వెళ్తున్నారా అని అడిగింది. నేను కాదు అత్తయ్య ఆయన ప్రాజెక్ట్ పని మీద ఢిల్లీ వెళ్తున్నారు అందుకని తన లగేజ్ సర్దుతున్నాను అంది. సరే అంటు హాల్లోకి వచ్చి రీతిక్ తో పాటు TV చూడసాగింది. టైం 8 అవుతుండగా గిరి ఇంటికి వచ్చాడు, నిధి ఎక్కడ అంటు వాళ్ళ అమ్మను అడగ్గా లగేజ్ సర్దుతుంది పైన అంది, సరేనంటూ రీతిక్ ని ఎత్తుకుని కాసేపు ఆడించి పైకి వెళ్ళాడు.