ఒక స్త్రీ యొక్క జీవిత గాధ 214

నిధి : ఆహా.! కొంపదీసి ఏ ఫిజికల్ ప్రాబ్లమ్ లేదుగా..? హా హ్హ..!
ఎంత సేపైనా రిప్లై రాకపోవటంతో హర్ట్ అయ్యాడెమో అనుకుని, ఫోన్ పక్కన పెట్టి ఆలోచనలో పడింది. ఏంటి పరిచయం అయ్యి 3 రోజులు కూడా కాలేదు, తనతో ఇంత క్లోజ్ గా మాట్లాడుతున్నాను , ఐన మోగాన్ని పట్టుకుని నీకు మగతనం ఉందా అంటే ఎవరు ఫీల్ అవకుండా ఉంటారు..ఛ అనుకుంటూ నిద్ర పోయింది.

మరునాడు లేచి వంట పూర్తి చేసి ఆఫీస్ కి బయలుదేరింది. ఎప్పుడూ రెండు స్టాప్ ల తర్వాత బస్ ఎక్కే మహి ఎందుకో కనపడలేదు. ఛ బాగా ఫీల్ అయ్యుంటాడు అనుకుంటూ ఫోన్ తీసి సారీ అంటూ మెసేజ్ పెట్టింది. ఎంతసేపటికి రిప్లై రాలేదు. ఇక తన ఆఫీస్ రావటంతో దిగి ఆఫీస్ లోకి వెళ్ళిపోయింది. వెళ్ళి తన కేబిన్ లో కూర్చున్నా ఏదో గిల్టీ ఫీలింగ్. ఏమవుతుందో చూద్దాం అనుకుంటూ పనిలో పడిపోయింది. సాయంత్రం ఐన కనపడతాడు లే అనుకుంటే నిరాశే ఎదురైంది నిధి కి. ఇంటికి వెళ్ళి ఏదో తిన్నాం అన్నట్టు తిని పైకి వెళ్ళి పడుకుంది. ఒక సారి కాల్ చేసి చూద్దాం అంటూ మహి కి కాల్ చేసింది. ఎంత సేపైనా అవతలి నుండి నో రెస్పాన్స్. ఇక అలానే పడుకుండి పోయింది.
మరుసటి రోజు కూడా అదే పరిస్తితి. ఎన్ని మెసేజ్ లు ఫోన్ లు చేసినా నో రెస్పాన్స్. ఐన ముక్కు మొహం తెలియని వాడి గురించి ఇంతలా ఎందుకు ఆలోచించాలి, అతనేమన్నా నా భర్త, లవర్ ఆఆ, జస్ట్ బస్ లో కలిసాడు కాస్త కలివిడిగా మాట్లాడాడు అంతేగా అనుకుని ఆఫీస్ కి బయలుదేరింది. ఆఫీస్ లో పని ఎక్కువ గా ఉండటం వలన 7 గంటలకే ఇంటికి వెళ్ళాల్సింది 8:30 ఐంది, ఇంటికి ఫోన్ చేసి కొంచెం లేట్ అవుతుంది అని తన అత్తయ్యకు చెప్పింది. ఆఫీస్ నుండి బయటపడేసరికి 9:30 ఐంది. పని ఒత్తిడి కారణంగా తల నొప్పిగా అనిపించి దారిలో కాఫీ షాప్ దగ్గర బస్ దిగి కాఫీ ఆర్డర్ చేసి కూర్చుంది. పైనేమో మబ్బులు పడుతున్నట్లు అనిపించింది. కాఫీ తొందరగా వస్తే బాగుణ్ణు వర్షం పడేట్టు ఉంది అనుకుంటుండగా కాఫీ వచ్చింది. గబ గబ కాఫీ తాగి ఎదురు ఉన్న బస్స్టాండ్ వైపు వెళ్ళి నిలబడింది. చిన్నపాటి ఉరుముల, మెరుపులతో చిన్నగా చినుకులు పడటం స్టార్ అయింది.
హా ఏంట్రా దేవుడా ఈ టైం లో వర్షం, బస్ కూడా వచ్చేట్టు కనపడట్లేదు అనుకుంటుండగా ఒక బైక్ వచ్చి తన ముందు ఆగింది. ఎవరా అని చూస్తే మహి, ఎక్కు అన్నట్టు హారన్ కొడుతున్నాడు. కానీ నిధి మాత్రం తనకు పట్టనట్టు అలానే బస్ కోసం వెయిట్ చేస్తుంది. ఐన అన్ని మెసేజ్ లు, కాల్స్ చేసిన రెస్పాన్స్ ఇవ్వడా అనుకుంటూ తన వైపు ఒక రకంగా చూసింది. తను నవ్వుతూ ఇక వచ్చి ఎక్కు తడిసిపోతున్నా అనే సరికి కొంచెం కోపంగా వెళ్ళి బైక్ పై కూర్చుంది. కాసేపు ఇద్దరి మద్య మౌనం. ఏంటి ఏం మాట్లాడవా, ఐన నిధి ఉలకలేదు పలకలేదు. ఏంటో బెట్టు చేయాల్సిన నేనే మాట్లాడుతుంటే నువ్వు బెట్టు చేస్తున్నావ్ అన్నాడు. మరి చెయ్యరా మెసేజ్ చేసా రిప్లై లేదు, ఫోన్ చేసా ఆన్సర్ లేదు ఏమనుకోవాలి అంది నిధి కొంచెం కోపంగా. అదా పని ఉండి ముంబై వెళ్ళాను సారీ అన్నాడు. హ్మ్ ఒకె లే సారీ అనవసరం గా నిన్ను నీ పర్సనల్ విషయాలు అడిగి బాధ పెట్టినందుకు అంది. హే అదేం లేదులే వదిలేయ్ అన్నాడు. హ్మ్ ఒకె మరి ఎందుకు పెళ్ళి చేసుకోలేదు అంది నిధి. నాకు ఇలా ఉంటేనే ఇష్టం నిధి పెద్దోళ్ళు మనల్ని చెట్టుకి బర్రేని కొట్టేసినట్టు, సంసారానికి కట్టేస్తారు ఇక అప్పటి నుండి మన లైఫ్ ని ఎంజాయ్ చేయలేం అన్నాడు మహి ల. అంటే ఇక పెళ్ళి చేసుకోవా అంది నిధి. చూద్దాం నీలాంటి అమ్మాయి దొరకాలి కదా అన్నాడు. అబ్బో ఏంటో ఈ మద్య తెగ పొగిడేస్తున్నారు, ఏంటి విషయం అంది. పైకి అలా అన్న తన అందాన్ని పొగుడుతుంటే మనసులో చాల గర్వం గా అనిపించింది.