కామదేవత – Part 29 95

నేనేమన్నా శంకరానికి పెళ్ళాన్నా.. మాటిమాటికీ వాడికి కాఫీలు, టిఫెనులు, భోజనాలు పట్టుకెళ్ళి ఇవ్వడానికి..? వాడు అద్దె నీకు కడుతున్నాడు, సేవలేవన్నా చెయ్యాలంటే నీకు చేస్తున్నాడు.. నీకు వాడిమీదేమన్న ప్రేమవుంటే నువ్వెళ్ళి వాడికి కాఫీలు, టిఫెనులూ.., భోజనాలు పట్టుకెళ్ళి నీచేతులతో తినిపించుకో.. నేనేమీ వాడి పెళ్ళాన్నీ కాదు.. వాడికి బంట్రోతునీ కాదు అని విసురుగా చెప్పేసింది సుబద్ర.

అదేమిటే.. రోజూ అతనికి అన్నీ నువ్వే తీసుకువెళ్ళి ఇచ్చేదానివని నిన్ను అడిగేనే అన్నాది గౌరి..

ఇంతకుముందేమన్నా ఇచ్చేనేమో.. ఇకమీదట ఇవ్వనని చెపుతున్నానుగదా.. నీకు కావాలంటే నువ్వు పట్టుకెళ్ళి ఇచ్చుకో.. విసురుగా చెప్పేసింది సుబద్ర..

ఏమిటో ఈ పిల్లా.. ఇంతలోనే ముఖాన్ని మాడ్చేసుకోవలసినత విషయం ఏముంది ఇందులో అనుకుంటూ గౌరినే లెచి వెళ్ళి కాఫీని శంకరానికి ఇచ్చి వొచ్చింది.

ఆరోజంతా సుబద్ర శంకరానికి ఎవీ పట్టుకెళ్ళి ఇవ్వనని మొండికేసి కూర్చోవడంతో రోజంతా గౌరినే శంకరానికి అన్ని అందించి రావలసి వొచ్చింది.

ఆరోజు అలా గడిచిపోయింది..

1 Comment

  1. Continue this story very anxiety story

Comments are closed.