చంటి గాడి కథలు 2 324

అంటూ నేను కాస్త పరిశీలనగా చూసా శ్వేతను.చాలా పద్దతిగా చుడిదార్లో ఉన్న శ్వేతను చూస్తే పదే పదే తననే చూడాలి అనిపిస్తుంది నా కళ్ళకిి.అలా వెళ్తూ ఉండగా సడన్గా శ్వేతా నన్ను అపి
శ్వేత:అవిగో చంటి ,ఇక్కడ నుండి ఆ గట్టు వరకు ఉన్న పొలాలు అన్నీ అత్తయ్య వాల్లవే,ఇటు కూడా కని చూపు మేరలో ఉన్నవన్ని వాళ్ళవే అంటూ నా ముందు అటు ఇటు కదులుతూ ఉంది.నేను మాత్రం అవి ఏవి పట్టనట్టు తననే చూస్తూ ఉండిపోయాను.

ఇంతలో
శ్వేత:హ్మ్మ్ చూసింది చాల్లే ఇక వెళ్దామా?అంటూ నా మొహంలోకి సూటిగా చూస్తూ అడిగింది.నేను చూపు మరల్చుకొని “ఏంటి?”అని అడిగా.శ్వేత:అదే పొలాలను చూడ్డం అయిపోతే ఇంటికి వెల్దాము అని కాస్త ఇబ్బందిగా అన్నట్లు మొహం కిందకు చూస్తూ నిలబడింది .నేను:అలాగే శ్వేత అయిపొయింది .వెళ్దాం పద శ్వేత అంటూ ముందుకు నడవబోయాను
శ్వేత:ఏయ్ నేను నీకంటే పెద్దదాన్ని పేరుతొ పిలుస్తావేంటి?అక్క అని పిలువు అని కాస్త కోపంగా అంది
నేను:ఏమో నిన్ను ఆలా పిలవడం నాకు నచ్చదు అని ఉన్నమాట చెప్పాను
శ్వేత:ఎందుకు నచ్చదు?అని కాస్త కోపంగా అరిచి చేతులు తన నడుము మీద పెట్టి నా వైపు తిరిగింది.

నేను:ఏమో నాకు తెలీదు?అంటూ కోపంగా ఉన్న తనను చూడకుండా నేెలవైపు చూపు తిప్పాను.
కాసేపు నిశ్శబ్దం. శ్వేత ఏమి మాట్లాడట్లేదేంటి అని తల ఎత్తి చూసా ,కానీ అక్కడ చూసిన సీన్కి నా మతి పోయింది.కాస్త దూరంలోఎవడో శ్వేత నోటిని వాడి చేతితో మూసేసి తనను గట్టిగ పట్టుకొని నా వైపు చూస్తున్నాడు. అప్పుడు నేను గందరగోళంతో “శ్వేత “అంటూ వాడి మీదకి పరిగెత్తాను.కానీ నేను ఒక్క అడుగు వేశానో లేదో ఎవడో నా వీపు మీద మొద్దులాంటి దాంతో గట్టిగా కొట్టాడు.ఆ దెబ్బకి నేను ఎగిరి శ్వేత కాళ్ళ దగ్గర ఉన్న రాయికి నా తల తగిలి స్పృహ తప్పి పడిపోయా.

కొద్దిసేపటికి శ్వేత”చంటి”అంటూ అరవడం నాకు వినిపించింది.నేను కాళ్ళు తెరిచి చూసేటప్పటికి శ్వేతను ఒకడు లాక్కొని వెళ్తున్నాడు వెనకే ఇంకా ఇద్దరు ఉన్నారు.వాళ్ళంతా పంచెలతో ఉన్నారు.అప్పుడు నాకు ఏమి చేయాలో అర్తంకాలేదు.కానీ శ్వేతను తీసుకెళ్తున్నప్పుడు తన ఏడుపు మాత్రమే నాకు వినిపించింది.ఒక్క ఉదుటున లేచి పక్కనే ఉన్న ఒక పెద్ద కర్రతో పరిగెత్తుకుంటూ వెళ్లి వెనుక ఉన్న వాడి తల పగులగొట్టాను.వాడు అమ్మ అంటూ నెలకు కరుచుకున్నాడు.మిగతా ఇద్దరు శ్వేత ను వదిలి పక్కన ఉన్న కట్టెలు తీస్కొని నా వైపు వచ్చారు.