జీవితం ఒక కాల ప్రవాహం 1 175

అమ్మ చెల్లితో ఒక ఫేమస్ కాలేజ్ లోకి వెళ్లి చెల్లిని ఆ కాలెజ్ లో జాయిన్ చేసి ఆ కాలేజ్ లొనే హాస్టల్ కూడా జాయిన్ చేసి చెల్లికి జాగర్తలు చెప్పి బయటకి వచ్చాము అమ్మ నేను . ఎక్కడ ఉండాలో తెలియక లాడ్జి కి వెళ్ళాము . లాడ్జి లో దిగి రూమ్ లోకి వెళ్లి రెస్ట్ తీసుకుంటుంటే ఎవరో తలుపులు కొడుతుంటే తీసాను . ఎదురుగా పోలీసులు నన్ను తోసుకుని లోపలికి వచ్చి నన్ను అమ్మను పద మన్నారు ఎక్కడికి అన్నాను నేను . పోలీస్ స్టేషన్ కి అన్నాడు .నేను ఎందుకు మేమేమి తప్పుచేసాము అని అంటే అన్ని తెలుస్తాయి పదండి అంటూ నన్ను అమ్మని జీప్ లో ఎక్కించారు , మాతో పాటు కొందరు ఆడవాళ్లు ని ఎక్కించారు . జీప్ స్టార్ట్ చేసి పోనిస్తున్నారు . అందులో ఒక ఏడాది కలిపించుకొని ఫ్రెష్ గా నలగని పువ్వులా ఉన్నావు ఏమిటి కొత్తనా అంది . నేను మధ్యలోకి దూరి ఏంటి కొత్త అని అన్నాను . వ్యభిచారం అంది . నాకు అప్పుడు అర్థం అయ్యింది పోలీసులు ఎందుకు తీసుకెళ్తున్నారో . నేను ఇంకా అప్పులు ఎగ్గొటేసాము అని అప్పులవాళ్ళు కంప్లెయింట్ ఇస్తే తీసుకొచ్చారు అనుకున్నాను . వాళ్ళ మాటలకి జవాబు ఇవ్వకుండా కామ్ గా ఉన్నాము అమ్మ నేను . పోలీస్ స్టేషన్ కి తీసుకొని వెళ్లారు . అందర్నీ లోపలికి తీసుకొని వెళ్లారు ఒక పక్కాగా నుంచున్నాం అమ్మ నేను . ఒక్కొకరిగా కేసులు పైల్ చేస్తున్నాడు రైటర్ . మా వంతు వచ్చింది అమ్మని పేరు అడిగాడు రైటర్ సార్ మేము అలాంటి వాళ్ళము కాదు అమ్మ కొడుకులం అని వాపోతున్న పట్టించుకోలేదు . అప్పుడే అటుగా సిఐ వస్తూ మమ్మల్ని చూసి దగ్గరికి వచ్చి ఏంటి విషయం అని అడిగాడు . నేను విషయం చెప్పగానే సిఐ రైటర్ మీద కేకలు వేసి తప్పు ఐపోయింది మీరు అంత వెళ్లిపోవొచ్చు అన్నాడు . నేను చాలా థాంక్స్ సార్ అన్నాను .అయ్యో ఇంత మాత్రానికేనా నేను అసలు ఈ పొజిషన్ లో ఉన్నాను అంటే కారణం మీ తాతయ్య మీ నాన్నగారు పుణ్యమే బాబు అంటూ అమ్మకి నమస్కారం చేసాడు . నువ్వు పరమశివం కదూ అంది అమ్మ అవునన్నటు తలుపాడు సిఐ . సరే బాబు మీరు వెళ్ళండి మీకు ఏదయినా ప్రోబ్లం వస్తే నాకు కాల్ చేయండి అని ఫోన్ నెంబర్ ఇచ్చాడు . నేను నెంబర్ తీసుకొని బయటకు వస్తుంటే చాలా థాంక్స్ బాబు మీ రుణం ఉంచుకోలేము అంటూ నమస్కరించారు వ్యబిచారులుగా మాతో పాటు వచ్చిన ఆడవాళ్ళు .ఇందాక మాతో పాటు అందర్నీ బయటకు పంపేసాడు సిఐ . బాబు ఇప్పటివరకు ఎప్పుడు ఇలా స్టేషన్ కి వచ్చి తిరిగి మాములుగా వెళ్ళింది లేదు ఆ సిఐ అంత వినయంగా మాట్లాడుతూ చూడడం ఇదే ప్రధమం అంటూ నమస్కరించింది 30 సంవత్సరాల పడతి . మాకు ఇదే జీవనాధారం బాబు ఇదే చెయ్యొదు అంటే మా బతుకులు ఎలా నడవాలి ఇంట్లో వాళ్ళని ఎలా బ్రతికించాలి అంటూ కన్నీరు పెట్టుకోసాగింది . నాకు వాళ్ళ మాటలకి జాలి మరియు ఆలోచన తట్టింది . వాళ్ళందర్ని హోటల్ కి తీసుకెళ్లి భోజనాలు పెట్టించి తిన్నకా వాళ్ళను అలా పార్క్ లోకి తీసుకెళ్లను . మొత్తం 5 గురు ఉన్నారు , 20 నుండి 40 వరకు ఉంటాయి వయసులు . అందర్నీ ఒక చోట కూర్చోబెట్టి మాట్లాడటం మొదలు పెట్టాను . మీరు తప్పక చేస్తున్నారు మేము కూడా అంతే అంటూ మళ్ళీ గొంతు సవరించుకొని మొదలు పెట్టాను మీకు అండగా నేను ఉండి మీ సమస్యలు తీరుస్తాను మీరు నాతో రావాలి నేను చెప్పినట్టు చేయాలి అన్నాను . సరే బాబు మీ ఇష్టం మీరే మాకు దిక్కు అంది ఇంకో యువతి .