నా భార్య నన్ను ఎందుకు మోసం చేసింది 17 48

తరువాతి వారంలో మీరాకు చికిత్స చేస్తున్న డాక్టర్ సిఫార్సు చేసిన మానసిక వైద్య నిపుణులు (సైకియాట్రిక్ స్పెషలిస్ట్ ) డాక్టర్ అరుణ్ ను కలవడానికి మీరాను తీసుకువెళుతున్నాడు
ఆమె ఇంతకు ముందు వెళ్ళన ఆసుపత్రి కాకుండా వేరే ఆసుపత్రికి వెళ్ళడం గమనించి దారిలో మీరా భయాందోళనలకు గురైంది
ఆమె మామూలుగా మౌనంగా ఉంటుంది
ఆమె అంతటి ఆమె మాట్లాడేది కాదు
కానీ ఆమెతో మాట్లాడే వారితో ప్రతిస్పందిస్తుంది
పిల్లలు కొన్ని సార్లు శరత్ తో

మనం ఎక్కడికి వెళుతున్నాము
వేరే ఆసుపత్రికి ఎందుకు మీరా అడిగింది

చింతించకండి మీరా మనము కొత్త వైద్యుని
దగ్గరికి వెళుతున్నాము
మన పాత వైద్యుడు అతనికి మనల్ని సిఫార్సు చేసాడు అని శరత్ భరోసాగా చెప్పాడు

వాస్తవానికి వైద్యుడిని ఎందుకు కలవాలి నాకు తెలియడం లేదు నేను బాగానే ఉన్నాను
ఆమెతో ఓదార్పుగా మాట్లాడుతూ శరత్ ఆసుపత్రి చేరుకున్నారు
సహాయక సిబ్బందితో డాక్టర్ అరుణ్ గారి గురించి అడిగినప్పుడు వారు ఆసుపత్రి రెండో అంతస్తులో ఉన్న అతని గదికి పంపించారు

డాక్టర్ మరొక రోగితో ఉన్నందున అక్కడ కాసేపు వేచి ఉన్నారు
వారి సమయం కంటే 15 నిమిషాల ముందుగానే ఉన్నారు
అక్కడ వేచి కూర్చుని ఉండగా మీరా మరింత భయపడుతూ ఉండటం శరత్ చూడగలిగాడు
చివరికి కాసేపటికి ఒక జంట వారి సంప్రదింపులు పూర్తి చేసుకోని డాక్టర్ గది నుండి బయటకు వచ్చారు
డాక్టర్ సహాయకురాలు శరత్ మరియు మీరాను లోపలికి వెళ్ళమని కోరాడు…..

డాక్టర్ అరుణ్ వయసు నలభై ఏళ్ళకు అటుఇటుగా అనిపిస్తుంది చూడడానికి
అతనితో మాట్లాడితే రోగి గుణం నయం చేయగల
శాంతియుత దయాగుణం అతని ముఖం పైన ఉంది అతనికి ఇది ప్రత్యేకమైన గుర్తింపు తెస్తుంది

లోపలికి రండి మిస్టర్ శరత్ మీరా గారు
అతను చిరునవ్వుతో వారిని హృదయపూర్వకంగా పలకరించాడు
డాక్టర్ గణేష్ (ఇంతకు ముందు మీరాకు చికిత్స చేసిన డాక్టర్)మీ గురించి నాకు వివరించాడు
దయచేసి కూర్చుండి

డాక్టర్ అరుణ్ సాధారణంగా వారి నేపధ్యం గురించి వయస్సు విద్య నివాసం వృత్తి మొదలైన వాటి గురించి అడగడం మొదలుపెట్టాడు
అతని ఓర్పు గల మాటలు నెమ్మదిగా మీరా భయాందోళనలను దూరం చేయడం ప్రారంభించాయి