నిన్ను నా రాణిని చేసుకుంటాను 266

అయినా ఇవన్నీ కేవలం వదంతులని కొందరు కొట్టి పారేస్తుంటారు. ఎందుకంటే , వీరి కళ్ళల్లోపడి వెనక్కి వచ్చిన వారు ఎవ్వరైనా ఉంటే కదా ఏది నిజమో తెలియటానికి. పురుషులైతే వీరి చేతిలోచస్తారు. స్త్రీలైతే బంధీలుగా ఉంటారు. ఇక బయటి ప్రపంచానికి వీరి ఆచార వ్యవహారాలు ఎలా తెలుస్తాయి. కేవలం తరతరాల నుండి తెలిసిన విషయాలనే జనాలు చెప్పుకుంటారు. అయితే ఈతెగవారు మలయాళీల భాష మాట్లాదుతారని మాత్రం ఖచ్చితంగా చెప్పుకుంటారు.

ఇక ప్రస్తుత కథ లోనికి వస్తే , సాయంత్రానికి డైరెక్టరు షూటింగ్ పూర్తి చేసేసాడు. ఆఖరిరోజు కావడంతోనూ, గడచిన పది రోజులూ ప్రశాంతంగా గడవడంతో యూనిట్ సభ్యులు కాస్త రిలాక్సెడ్ గా ఉన్నారు. సెక్యూరిటీ వాళ్ళు కూడా అలా అడవి చూడ్డానికి వెళ్ళారు.

మాధవి మాత్రం చక్కగా తలారా స్నానం చేసి, తన కోసం ప్రత్యేకంగాకట్ట బడిన ఆధునిక గుడారంలోనికి వెళ్ళి, తెరలు దగ్గరగా లాగి నైట్ గౌన్ వేసుకుని పడుకుంది. సినిమా హిట్ అవుతుందన్న నమ్మకంతో, దానితో పెరగబోయే తన రేంజ్ గురించి ఆలోచిస్తూ పడుకుంది. అలాగే నిద్ర పట్టేసింది. ఆ రాత్రి చాలా ప్రశాంతంగా గడిచింది. తూర్పు తెల్లవారే సమయానికి పెద్ద పెద్ద అరుపులతో, బలమైన అడుగుల చప్పుళ్ళతో మాధవికి మెలకువ వచ్చింది. ఏదో అనర్థం జరుగుతోందని అర్థమైంది. అనర్థాన్ని శంకించి చెదరిన నైటీని సరిచేసుకుంటూ నేలపై పాకుకుంటూ మంచం క్రిందికి వెళ్ళిపోయింది. బయట చాలా భీభత్సం జరుగుతోందని స్పష్టంగా తెలుస్తోంది. తమను చంపవద్దని ఎవరినో బతిమాలుతున్న తమ యూనిట్ సభ్యుల వేడికోళ్ళూ, ఎవరివో సింహనాదాలు, చనిపోతున్న వ్యక్తుల ఆర్తనాదాలతో మాధవికి పై ప్రాణాలు పైకే పోయినట్లైంది. రక్షించమని అరుస్తున్న తమ యూనిట్ లేడీ ఎగస్ట్రా డాన్సర్ల గొంతులు మాత్రం వినిపిస్తున్నాయి. ఒక పావు గంట గడిచేసరికి అక్కడ బయట ఒక విపరీత గందర గోళం నెలకొంది.

ఈలోగా బలమైన అడుగుల చప్పుడు ఆమె ఉన్న గుడారం ప్రక్కనే వినపడింది. తన గుండె చప్పుడు తనకే వినిపిస్తోంది. ఏడుపును ఆపుకోవడానికి చేసిన వ్యర్థప్రయత్నంలో తన చేతిని నోటికి అడ్డు పెట్టుకుంది. అడుగుల శబ్ధం, వాటిలోని వేగం పెరిగింది. గుడారం తెరలనుచీల్చుకుంటూ , ఒక వ్యక్తిలోనికి ప్రవేశించడం తెలుస్తోంది. అక్కడున్న సామాన్లను తిరగదోస్తూ ఆ వ్యక్తి లోపల తిరగడం తెలుస్తోంది. ఆ అడుగులు మాధవి దాక్కున్న మంచం దగ్గరగా వచ్చేసాయి. గుడారాన్ని బయటనున్న వ్యక్తులు చుట్టూ కాపలా కాస్తున్నారు. సూర్యుని నీరెండతో గుడారం వెలుగుతో నిండిపోయింది. జంతు చర్మాలతో తయారు చెయ్యబడిన బూట్ల వంటి ఆచ్చాదనతో ఉన్నబలమైన ఆ ఆదివాసి పాదాలు మాధవి నక్కిన మంచం ప్రక్కనే ఆగాయి.

తనఖర్మ కాలి ఆ వ్యక్తి మంచం క్రిందికి వంగి చూడడం, తను కనబడడం, ఆ వ్యక్తి క్రూరంగా నవ్వడం ఒక క్షణంలో జరిగిపోయాయి. లోలోపలికి లాగుకుంటున్న మాధవి లేత పాదాలు రెంటినీ పట్టి, బయటికి లాగి, గింజుకుంటున్న, రక్కుతున్న ఆమె ప్రయత్నాలను ఏమాత్రం లెక్కచేయకుండా ఆమెను పట్టుకుని గాలిలో బొమ్మలా నిలబెట్టిన ఒక బలాఢ్యురాలైన ఒక ముప్పై సంవత్సరాల యువతి మాధవి కంట పడింది.

1 Comment

  1. Emaundidhi asahi inko adadhani dengataniki

Comments are closed.