నైట్ షిఫ్ట్ 29 1223

రిసెప్షన్ రూమ్ లోకి వెళ్ళాను. చైర్ మీద శ్రావ్య కూర్చుని ఉంది. హాయ్ అని పలకరించాను. 
హాయ్ రమ్య అంటూ పలకరించి నన్ను పై నుండి కింద వరకు చూసింది. ఉమ్మ్ సూపర్బ్ గా ఉన్నావు జీన్స్ లో అంది. 
థాంక్స్ అన్నాను. లేట్ అయ్యిందా? ఎవరూ కనిపించడం లేదు. 
ఏం లేట్ అవ్వలేదు. ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారు. 
ఓహో! వచ్చిన వాళ్ళు ఎక్కడ ఉన్నారని అడిగాను. 
అదిగో ఆ క్లాస్ రూమ్ లో ఉన్నారు. నీవు కూడా వెళ్లి కూర్చో కాసేపయ్యాక ఇంట్రడక్షన్ సెషన్ ఉంటుంది. 
సరే శ్రావ్య అని డోర్ తీసుకుని లోపలికి వెళ్లాను. 

అప్పటికే కొందరు చైర్స్ మీద కూర్చుని ఉన్నారు. నేను డోర్ తెరవడంతో అందరు నన్ను చూసారు. నేను వాళ్ళను చూసి హాయ్ అని పలకరించి రెండో వరుస చైర్ లో వెళ్లి కూర్చున్నాను. అందరిని చూసాను. అప్పటికే 10 మంది వచ్చారు. నాతో పాటు 11 మంది. చూడటానికి అందరు అందంగానే ఉన్నారు. కొందరు నాకు లాగే జీన్స్ లో, కొందరు స్కర్ట్స్ లో ఇంకొందరు లెగ్గింగ్ & టాప్ లో వచ్చారు. వాళ్ళను  ఒక్కొక్కరిని పరీక్షిస్తూ నా మొబైల్ చూస్తున్నాను. అందులో కొంత మంది మ్యారేజ్ అయిన వాళ్ళు, కానీ వాళ్ళు కూడా ఉన్నారు. 

కాసేపటికి డోర్ తెరిచిన సౌండ్ వినిపించింది. వచ్చింది ఎవరో కాదు, నాకు ముందు పరిచయం అయినా ఆమె. అదేనండీ ఆమని (సినిమా హాల్ లో పరిచయం అయ్యింది కదా. మొగుడు జాబ్ మీద ఫారెన్ వెళ్ళాడు. అమ్మ దగ్గర ఉండి తన భర్త సంపాదించిన అపార్ట్మెంట్ చూసుకుంటూ వేరే వాళ్ళతో షికార్లు తిరుగుతూ ఉంది. సినిమా హాల్ లో ఒకరితో, మొన్న నేను పేమెంట్ చేయడానికి వచ్చినప్పుడు ఇంకొకరితో కనిపించింది. మర్చిపోయారా? ఒకవేళ గుర్తు లేకపోతే ముందు అప్డేట్స్ వెతికి చదవండి). 

నన్ను గుర్తు పట్టి హాయ్ అంటూ నా పక్కన వచ్చి చైర్ లో కూర్చుంది. నేను పలకరించాను. తాను మోకాళ్ళకి కాస్త కింద వరకు ఉన్న డ్రెస్ వేసుకుని వచ్చింది. స్లీవ్ లెస్ హాండ్స్ లూజ్ హెయిర్ తో వచ్చింది. 

[Image: Nikki-Galrani-at-Malupu-movie-press-meet...297244.JPG]
[Image: malupu-pressmeet97.jpg]

4 Comments

  1. Super bro continue plz

Comments are closed.