రస రమ్య శృంగార కధలు – ముగ్గురు స్నేహితుల కధ 169

అంతే అన్ని సంవత్సరాల స్నేహం ఖతం … శత్రుత్వం షురూ … కధ కంచికి మనం ఇంటికి …

కనువిప్పు తరువాయి భాగం

కమలతో పందెం కట్టి వారం రోజులవుతుంది… సాత్విక్ బిజినెస్ వ్యవహారంతో సింగపూర్ వెళ్ళాడు… వచ్చేసరికి వారం రోజులు పడుతుందని చెప్పాడు…. సాత్విక్ సింగపూర్ వెళ్ళిన నాలుగు రోజుల తర్వాత మధ్యాహ్నం మూడు గంటల సమయంలో తన లవర్ మాధవ్ ని తీసుకువచ్చి మంజీరకు పరిచయం చేసింది కమల.

ముగ్గురు కాఫీ తాగుతు కూర్చున్నారు. కాఫీ తాగుతున్న మాధవ్ ని పరీక్షగా చూసింది మంజీర. సుమారు ఇరవై ఏడు సంవత్సరాలుంటాయి అతనికి. ఎర్రగా అందంగా హాండ్ సమ్ గా వున్నాడు. ముఖ్యంగా అతని లోతైన కళ్ళలొ ఏదో సమ్మోహన శక్తి ఉంది.

“ఓ గంట పర్మిషన్ అడిగి వచ్చాను… వెంటనే వెళ్ళాలి… సిక్స్ అయ్యెసరికి ఇక్కడుంటాను డియర్ … అంతవరకు మంజీరతో కబుర్లు చెపుతుండూ”… అంది కమల…

ఇక్కడెందుకు… అలా వెళ్ళి ఆరింటికి మీ ఆఫీసుకి వస్తాను… మన ప్రోగ్రామ్ ప్రకారం మూవీకి వెళదాం అన్నాడు మాధవ్ …

దీని హస్ బెండ్ బిజినస్ పని మీద సింగపూర్ వెళ్ళారు… మరో మూడు రొజులవుతోంది వచ్చేసరికి … ఇది చాలా లోన్లిగా ఫీల్ అవుతుంది … కనీసం ఈ రెండు మూడు గంటలైనా తనని కాస్త లోన్లినెస్ మరిచిపోయేటట్లు చూడు… అంది కమల …

అవునండి …ఎండలో బయట తిరగటం ఎందుకు దండగ… అది వచ్చేవరకు ఇక్కడే వుండండి… నేను కూడా ఈ లంకంత ఇంటిలో ఒంటరిగా బోర్ కొట్టి చస్తున్నాను.. కనీసం ఈ రెండు గంటలైనా మీరుంటే నాకు కొంచెం టైమ్ పాస్ అవుతుంది… అంది మంజీర అతని వంక ఓరగా చూస్తూ…

Updated: February 23, 2022 — 9:41 am