రాములు ఆటోగ్రాఫ్ – 39 95

ప్రసాద్ : ఆయనకు చాలా పలుకుబడి ఉన్నది వదినా…నిజం చెప్పాలంటే ఆయన కోటీశ్వరుడు…అసలు ఈ జాబ్ చెయ్యాల్సిన అవసరం కూడా లేదు….
రాశి : మరీ డిపార్ట్ మెంట్‍లోకి ఎందుకు వచ్చాడు.
ప్రసాద్ : డిపార్ట్ మెంట్‍లో చేరడం ఆయన కలని ఒకసారి చెప్పారు….
తులసి : సరె….నేను, అక్కా కలిసి రేపు స్పెషల్స్ చేస్తాము…నువ్వు ఆయనతో మాట్లాడి ఆయనకు ఏం ఇష్టమో చెప్పు….రెడీ చేస్తాము…..
ప్రసాద్ : సరె….కనుక్కుని చెబుతాలే…..
తులసి : ఇంకో విషయం….మీ ఇద్దరూ బయలుదేరేప్పుడు నాకు ఫోన్ చెయ్యి….రెడీ అవ్వాలి కదా….
ప్రసాద్ అలాగే అని తలూపుతూ రాము గురించి మాట్లాడుకుంటూ భోజనం పూర్తి చేసారు.
భోజనం చేసిన తరువాత ఎవరి బెడ్‍రూమ్స్ లోకి వాళ్ళు వెళ్ళి పడుకుని నిద్ర పోయారు.
*********
ఉదయాన్నే ఇంటికి వచ్చిన రాము తన బెడ్‍రూమ్‍లోకి వెళ్ళి ఒక గంట సేపు పడుకుని స్నానం చేసి యూనిఫామ్ వేసుకుని టిఫిన్ చేద్దామని కిందకు వచ్చాడు.
రాము డైనింగ్‍టేబుల్ దగ్గరకు రాగానే అప్పటికే టిఫిన్ చేస్తున్న అందరూ గుడ్ మార్నింగ్ చెప్పారు.
రాము కూడా అందరికీ విషెస్ చెప్పి చైర్‍లో కూర్చున్నాడు.
పద్మ వచ్చి రాముకి టిఫిన్ పెట్టింది….
రాము మెదలకుండా టిఫిన్ తింటుండటం చూసి శివరాం….
శివరామ్ : ఏంటన్నయ్యా….రాత్రి ఇంటికి కూడా రాలేదు….వర్క్ లో ఉన్నావా….
రాము : అదేం లేదురా….ఒక కేసు పని మీద డింబీవలీ వెళ్లాల్సి వచ్చింది…పని పూర్తి అయ్యేసరికి బాగా లేటయింది…. అందుకని అక్కడే ఫ్రండ్ ఇంట్లో పడుకుండిపోయాను….
శివరామ్ : ఫ్రండ్ అంటే….గర్ల్ ఫ్రండా…..(అంటూ నవ్వాడు.)
రాము : అదేం లేదురా…

శివరామ్ : జాగ్రత్త అన్నయ్యా…ఈ మధ్య అమ్మాయిలు చాలా ఫాస్ట్‍గా ఉంటున్నారు….

పద్మ : నువ్వు ఊరుకోరా శివా…మామయ్య గారు అమాయకులేం కారు…ఆయన్ని చూస్తే అమ్మాయిల్ని చూస్తే పడిపోయేలా లేరు….అమ్మాయిల్ని పడేసేలా ఉన్నారు….
పద్మ ఆ మాట అనగానే అక్కడ ఉన్న అందరూ ఒక్కసారిగా నవ్వారు.
రాము కూడా నవ్వుతూ పద్మ వైపు చూసి….
రాము : అది సరె….ఏంటి నన్ను మామయ్యా అని పిలుస్తున్నావు….

పద్మ : ఏం చెయ్యమంటారు మామయ్య గారు…మిమ్మల్ని పేరు పెట్టి పిలవలేం కదా…అందుకని అలా పిలుస్తున్నాను …అయినా ఇక్కడ మన ఫ్యామిలి తప్పితే ఎవరూ లేరుకదా…..
రాము : అయినా సరె…..ఇక్కడ అలవాటు కాకపోతే….బయట కూడా అనుకోకుండా ఇలాగే పిలుస్తావు…పక్కన గారు తీసేసి మామయ్యా అని పిలువు చాలు….
దాంతో పద్మ సరే అని తల ఊపింది.
తరువాత అందరూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ టిఫిన్ చేసారు.
టిఫిన్ అయిపోయిన తరువాత హాల్లో కూర్చుని కొద్దిసేపు అందరూ మాట్లాడుకున్నారు.
శివరామ్, విశ్వ, రఘు ఫ్యాక్టరీకి వెళ్ళిపోగా….వినయ్ పని ఉన్నదని బయటకు వెళ్ళిపోయాడు….హర్ష కాలేజీకి వెళ్ళిపోయారు.
ఇక హాల్లో రాము, రేణుక ఇద్దరే మిగిలారు.
రేణుక చిన్నగా రాము దగ్గరకు వచ్చి అతని చేతిని తన చేతిలోకి తీసుకున్నది.
రాము చిన్నగా నవ్వుతూ రేణుక వైపు చూసి, “ఏంటి రేణూ…” అనడిగాడు.
రేణుక : రాము…నీతో ఒక విషయం మాట్లాడాలి….
రాము : చెప్పు….దానికి ఇంత ఆలోచిస్తావెందుకు….
రేణుక : నా మాట వింటావో లేదో అని ఆలోచిస్తున్నాను….
రాము : నీ మాట ఎప్పుడైనా కాదన్నానా…..
రేణుక అలా మాట్లాడుతుంటే అప్పుడే కిచెన్‍లో ఏం పనులు చేయాలో పనివాళ్ళకు పనులు పురమాయించి ఆ ఇంటి కోడళ్ళు అయిన పద్మ, కరుణలు కూడా హాల్లోకి వచ్చి తమ అత్తయ్య రేణుక ఏం చెప్పబోతుందా అని ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.

రేణుక : ఏం లేదు రాము….నాకు కూడా ఏజ్ పెరిగిపోయింది….అందుకని….
రాము : అందుకని…..
రేణుక : నువ్వు పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉన్నది…..
ఆ మాట వినగానే రాము అంతకుముందే ఎప్పుడో ఈ టాపిక్ వస్తుందని ఊహించడంతో ఆ విషయాన్ని దాటవేయడానికి ట్రై చేస్తూ రాము చెప్పబోతుండగా…..మధ్యలో పద్మ మాట్లాడుతూ….
పద్మ : అవును మామయ్యా….మీరు తొందరగా పెళ్ళి చేసుకోండి….
రాము : పద్మా….నువ్వు కూడా ఏంటి….రేణుకతో కలిసి వంత పాడుతున్నావు….నాకు మనవళ్ళు, మనవరాళ్ళు కూడా ఉన్నారు కదా…..
కరుణ : అయితే ఏంటి మామయ్యా….ఆ విషయం మీకు, మనకు మాత్రమే తెలుసు….బయట వాళ్ళకు తెలియదు కదా….అయినా ఎన్నాళ్ళిలా ఉంటారు…..
రాము : కాని నాకు ఇప్పుడే పెళ్ళి చేసుకోవాలని లేదు….అయినా రేణుక….నువ్వు కూడా ఏంటి…నువ్వు నా భార్యవి అయి ఉండి….నాకు మళ్ళీ పెళ్ళి చేయాలని చూస్తున్నావు….
రేణుక : నేను మీ కాలందాన్ని కాదని మీకు తెలుసు కదా….మీ వలన నేను చాలా హ్యాపీగా ఉన్నాను….ఇప్పుడు కాలానికి తగ్గట్టు మీరు పెళ్ళి చేసుకుని ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను…
పద్మ : అవును మామయ్య….అత్తయ్య గారు చెబుతున్నది కరెక్టే….మీ అమ్మా నాన్న కూడా మీరు ఎప్పుడు పెళ్ళి చేసుకుంటారా అని చూస్తున్నారు….వాళ్ల ఆనందం కూడా మనం తీర్చాలి కదా…..
పద్మ అలా అనగానే రాము ఆ టాపిక్‍ని డైవర్ట్ చేద్దామని అనుకుని….

రాము : నువ్వు చెప్పింది కరెక్టే పద్మా….కాని నేను ఇప్పుడే కదా డిపార్ట్ మెంట్‍లో చేరింది….చూద్దాం రెండేళ్ళు ఆగిన తరువాత పెళ్ళి గురించి ఆలోచిద్దాం…..
పద్మ : అదికాదు మామయ్యా…..
రాము : ఏంటి శివ ఏమైనా తొందరపడుతున్నాడా…..