రాములు ఆటోగ్రాఫ్ – 40 126

అది చూసిన రాము ప్రసాద్ వైపు చూసి చిన్నగా నవ్వుతూ, “ప్రసాద్….ఏంటి రివాల్వర్ ఎందుకు తీసావు….మనం ఇక్కడికి ఎన్ కౌంటర్ చేయడానికి రాలేదు….అతన్ని పట్టుకోవడానికి వచ్చాము,” అంటూ ఇన్ ఫార్మర్ వైపు తిరిగి, “ఏ ఇంట్లో ఉన్నాడు,” అనడిగాడు.
దానికి ఇన్ ఫార్మర్ ఎదురుగా ఉన్న ఇంటి వైపు చూపించి, “ఆ ఇంట్లో ఉన్నాడు సార్….” అన్నాడు.
రాము : ఇంట్లో మొత్తం ఎంత మంది ఉన్నారు…..
ఇన్ ఫార్మర్ : ఇద్దరు ముగ్గురు ఉంటారు సార్….కాని మిగతా ఇద్దరికి ఇతని సంగతి తెలియదు….
రాము : సరె….నువ్వు వెళ్ళు…..(అంటూ తన పర్స్ లోనుండి రెండు వేలు తీసి అతనికి ఇచ్చాడు.)
ఆ డబ్బులు తీసుకుని అతను సంతోషంగా రాముకి, ప్రసాద్ కి మళ్ళి నమస్కారం చేసి అక్కడ నుండి వెళ్ళిపోయాడు.
రాము : ప్రసాద్….వెళ్దాం పద….(అంటూ అక్కడ నుండి కదిలారు)

ప్రసాద్ కూడా రాము వెనకాలే ఇందాక ఆ ఇన్ ఫార్మర్ చూపించిన ఇంటి వైపు బయలుదేరాడు.
రాము ఇంటి ముందు ఆగి తలుపు కొట్టాడు.
రెండు సార్లు తలుపు కొట్టిన తరువాత ఒకతను వచ్చి తలుపు తీసాడు.
ఎదురుగా యూనిఫామ్స్ లో నిల్చున్న రాము, ప్రసాద్ లను చూసి అతను వెంటనే వాళ్ళిద్దరినీ తోసి అక్కడ నుండి పరిగెత్తి పారిపోయాడు.
దాంతో రాము వెంటనే అతని వెనకాలే పరిగెత్తుతూ ప్రసాద్ వైపు తిరిగి, “ప్రసాద్….నువ్వు అటు వైపు నుండి వచ్చేయ్,” అంటూ ఆ క్రిమినల్ వెనక పరిగెత్తాడు.
ప్రసాద్ కూడా ఇక లేట్ చేయకుండా రాము చెప్పిన వైపు పరిగెత్తాడు.
వాళ్ళిద్దరి దగ్గర నుండి తప్పించుకున్న ఆ క్రిమినల్ సందులు గొందులు తిరిగుతూ ఒక అపార్ట్ మెంట్ లోకి వెళ్ళి అక్కడ తలుపు తెరిచి ఉన్న ఇంట్లోకి వెళ్ళి అక్కడ నుండి వెనక డోర్ తీసుకుని వెళ్లాడు.
రాము కూడా ఆ అపార్ట్ మెంట్ లోకి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళగానే ఆ ఇంట్లో ఆమె రాము కి ఆ క్రిమినల్ వెళ్ళిన వైపు చూపించింది.
రాము వెంటనె ఆ వైపు పరిగెత్తాడు.
కాని అప్పటికే అతను తప్పించుకుని వెళ్ళిపోవడంతో తన జేబులో ఉన్న వైర్ లెస్ వాకీ టాకీ తీసుకుని అతను ఎటు వెళ్ళాడో ప్రసాద్ కి చెప్పాడు.
రాము ఆ ఇంట్లో నుండి బయటకు వచ్చి మెట్ల మీద నుండి కిందకు వెళ్ళపోయాడు.

కాని అక్కడ ఉన్న ఒక ఇంట్లో ఎవరో ఒకామెను కొట్టినట్టు శబ్దం రావడంతో రాము వెంటనే ఆగిపోయి వెనక్కు తిరిగి ఆ ఇంట్లోకి వెళ్లాడు.

ఆ ఇంట్లో నేల మీద ఒక ఆడ మనిషి అచేతనంగా పడి ఉన్నది.
ఒకతను ఆమెను కత్తితో పొడుస్తున్నాడు….దాంతో ఆమె గిలగిలా కొట్టుకుని చనిపోయింది.
ఆ హత్యను చూసిన రాము కళ్ళు హత్య చేసిన అతని వైపు మళ్ళాయి.
ఆ హత్య చేసిన అతను తన చేతులకు అంటిన రక్తాన్ని అక్కడే ఉన్న గోడకు రాస్తున్నాడు.
తన చేతులకు అంటిన రక్తాన్ని గోడకు తుడిచిన తరువాత తన నోట్లో ఉన్న మోర్ సిగరెట్ ఒక్కసారి గట్టిగా పఫ్ లాగి… సిగరెట్ ని పెదవుల మధ్య లోనుండి తీసి తనను తాను అక్కడ ఎదురుగా ఉన్న అద్దంలో చూసుకుని నోట్లో నుండి పొగ వదిలాడు.
తరువాత పక్కనే ఉన్న గ్లాసులో సిగరెట్ ని పడేసాడు.
అది చూసిన రాము కోపంతో తన బెల్ట్ కి ఉన్న పౌచ్ లో రివాల్వర్ తీసి, “రేయ్….ఎవడ్రా నువ్వు….పట్ట పగలే హత్య చేసావు,” అంటూ గన్ ని అతనికి గురిపెట్టాడు.

హత్య చేసిన అశోక్ వెనక్కు తిరిగి అక్కడ నిలబడి ఉన్న రాముని చూసి ఆశ్చర్యపోయి అలాగే నిల్చున్నాడు.
కాని వెంటనె తేరుకుని పక్కనే చైర్ లో ఉన్న తన కోటుని తీసి రాము మొహం మీదకు విసిరేసి అశోక్ అక్కడ నుండి పరిగెత్తాడు.
రాము కూడా వెంటనే అశోక్ ని ఫాలో అవుతూ అతన్ని పట్టుకోవడానికి పరిగెత్తుతున్నాడు.
అలా పరిగెత్తుతున్న రాముకి సడన్ గా లారీ ఒకటి అడ్డం రావడంతో దాన్ని తప్పించుకోవడానికి పక్కకు దూకాడు.
ఈ లోపులో అశోక్ వెంటనే అక్కడ నుండి తప్పించుకొని అక్కడ ఉన్న పాడుబడ్డ గ్యారేజీ లోకి పరిగెత్తాడు.
రాము కూడా వెంటనే పైకి లేచి ఆ గ్యారేజీ లోకి వెళ్ళి అశోక్ ఎక్కడ ఉన్నాడా అని చుట్టూ చూస్తున్నాడు.
ఆ గ్యారేజీలో అశోక్ ఎక్కడ ఉన్నాడా అని చూస్తున్న రాముకి ఊహించని విధంగా అశోక్ వెనక నుండి అతని తల మీద రాడ్ తీసుకుని గట్టిగా కొట్టాడు.
దాంతో రాము వెంటనే తల పట్టుకుని బాధతో కళ్ళు బైర్లు కమ్ముతుండగా….కళ్ళ ముందు అంతా మసగ్గా కనిపిస్తుంటే కింద పడిపోయాడు.
అశోక్ తన చేతిలో ఉన్న రాడ్ ని రాము మీదకు విసిరేసి కాలితో రాము ఛాతీ మీద, కడుపు మీద ఎక్కడ బడితే అక్కడ కొడుతున్నాడు.
అశోక్ కొట్టిన దెబ్బలకు రాము దాదాపుగా సృహ కోల్పోయినట్టు ఉన్నాడు….కళ్ళ ముందు ఏం జరుగుతుందో కనిపిస్తున్నది….కాని ఏమీ చేయలేకపోతున్నాడు.
రాము ఇక లేవలేడని నిర్ధారణకు వచ్చిన అశోక్ ముందుకు ఒంగి రాము చేతిని పట్టుకుని అక్కడ దగ్గరలో ఉన్న మిషన్ కి ఒక రాడ్ కోపుగా బయటకు వచ్చి ఉండటం చూసి…దానికి రాముని గుద్ది చంపేద్దామని లాకెళ్తున్నాడు.
రాము తనను తాను రక్షించుకోవడానికి చేత్తో అక్కడ ఏమైనా దొరుకుతుందేమో అని తడుముతున్నాడు.
కాని రాము చేతికి ఏమీ తగల్లేదు.
రాము చేతిని వదిలి అశోక్ తన రెండు చేతులతో రాము షర్ట్ కాలర్ పట్టుకుని పైకి లేపి ఆ రాడ్ కి రాము తలను గుద్దుదామని పైకి లేపాడు.
రాము అతి కష్టం మీద కళ్ళు తెరిచి ఏం జరగబోతున్నదో ఊహించి వెంటనే అక్కడ తన చేతికి అనుకోకుండా అందిన రాడ్ తీసుకుని ఏం జరుగుతుందో అశోక్ ఊహించేలోపు ఆ రాడ్ ని అశోక్ మెడలో దింపేసాడు.
దాంతో అశోక్ రాముని వదిలేసి చేత్తో మెడని పట్టుకుని నొప్పితో గట్టిగా అరుస్తూ కింద పడిపోతూ తన ఫ్యాంట్ పాకెట్ లోనుండి ఏదో ఎలక్ట్రానిక్ డివైజ్ తీసి దాని మీద ఉన్న బటన్ నొక్కాడు.
బటన్ నొక్కిన వెంటనే ఆ డివైజ్ పని చేస్తున్నట్టు గ్రీన్ కలర్ ఇండికేషన్ వెలిగింది.
అది చూసిన అశోక్ పెదవుల మీద ఒక చిరునవ్వు వెలిగింది.
ఆ మరుక్షణమే అతని ప్రాణం పోవడంతో ఆ పెదవుల మీద నవ్వు మాయమైపోయి అతని కళ్ళు నిర్జీవంగా ఆకాశం లోకి చూస్తున్నాయి.
పక్కనే రాము కూడా సృహ తప్పి పోయాడు.
అప్పుడే ప్రసాద్ క్రిమినల్ ని పట్టుకుని తన టీమ్ కి అప్పగించి రాము కోసం వెతుక్కుంటూ గ్యారేజీకి వచ్చి అక్కడ సృహ తప్పి పడిపోయిన రాముని, పక్కనే చనిపోయిన అశోక్ ని చూసి తన దగ్గర ఉన్న ఫోన్‍లో అంబులెన్స్ ని పంపించమని చెప్పాడు.
ప్రసాద్ టెన్షన్ తో రాము దగ్గరకు వచ్చి గొంతు దగ్గర వేళ్ళు పెట్టి చూసి బ్రతికే ఉన్నాడని నిర్ధారించుకుని ఒక్కసారి రిలీఫ్ అయ్యి అంబులెన్స్ రాగానే వెంటనె అందులోకి రాముని ఎక్కించి హాస్పిటల్ కి తీసుకెళ్ళాడు.
హాస్పిటల్ చేరుకున్న తరువాత రాముకి వెంటనే డాక్టర్లు ట్రీట్ మెంట్ చేసి తలకు కట్టు కట్టి….బయట కంగారుగా ఉన్న ప్రసాద్ దగ్గరకు వచ్చి, “ప్రసాద్ గారూ….ఇంకో గంటలో రాము గారికి సృహ వస్తుంది,” అన్నాడు.

4 Comments

  1. Sir katha chala bagundhi…updates roju 2 evandi sir

  2. NV em rasthunnav Ra Jaffa asalu jarina edhi

  3. Anita nu sekar ku longinda leda bro storie madyalone cut cesav

  4. Anitha story rayara jefa

Comments are closed.