రాములు ఆటోగ్రాఫ్ – 40 126

రాము మెల్లగా శిరీష పక్కనే కూర్చుంటూ, “నీకు గిఫ్ట్ ఇద్దామనే వెళ్ళాను….కాని అక్కడకు వెళ్లిన తరువాత ఏం గిఫ్ట్ ఇవ్వాలో తెలియలేదు…నీ ఇష్టాలేంటో తెలియదు కదా….అందుకనే ఈసారి ఇద్దాములే అని వచ్చేసాను,” అన్నాడు.
రాము అలా అనగానే శిరీషకి రాముని ఏం అనాలో అర్ధం కాలేదు.
దాంతో శిరీష కోపంగా రాము వైపు చూస్తూ, “నీ….ఏం మాట్లాడుతున్నావో అర్ధం అవుతుందా…ఇంత పీనాసోడివి అనుకోలేదు…నేను గిఫ్ట్ అడిగానా….నువ్వే ఇస్తానన్నావు…” అంటూ కోపంతో బుసలు కొడుతూ పిజ్జా తింటున్నది.
రాము తనకు వస్తున్న నవ్వుని పెదవుల మీదకు రాకుండా ఆపుకుంటూ శిరీష వైపు చూస్తూ, “ఏంటి….పిజ్జా….నాకు పెట్టవా…ఒక్కదానివే తింటున్నావు,” అనడిగాడు.
శిరీష తన ముందు ప్లేట్లో ఉన్న పిజ్జా పీసెస్‍ని రాము ముందుకు తోసి, “తిను…నేను నీలా పిసినారి దాన్ని కాదు… తీసుకుని తిను,” అంటూ చేతిలో ఉన్న పిజ్జా పీస్‍ని తింటున్నది.
రాము మెల్లగా శిరీష భుజం మీద చెయ్యి వేసి నిమురుతూ, “శిరీ…ఏంటి కోపం వచ్చిందా….” అనడిగాడు.
శిరీష కోపంగా, “ఏహె….మూడ్ మొత్తం పాడు చేసావు….” అంటూ రాము వైపు కోపంగా చూసింది.
రాము ఇక తన ఫ్యాంట్ పాకెట్‍లో నుండి చిన్న గిఫ్ట్ పాకెట్ తీసి శిరీష ముందున్న టేబుల్ మీద పెట్టి, “నీ కోసం….చిన్న గిఫ్ట్,” అంటూ చిరునవ్వుతో ఆమె కళ్ళల్లోకి చూసాడు.
శిరీష తన చేతిలో పిజ్జాని ప్లేట్‍లో పెట్టి గిఫ్ట్‍ని చేతిలోకి తీసుకుంటూ, “మరి తీసుకోలేదని అన్నావెందుకు,” అనడిగింది.
రాము చిలిపిగా శిరీష కళ్ళల్లోకి చూస్తూ, “నువ్వు కోపంలో కూడా చాలా అందంగా ఉన్నావు శిరీ…మరి మరదలని ఆట పట్టించకపోతే ఎలా…నువ్వు అలా ఉడుక్కుంటుంటే భలే ఉన్నావు….అందుకే గిఫ్ట్ తేలేదని చెప్పాను,” అన్నాడు.
రాము తనను పొగిడే సరికి శిరీష చెక్కిళ్ళు సిగ్గుతో ఎరుపెక్కాయి.
శిరీష చిన్నగా నవ్వుతూ గిఫ్ట్ పైన ప్యాకింగ్ ఓపెన్ చేసి చూసింది.
చిన్న గిఫ్ట్ బాక్స్ ఉండటంతో శిరీష మెల్లగా ఓపెన్ చేసి చూసింది.
రింగ్ బాక్స్ ఓపెన్ చేయగానే లోపల ఉంగరాన్ని చూసి శిరీష కళ్ళు ఒక్కసారిగా మెరిసాయి.
బాక్స్‍లో ఒక డైమండ్ రింగ్ మెరుస్తు ఉండటంతో శిరీష ఆనందంగా రాము కళ్ళల్లోకి చూసింది.

శిరీష కళ్ళల్లో ఆనందం చూసిన రాముకి తాను తెచ్చిన గిఫ్ట్ ఆమెకు బాగా నచ్చిందని అర్ధమయింది.
శిరీష కళ్లల్లోకి ప్రేమగా చూస్తూ, “శిరీ….నచ్చిందా….” అనడిగాడు రాము.
అప్పటి దాకా చిరాగ్గా ఉన్న శిరీష మనసు సంతోషంతో నిండిపోయే సరికి రాము వైపు చూస్తూ, “చాలా బాగా నచ్చింది బావా…అసలు ఇలాంటి గిఫ్ట్ ఇస్తావని అసలు అనుకోలేదు,” అన్నది.
“అలా అయితే….ఆ డైమండ్ రింగ్ వైపు అలా చూస్తావేంటి….వేలికి పెట్టుకో,” అన్నాడు రాము.
శిరీష తన ఎడమ చేతిని రాము వైపు చాపుతూ, “నువ్వే పెట్టు,” అన్నది.
రాము ఒక్కసారి శిరీష వైపు చూసి నవ్వుతూ డైమండ్ రింగ్ తీసుకుని ఎడమ చేత్తో శిరీష చేతిని పట్టుకుని కుడిచేత్తో ఆమె ఎడమ చేతి ఉంగరం వేలికి పెట్టాడు.
శిరీష ఒక్కసారి తన చేతికి ఉన్న ఉంగరాన్ని ఆనందంగా చూసుకుంటూ, “చాలా థాంక్స్ బావా,” అంటూ రెండు చేతులతో రాము తలను పట్టుకుని దగ్గరకు లాక్కుని పెదవుల మీద ముద్దు పెట్టుకున్నది.
రాము కూడా ఒక్కసారి శిరీష పెదవులను ముద్దు పెట్టుకుని వెంటనే, “శిరీ…ఏంటిది…” అన్నాడు.

4 Comments

  1. Sir katha chala bagundhi…updates roju 2 evandi sir

  2. NV em rasthunnav Ra Jaffa asalu jarina edhi

  3. Anita nu sekar ku longinda leda bro storie madyalone cut cesav

  4. Anitha story rayara jefa

Comments are closed.