రాములు ఆటోగ్రాఫ్ – 40 126

మానస : సరె…ఉంటాను…బై….
రాము కూడా బై చెప్పి ఫోన్ పాకెట్‍లో పెట్టుకున్నాడు.
అంతలొ శిరీష బట్టలు మొత్తం చూసినా ఏవీ నచ్చకపోవడంతో రాము దగ్గరకు వచ్చి, “వెళ్దాం పద బావా….” అన్నది.

రాము ఒక్కసారి నీరసంగా ఉన్న సేల్స్ మేన్ వైపు జాలిగా చూసి శిరీష వెనకాలే బయటకు వచ్చాడు.
షాప్ నుండి బయటకు వచ్చిన తరువాత రాము మెల్లగా నడుస్తూ, “ఏంటే….ఆ షాపులో అన్ని వెరైటీస్ ఉన్నాయి… ఒక్కటి కూడా నచ్చలేదా,” అనడిగాడు.
దానికి శిరీష చిన్నగా నవ్వుతూ, “లేదు బావా….ఏంటొ ఒక్కటి కూడా నచ్చలేదు,” అన్నది.
ఆ మాట వినగానే రాము ఒక్కసారి శిరీష మొహంలోకి చూస్తూ, “ఏంటి అలా ఉన్నావు….వచ్చేప్పుడు బాగా హుషారుగా ఉన్నావు….షాపు నుండి బయటకు వచ్చేప్పుడు ఏదో అసహనంతో ఉన్నావు…ఏమయింది,” అనడిగాడు.
శిరీష : ఏం లేదు బావా…మూడ్ ఆఫ్ అయిపోయింది….
రాము : ఏమయింది….నీకు మూడ్ ఆఫ్ కూడా అవుతుందా….
శిరీష : ఏం….నేను మనిషిని కాదా….నాకు ఫీలింగ్స్ ఉండవా…
రాము : అలా అని కాదు….ఇప్పటి దాకా బాగానే ఉన్నావు కదా…ఇంతలో ఏమయిందా అని…..
శిరీష : బావా….నీకు గర్ల్ ఫ్రండ్స్ ఉన్నారా….
రాము : ఎందుకు….
శిరీష : చెప్పు బావా….ఏదో సరదాగా అడుగుతున్నా….
రాము : ఉన్నారు….
శిరీష : ఎంత మంది ఉన్నారు….
రాము : ఒక్కళ్ళు…..
శిరీష : కాని నిన్ను చూస్తుంటే….ఒక్కళ్ళు ఉన్నట్టు అనిపించడం లేదు…ఇంకా ఎక్కువ మంది ఉన్నారనిపిస్తున్నది….
రాము : అదేం లేదు….ఈ మధ్యనే పరిచయం అయింది….
శిరీష : ఆ అమ్మాయి పేరేంటి….
రాము : మానస….సైక్రియాటిస్ట్….
శిరీష : అయితే….ఆమె అంటే అంత ఇష్టమా….నువ్వు ఆమెను పెళ్ళి చేసుకుంటావా….(అంటూ రాము వైపు అనుమానంగా చూసింది.)

శిరీష అలా అడగడంతో ఆమె ఏ ఉద్దేశ్యంతో అడుగుతుందో రాముకి అర్ధం అయ్యి ఒక్కసారిగా గట్టిగా నవ్వుతూ….
రాము : ఆమెకు పెళ్ళి కూడా అయింది….
శిరీష : (చాలా సంతోషంగా) అవునా…హమ్మయ్యా…నేను ఇంకా ఆమెను పెళ్ళి చేసుకుంటావేమో అని భయపడ్డాను… ఇప్పుడు మనసులో భారం మొత్తం దిగిపోయింది….(అంటూ గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ రాము వైపు ప్రశాంతంగా చూసింది.)
తను అలా అనగానే శిరీష హ్యాపీగా ఉండటం చూసి రాము కూడా చిన్నగా నవ్వుతూ….
రాము : నేను నిన్ను కూడా పెళ్ళి చేసుకుంటానని చెప్పలేదు కదా…..
శిరీష : అనలేదు…కాని అసలు చేసుకోనని కూడా చెప్పలేదు కదా….ఏదో నా ప్రయత్నం నేను చేసుకుంటాను…
రాము : సరె….ఆ విషయం వదిలేయ్…ఇప్పుడు ఎక్కడకు వెళ్దాం…..

శిరీష : ఏమో బావా…నువ్వే చెప్పు…ఎక్కడకు వెళ్దామో….

రాము : సరె…నీకు మంచి గిఫ్ట్ ఇస్తాను…..పదా….
శిరీష : నిజంగానా….(సంతోషంగా రాము వైపు చూస్తూ) ఏం గిఫ్ట్ ఇస్తావు….అయినా నాకు ఇప్పుడు ఎందుకు ఇవ్వాలనిపించింది….
రాము : ఏం లేదు….మామూలుగానే….ఇంత అందమైన మరదలు కొత్తగా పరిచయం అయింది….హ్యాపీగా ఉంచకపోతే ఎలా…..
శిరీష : నన్ను అంత హ్యాపీగా ఉంచాలనుకుంటే నాకు ఇష్టమైన గిఫ్ట్ ఇవ్వు…..
రాము : సరె….నీకు ఏది ఇష్టమో చెప్పు….అదే ఇస్తాను….
శిరీష : అయితే….(రాముకి దగ్గరగా వచ్చి కాలర్ పట్టుకుని దగ్గరకు లాక్కుంటూ) నాకు ఇష్టమైన గిఫ్ట్ నువ్వే….మరి ఇస్తావా….

రాము : (తన కాలర్‍ని శిరీష చేతి నుండి వదిలించుకుంటూ) శిరీషా….మనం షాపింగ్ కాంప్లెక్స్ లో ఉన్నాము…
శిరీష : అలా అయితే ఇంట్లో అయితే ఓకెనా….
రాము : శిరీ….నీ అల్లరి మరీ ఎక్కువయింది…
శిరీష : (రాము షర్ట్ కాలర్ వదిలేస్తూ) సరె….మరి నాకు ఇష్టమైన గిఫ్ట్ నువ్వే….ఇస్తావా….(అంటూ రాము కళ్ళల్లోకి చిలిపిగా చూసింది.)
రాము : శిరీ…నీ మీద నాకు అటువంటి ఫీలింగ్స్ లేవు…అర్ధం చేసుకో….
శిరీష : ఇప్పుడు లేకపోతే ఏంటి….తరువాత కలగొచ్చు కదా…..
రాము : అప్పటి సంగతి అప్పుడు చూసుకుందాము…ఇప్పుడు నీకు మంచి గిఫ్ట్ ఇస్తాను….ఇక్కడే ఉండు….
శిరీష : నేను కూడా వస్తాను….
రాము : నువ్వు కూడా వస్తానంటే ఎలా….నేను నీకు తెస్తాను…ఇక్కడే పది నిముషాలు ఉండు….(అంటూ అక్కడ నుండి వెళ్ళాడు.)
రాము అలా వెళ్ళగానే శిరీష అక్కడ డొమినోస్‍లో కూర్చుని పిజ్జా ఆర్డర్ చేసి రాము తన కోసం ఏం తెస్తాడా అని ఆలోచిస్తున్నది.
పావుగంట తరువాత రాము చేతులూపుకుంటూ శిరీష కూర్చున్న చోటకు వచ్చాడు.
రాము చేతిలో గిఫ్ట్ ఏం లేకపోవడం చూసి శిరీష అయోమయంగా చూస్తూ, “ఏంటి…చేతులూపుకుంటూ వచ్చేసావు… నాకు ఇస్తానన్న గిఫ్ట్ ఏది….” అనడిగింది.

4 Comments

  1. Sir katha chala bagundhi…updates roju 2 evandi sir

  2. NV em rasthunnav Ra Jaffa asalu jarina edhi

  3. Anita nu sekar ku longinda leda bro storie madyalone cut cesav

  4. Anitha story rayara jefa

Comments are closed.