రాములు ఆటోగ్రాఫ్ – 40 126

ఆ మాట వినగానే ప్రసాద్ ఆనందతో డాక్టర్ చేతులు పట్టుకుని, “చాలా థాంక్స్ డాక్టర్….” అన్నాడు.
“కొట్టిన వాడు ఎవడో కాని మనిషి ఎక్కడ కొడితె బాగా డ్యామేజ్ జరుగుద్దో తెలిసిన వాడు….కాకపోతే రాము గారి అదృష్టం బాగుండటంతో…దెబ్బ వేరే చోట తగిలింది,” అన్నాడు డాక్టర్.
“అలాగా….సరె….వాడి గురించి తరువాత ఎంక్వైరీ చేస్తాను….నేను రాము సార్ ని చూడొచ్చా,” అనడిగాడు ప్రసాద్.
“తప్పకుండా….కాకపోతే ఆయన్ను కదిలించకండి,” అంటూ డాక్టర్ తన పక్కనే ఉన్న నర్స్ కి ఏం మందులు వాడాలో వివరంగా చెబుతున్నాడు.
ప్రసాద్ వెంటనె రాము ఉన్న రూమ్ లోకి వెళ్ళాడు.
లోపల బెడ్ మీద రాము హాస్పిటల్ డ్రస్ లో పడుకుని ఉన్నాడు….అతని తలకు కట్టుకట్టి ఉన్నది.

హాస్పిటల్ చేరుకున్న తరువాత రాముకి వెంటనే డాక్టర్లు ట్రీట్ మెంట్ చేసి తలకు కట్టు కట్టి….బయట కంగారుగా ఉన్న ప్రసాద్ దగ్గరకు వచ్చి, “ప్రసాద్ గారూ….ఇంకో గంటలో రాము గారికి సృహ వస్తుంది,” అన్నాడు.

ఆ మాట వినగానే ప్రసాద్ ఆనందతో డాక్టర్ చేతులు పట్టుకుని, “చాలా థాంక్స్ డాక్టర్….” అన్నాడు.
“కొట్టిన వాడు ఎవడో కాని మనిషి ఎక్కడ కొడితె బాగా డ్యామేజ్ జరుగుద్దో తెలిసిన వాడు….కాకపోతే రాము గారి అదృష్టం బాగుండటంతో…దెబ్బ వేరే చోట తగిలింది,” అన్నాడు డాక్టర్.
“అలాగా….సరె….వాడి గురించి తరువాత ఎంక్వైరీ చేస్తాను….నేను రాము సార్ ని చూడొచ్చా,” అనడిగాడు ప్రసాద్.
“తప్పకుండా….కాకపోతే ఆయన్ను కదిలించకండి,” అంటూ డాక్టర్ తన పక్కనే ఉన్న నర్స్ కి ఏం మందులు వాడాలో వివరంగా చెబుతున్నాడు.
ప్రసాద్ వెంటనె రాము ఉన్న రూమ్ లోకి వెళ్ళాడు.
లోపల బెడ్ మీద రాము హాస్పిటల్ డ్రస్ లో పడుకుని ఉన్నాడు….అతని తలకు కట్టుకట్టి ఉన్నది.

ప్రసాద్ వెంటనె అక్కడ సోఫాలో ఉన్న రాము బట్టల్లో నుండి ఫోన్ తీసుకుని రాము వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి విషయం చెప్పి ప్రమాదం ఏమీ లేదని….హాస్పిటల్ అడ్రస్ చెప్పి ఫోన్ పెట్టేసాడు.

ప్రసాద్ ఫోన్ పెట్టేసిన పావుగంటకు ఇంట్లో అందరూ కంగారుగా హాస్పిటల్ కి వచ్చారు.

కాని శివరామ్ ఊర్లో లేకపోయే సరికి తనకు తెలిసిన డాక్టర్లకు ఫోన్ చేసి విషయం చెప్పి రాముని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు.

వాళ్ళందరూ వచ్చిన తరువాత ప్రసాద్ వాళ్ళకు రాము యూనిఫామ్, ఫోన్, రివాల్వర్ అన్నీ ఇచ్చి వాళ్లతో సాయంత్రం వస్తానని చెప్పి హాస్పిటల్ నుండి బయటకు వచ్చాడు.

ఆ వారం రోజులు ఇంట్లో కూడా ఎవరో ఒకరు రాముని అంటిపెట్టుకుని ఉండేవారు.

ఒకరోజు రాము ఇంట్లో ఉండి ఏం తోచక పోవడంతో ప్రసాద్‍కి చెప్పి కేసు ఫైల్స్ ఇంటికి తెప్పించుకుని చూస్తున్నాడు.

పక్కనే శివరాం తమ్ముడు వినయ్ కూర్చుని రాముకి హెల్ప్ చేస్తూ మధ్యమధ్యలో జోక్‍లు వేస్తున్నాడు.

ఇంతలో షర్ట్, జీన్స్ వేసుకుని ఒక అమ్మాయి రాము ఉన్న బెడ్‍రూమ్ లోకి వచ్చి రాము వైపు చూసి నవ్వుతూ, “హాయ్ బావా….” అని అన్నది.

అప్పటి వరకు ఆమెను చూసి ఉండకపోవడంతో రాము ఆమె వైపు ఎవరన్నట్టు చూసాడు.

దాంతో పక్కనే కూర్చున్న వినయ్ వెంటనే రాము వైపు చూస్తూ, “అన్నయ్యా…ఈమె మా అమ్మ కజిన్ బ్రదర్ కూతురు…బాంద్రాలో ఉంటారు….పేరు శిరీష…చాలా అల్లరి చేసుద్ది,” అన్నాడు.

వినయ్ అలా అనగానే శిరీష ఉడుక్కుంటున్నట్టు, “వినయ్….నువ్వు నోరు మూసుకో…నీకన్నా నేను చాలా మంచిదాన్ని,” అంటూ రాము వైపు తిరిగి, “రామూ బావా…మిమ్మల్మి ఇప్పుడె మొదటిసారి చూడటం…నిజంగా శివరామ్ బావని చూసామంటే…మిమ్మల్ని చూడక్కర్లేదు…ఇద్దరూ అచ్చుగుద్దినట్టు ఒకేలా ఉన్నారు….” అంటూ రాము వైపు డౌట్‍గా చూస్తూ, “అయినా ఇన్నేళ్ళూ ఎక్కడకు వెళ్ళారు….సడన్‍గా వచ్చారు….నా చిన్నప్పటి నుండీ శివరామ్ బావని తప్పితే మిమ్మల్ని చూడలేదు,” అంటూ చనువుగా బెడ్ మీదకు ఎక్కి రాము పక్కనే కూర్చున్నది.

శిరీష తన గురించి ఏమీ తెలియనట్టు అడిగేసరికి రాము వెంటనే వినయ్ వైపు చూసాడు.

రాము చూపులో అర్ధం తెలుసుకున్నట్టుగా వినయ్ కూడా వెంటనే శిరీష వాళ్ళకు ఏమీ తెలియదన్నట్టు తల అడ్డంగా ఊపాడు.

వీళ్ళిద్దరూ కళ్ళతోనే సైగలు చేసుకోవడం గమనించిన శిరీష వెంటనే రాము వైపు చూస్తూ, “ఏంటి…ఇద్దరూ సైగలు చేసుకుంటున్నారు…ఏమయింది…ఆ సీక్రెట్ ఏంటో నాకు చెప్పు,” అన్నది.

రాము వెంటనే శిరీష వైపు చూసి నవ్వుతూ, “ఏం లేదు…నేను వచ్చిన దగ్గర నుండీ నువ్వు కనిపించలేదు కదా… అందుకని వినయ్‍ని ఎందుకు రాలేదు అన్నట్టు చూసాను….వాడు దానికి తెలియదు అన్నట్టు తల ఊపాడు,” అన్నాడు.

రాము అలా అనగానే వినయ్ కూడా రాము చెప్పింది కరెక్ట్ అన్నట్టు తల ఊపాడు.

4 Comments

  1. Sir katha chala bagundhi…updates roju 2 evandi sir

  2. NV em rasthunnav Ra Jaffa asalu jarina edhi

  3. Anita nu sekar ku longinda leda bro storie madyalone cut cesav

  4. Anitha story rayara jefa

Comments are closed.