రాములు ఆటోగ్రాఫ్ – Part 11 90

“అవును….అప్పుడే నువ్వు తాడు పట్టుకుని నేను బావిలో పడకుండా పైకి లాగావు….” అన్నాడు రాము.
“అదే…..నా లెక్క ప్రకారం నువ్వు ఆరోజే నువ్వు నీ కాలానికి వెళ్ళిపోవాల్సిన వాడివి….కాని నేను తాడు పట్టుకుని పైకి లాగడం వలన నేనున్న కాలంలోనే ఆగిపోయావు….దీన్ని బట్టి నాకు అర్ధమయిందేందంటే నువ్వు నీ కాలానికి వెళ్ళడానికి ఇంకా టైం ఉన్నది….తరువాత ఇదే మాట నువ్వు గుడి పనుల మీద బిజీగా ఉన్నప్పుడు నేను వెళ్ళి సూఫీ బాబాను కలిసాను….ఆయన కూడా ఇదే మాట చెప్పాడు….కాని ఏదో ఒక రోజు నువ్వు నన్ను వదిలివెళ్ళిపోతావని…. నువ్వు ఇంకా నేనున్న కాలంలో ఉన్నావంటే ఏదో కారణం ఉండి ఉంటుందని అన్నాడు,” అన్నది రేణుక.
“చాలా బాగా ఆలోచించావు రేణూ….అయినా ఎంత కాలం ఉంటానో తెలయని వ్యక్తితో జీవనం అంటే….” అన్నాడు రాము.
“నేను ఇంతకు ముందే చెప్పా కదా రాము….నీతో ఒక్కరోజు భార్యగా ఉన్నా నాకు సంతోషమే,” అన్నది రేణుక.
ఆమె అలా అనగానే రాము తన భార్యని దగ్గరకు లాక్కుని ఇంకా గట్టిగా వాటేసుకుని పడుకున్నాడు.
తరువాత వరసగా వాళ్ళిద్దరికీ ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి పుట్టారు.
రాము తన కొడుకులల్లో పెద్ద వాడికి విశ్వ, రెండో వాడికి రఘు, అమ్మాయికి సంజన అని పేరు పెట్టాడు.

అలా వాళ్ళందరూ సంతోషంగా రోజులు గడుపుతున్నారు…..అప్పటికి రాము, రేణుకల పెళ్ళి అయ్యి ఐదేళ్ళు అయింది.
పెళ్ళి అయిన దగ్గర నుండి ఫ్యామిలీ మొత్తం ప్రతి సంవత్సరం షాపూర్ దర్గాలో సూఫీ బాబాను, తమను కాపాడిన గుడికి వెళ్ళి అక్కడ అమ్మ వారి దర్శనం చేసుకునే వాళ్ళు.
అలాగే ఆ ఏడు కూడా అమ్మవారి దర్శనం చేసుకుందామని బయలుదేరి అలవాటు ప్రకారం షాపూర్ లో ఉన్న దర్గాకు వెళ్ళి సూఫీ బాబాను కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకుని గుడికి బయలుదేరి వెళ్ళారు.
అలా గుళ్ళోకి వెళ్ళిన తరువాత అందరూ అమ్మవారికి పూజ చేయించి….బావి దగ్గరకు వచ్చి లోపలికి చూసాడు రాము.
బావి లోపలికి చూసిన రాముకి ఒక్కసారిగా గతం మొత్తం గిర్రున తిరిగింది…..బావి దగ్గర నిల్చుని ఆలోచిస్తున్న రాముని చూసి రేణుక దగ్గరకు వచ్చి రాము భుజం మీద చెయ్యి వేసింది.
ఆలోచనల్లో ఉన్న రాము ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసి తన భార్య రేణుక నిలబడి ఉండటం చూసి చిన్నగా నవ్వాడు.
రేణుక రాము దగ్గరకు వచ్చి, “ఏంటి రాము ఆలోచిస్తున్నావు….” అనడిగింది.
“ఏం లేదు రేణూ…..బావి లోపలికి చూసేసరికి ఒక్కసారిగా ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొచ్చింది….” అన్నాడు రాము.
రేణుక కూడా ఒక్కసారి గుండెల నిండా గాలి పీల్చుకుని, “నిజంగా ఆ సంఘటన తల్చుకుంటేనే ఇప్పటికీ వెన్నులో వణుకు వస్తున్నది…” అన్నది.
ఇద్దరూ అక్కడ నిల్చుని మాట్లాడుకుంటుంటే రాము బావి గట్టుకి ఆనుకుని రేణుకతో మాట్లాడుతున్నాడు.
అలా కొద్దిసేపు మాట్లాడుకుంటుండగానే ఎవరూ ఊహించని విధంగా రాము నిల్చున్న చోట బావి గట్టు విరిగిపోయి నీళ్ళల్లో పడిపోయింది.
దాంతో రాము కూడా బేలన్స్ తప్పి బావిలో పడిపోయాడు.
అంతా కళ్ళ ముందు కన్ను మూసి తెరిచేలోపు జరిగిపోయే సరికి రేణుక కూడా రాముని పట్టుకోలేకపోయింది.
బావి గట్టు దగ్గర నిల్చుని లోపలికి పడిపోతున్న రాము వైపు చూసి ఏడుస్తూ, “రాము……” అని గట్టిగా అరుస్తున్నది.
రేణుక అలా గట్టిగా అరవడంతో అక్కడ ఉన్న అందరూ బావి దగ్గరకు వచ్చారు.
కాని అప్పటికే రాము బావిలో పడిపోతూ రేణుక వైపు బాధగా చూస్తూ నీళ్ళల్లో పడిపోయి మునిగిపోయాడు.
అలా తన భర్త రాము బావిలో పడిపోతుంటే కాపాడలేక బాధపడుతూ ఇక రాము తన కాలానికి వెళ్ళిపోతున్నాడని అర్ధమై ఏడుస్తూ అలాగే రాము వైపు చూస్తూ ఉన్నది.
అలా బావిలో పడిన రాముకి ఒక్కసారిగా తన మీద సూర్య కిరణాలు పడటంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు.
వెంటనే తను నేల మీద నుండి లేచి కూర్చుని అయోమయంగా చుట్టూ చూసాడు.
వెంటనే తానున్నది ఒబరాయ్ విల్లా ముందు ఉన్నానని….తన కాలానికి వచ్చేసాడని రాముకి అర్ధమయింది.
కాని నమ్మకం కుదరక వెంటనే అక్కడ నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళి విల్లాలో మెయిన్ డోర్ దగ్గరకు వెళ్ళాడు.
అక్కడ పార్కింగ్ లో తన కారు ఉండటం చూసి దాని దగ్గరకు వెళ్ళి చేతులతో తడుముతూ ముందు వైపుకు వచ్చి తన కారు నెంబర్ ప్లేట్ వైపు చూసి అది తనదే అని నిర్ధారణకు వచ్చి…మళ్ళీ విల్లా లోపలికి వెళ్ళి తను పడుకునే బెడ్ రూమ్ లోకి వెళ్ళాడు.
అక్కడ బెడ్ మీద తన బ్యాగ్, లాప్ టాప్ అన్నీ ఉండే సరికి ఇక తను తన కాలానికి వచ్చేసినట్టు రాముకి పూర్తిగా అర్ధం అయింది.
ఇప్పుడు రాము మనసులో తన కాలానికి వచ్చేసినందుకు ఆనందపడాలో లేక తన భార్యా పిల్లల్ని పోగొట్టుకున్నందుకు బాధ పడాలో అర్ధం కాక అలాగే బెడ్ మీద కూలబడిపోయాడు.

అక్కడ పార్కింగ్ లో తన కారు ఉండటం చూసి దాని దగ్గరకు వెళ్ళి చేతులతో తడుముతూ ముందు వైపుకు వచ్చి తన కారు నెంబర్ ప్లేట్ వైపు చూసి అది తనదే అని నిర్ధారణకు వచ్చి…మళ్ళీ విల్లా లోపలికి వెళ్ళి తను పడుకునే బెడ్ రూమ్ లోకి వెళ్ళాడు.

అక్కడ బెడ్ మీద తన బ్యాగ్, లాప్ టాప్ అన్నీ ఉండే సరికి ఇక తను తన కాలానికి వచ్చేసినట్టు రాముకి పూర్తిగా అర్ధం అయింది.
ఇప్పుడు రాము మనసులో తన కాలానికి వచ్చేసినందుకు ఆనందపడాలో లేక తన భార్యా పిల్లల్ని పోగొట్టుకున్నందుకు బాధ పడాలో అర్ధం కాక అలాగే బెడ్ మీద కూలబడిపోయాడు.
అలా కూర్చున్న రాముకి ఏదో గుర్తుకొచ్చిన వాడిలా వెంటనే బెడ్ మీద నుండి లేచి ఇంతకు ముందు తనకు రేణుక లెటర్ దొరికిన బుక్ షెల్ఫ్ దగ్గరకు వెళ్ళి అక్కడ చూసాడు.
ఆ బుక్ షెల్ఫ్ లో ఒక ఫోటో ఆల్బం, దానితో పాటు లెటర్ కనిపించింది.
రాము ఆ ఆల్బం తీసుకుని కింద పెట్టి లెటర్ తెరిచి చూసాడు….ఆ లెటర్ తన భార్య రేణుక రాసింది….
ఆ లెటర్ లో…..
డియర్ హబ్బీ రాము…..
నువ్వు ఈ లెటర్ చదువుతున్నావంటే నువ్వు నీ కాలానికి తిరిగి వెళ్ళావని అర్ధమవుతున్నది.
నీకు సంబంధించి కొన్ని నిముషాలు మాత్రమే….కాని నాకు సంబందించి నా జీవితం యాభై ఏళ్ళు గడిచిపోయాయి.
నువ్వు ఈ లెటర్ చదివే సమయానికి నేను బ్రతికి ఉంటానో లేదో కూడా తెలియదు.
నువ్వు అలా ఊహించని విధంగా మమ్మల్ని అందరినీ విడిచి వెళ్ళేసరికి నీకు ఏం చెప్పటానికి నాకు అవకాశం దొరకలేదు.
నువ్వు వెళ్ళిపోయిన తరువాత నాకు ఒక్క విషయం అర్ధమయింది….ఏదైనా విలువైన వస్తువైనా, బంధం అయినా అది పోగొట్టుకున్న తరువాత కాని దాని విలువ అర్ధం కాదు.
నిన్ను పోగొట్టుకున్న తరువాత నేను పేరుకే బ్రతికి ఉన్నాను…జీవితాన్ని మాత్రం నీతోనే వదిలేసాను…తినడం, తాగడం, నిద్ర పోవడం, నవ్వడం ఏడవడం అన్నీ మర్చిపోయాను.
నువ్వు లేని ఆ విల్లాలో ఇక నాకు ఉండబుద్ధి కాలేదు.

6 Comments

  1. Inka eni parts pedutaru. em baledhu story.please appeyandi.edina new story start cheyandi.

  2. స్టోరీ చాల అద్భుతంగా రాసారు నేను మీకు పెద్ద ఫ్యాన్ ఐపోయాను ముఖ్యంగా రేణుక రామ్ ల మధ్య లవ్ స్టోరీ మాత్రం అదిరిపోయింది కానీ రేణుక మళ్ళీ యవ్వనంగా అయితే మాత్రం మీ స్టోరీ చాలా హిట్ అవుతుందని నా గట్టి నమ్మకం ఇది కేవలం సజెసషన్ గా మాత్రమె తీస్కోండి నచ్చకపోతే క్షమించండి?

  3. Bayya story qnvasranga laguthunavu.feell mothamu poyendhi

    1. Superu flashback

  4. aa air hostes ni matram enduku vadilesaru? dani pukuni kuda ramu moddatho dunnipiste bagundu.

Comments are closed.