రాములు ఆటోగ్రాఫ్ – Part 11 90

ACP కారు విండో లోనుండి రాము వైపు చూసి, “సార్….ఇక మిమ్మల్ని ఎవరూ ఆపరు….అయినా మీరు క్యాబ్ లో రావడం ఏంటి సార్,” అన్నాడు.
రాము చిన్నగా నవ్వుతూ డ్రైవర్ ని పోనివ్వమన్నాడు.
డ్రైవర్ కార్ మళ్ళీ స్టార్ట్ చేసాడు….అతనికి కూడా అంతా అయోమయంగా ఉన్నది…. ACP అంతటి అతను రాముని చూస్తి సార్ అని పిలుస్తున్నాడంటే…అతను మామూలోడు కాదనుకుని కారుని ముందుకు పోనిచ్చాడు.
లోపల కూర్చున్నా కానిస్టేబుల్ వెనక్కు తిరిగి రాము వైపు భయంగా చూస్తూ, “సార్….మీరెవరో తెలియక మిమ్మల్ని అపాను… నన్ను క్షమించండి సార్…..” అన్నాడు.
“పర్లేదు….జరిగింది మర్చిపో,” అన్నాడు రాము.
రాము అలా అనడంతో కానిస్టేబుల్ మనసు తేలిక పడింది….ముందుకు తిరిగి డ్రైవర్ కి ఎలా వెళ్ళాలో చెబుతున్నాడు.
అంతకు ముందే ACP అందరికి instructions ఇచ్చి ఉండటంతో రాము వస్తున్న క్యాబ్ ని ఎవరూ ఆపలేదు.
దాంతో డ్రైవర్ తన క్యాబ్ ని నేరుగా VIP ఎంట్రన్స్ దగ్గరకు తీసుకెళ్ళి ఆపాడు.
కానిస్టేబుల్ వెంటనే డోర్ తీసుకుని కార్ దిగి వెనక్కు వచ్చి రాము కూర్చున్న డోర్ తీసి పట్టుకున్నాడు.
రాము తన వాలెట్ లోనుండి డ్రైవర్ కి అడిగిన దానికన్నా డబల్ అమౌంట్ ఇచ్చాడు.
దాంతో డ్రైవర్ సంతోషంగా రాముకి నమస్కారం చేసి క్యాబ్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు.
రాము కారు దిగగానే అక్కడ ఉన్న మార్షల్స్ (పర్సనల్ బాడీగార్డ్స్) ఐదుగురు అతన్ని చూసి హడావిడిగా పరిగెత్తుకుంటూ వచ్చారు.
వాళ్ళు రాముని చుట్టూ నిల్చుని అతని దగ్గరకు ఎవరూ రాకుండా, గుడిలోకి వెళ్ళడానికి జనాన్ని పక్కకు జరుపుతూ రాముని గుడి లోకి తీసుకెళ్తున్నారు.
అక్కడ గుళ్ళో వినాయకుడికి ఒబెరాయ్ ఫ్యామిలో వారసులు ముగ్గురూ హారతి ఇస్తున్నారు.
చాలా వైభవంగా పూజారులు శంఖాలు ఊదుతుండగా, భక్తులు గంటలు కొడుతూ వినాయకుడిని ప్రార్దిస్తూ ఉంటే….గుడి మొత్తం చాలా కోలాహలంగా ఉన్నది.
వాళ్ళ పక్కనే రేణుక, ఆమె ఇద్దరు కొడుకులు, ఇద్దరు కోడళ్ళు, కూతురు, అల్లుడు, మనవరాలు అందరూ నిల్చుని హారతి చూస్తున్నారు.
ఇక్కడ మార్షల్స్ మధ్యలో గుడిలోకి వస్తున్న రాము ఆనందంగా ఉన్నాడు.
వాళ్ళల్లో ఒకతను ధైర్యం చేసి, “సార్….లోపల హారతి జరుగుతుంటే….మీరు ఇక్కడ ఉన్నారేంటి….మీరు ఇక్కడ లేటుగా వచ్చారని తెలిస్తే సార్ కోప్పడతారు….అయినా మీరు ఇక్కడ ఉంటే అక్కడ హారతి ఎవరు ఇస్తున్నారు….” అనడిగాడు.
రాము ఏదో సమాధానం చెప్పేలోపు అక్కడ గుడి ముందు ఒక్కసారిగా కలకలం మొదలయింది.
ఏంటా అని అందరు ఒక్కసారిగా అటు వైపు చూసారు.
అక్కడ జనం మొత్తం గట్టిగా అరుస్తూ దూరంగా పరిగెత్తుతున్నారు.-

రాము చుట్టూ ఉన్న మార్షల్స్ అతని దగ్గరకు జనం రాకుండా అడ్డంగా నిల్చున్నారు.

అక్కడ ఒకతను ఒంటి మీద పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోవడానికి ట్రై చేస్తున్నాడు.
అతను ఒంటి మీద పెట్రోల్ పోసుకుని జేబులో ఉన్న అగ్గిపెట్టె తీసుకుని వెలిగించడానికి ట్రై చేస్తున్నాడు.
అది చూసి రాము గట్టిగా అరుస్తూ మార్షల్స్ మధ్యలో నుండి వాళ్ళను తోసుకుంటూ పెట్రోల్ పోసుకుంటున్న అతని వైపు పరిగెత్తాడు.
రాము అలా పరిగెడతాడని ఊహించని మార్షల్స్ ఒక్కసారిగా తేరుకుని రాము వెనకాలే పరిగెడుతూ, “సార్….ఆగండి….వాడు వెలిగించుకున్నాడంటే మీ ప్రాణాలకే ప్రమాదం….ఆగండి సార్,” అని అరుస్తున్నారు.
కాని రాము వాళ్ళ కేకలు పట్టించుకోకుండా పెట్రోల్ పోసుకున్న అతన్ని కాపాడటానికి పరిగెడుతున్నాడు.
ఒంటి మీద పెట్రోల్ పోసుకున్న అతను జేబులో ఉన్న అగ్గిపెట్టె కూడా తడిచిపోవడంతో అది వెలగకపోయేసరికి అందులో ఉన్న ఒక్కో అగ్గిపుల్ల తీసుకుని వెలిగించడానికి ట్రై చేస్తూ టెన్షన్ తో చుట్టూ చూస్తున్నాడు.
అలా చూస్తున్న అతనికి తన వైపు రాము పరిగెత్తుకుంటూ రావడం చూసి ఇంకా భయంతో చేతిలో ఉన్న అగ్గిపెట్టెని కింద పడేసి చుట్టూ చూసి అక్కడ ఒక ప్రమిదలో దీపం వెలుగుతూ ఉండే సరికి అటు వైపు చూసాడు.
రాము కూడా అతను చూస్తున్న వైపు చూసి అతని ఆలోచన పసిగట్టి దీపం వైపు పరిగెత్తాడు.
అలా ఇద్దరూ ఒక్కసారే దీపం దగ్గరకు వచ్చారు….రాము వెంటనే అతన్ని పట్టుకుని వెనక్కు లాగి కింద పడేసాడు.
కాని అంతలోనే అతని ఫ్యాంట్ దీపానికి అంటుకోవడంతో అతని ఒంటికి ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి.
రాముతో పాటు పరిగెత్తుకుంటూ వచ్చిన మార్షల్స్ అక్కడ పక్కనే ఉన్న బకెట్ లో నీళ్ళు తీసుకుని పోసారు.
కాని పెట్రోల్ వలన మంటలు చాలా త్వరగా అంటుకున్నాయి….అతని మీద పడిన రాముకి కూడా మంటల సెగ తగలడంతో రాము వెంటనే పక్కకు దూకాడు.
పక్కనే ఉన్న దుప్పటి తీసుకుని అతని మీద కప్పి మంటలను ఆర్పేసాడు…..పక్కనే ఉన్న మార్షల్స్ కూడా తమకు దొరికిన దానితో నీళ్ళు తెచ్చి పోసేసరికి మంటలు ఆరిపోయాయి.
లోపల హారతి ఇస్తున్న ఒబరాయ్ ఫ్యామిలో వారసులు, కుటుంబ సభ్యులు అందరూ బయటకు వచ్చారు.
అక్కడ జరుగుతున్నది చూసి రేణుక పెద్ద మనవడు ముందుకు పరిగెత్తి అతన్ని కాపాడబోయాడు.
కాని అంతలోనే రాము పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని కాపాడటంతో అక్కడే ఆగిపోయాడు.
అక్కడ ఉన్న వాళ్ళు అంబులెన్స్ కి ఫోన్ చేయడంతో వెంటనే అతన్ని హాస్పిటల్ కి తీసుకెళ్ళారు.
పెట్రోల్ పోసుకున్న వ్యక్తి మీద నీళ్ళు పోసినా మార్షల్స్ కింద పడిన రాము పైకి లేపడానికి ముందుకు వచ్చి హారతి ఇస్తూ మధ్యలో బయటకు వచ్చి తమ బాస్ ఫ్యామిలీ మొత్తం అక్కడ నిల్చుని ఉండటం చూసి…..వాళ్ళతో పాటు బాస్ కొడుకు కూడా నిల్చోవడంతో….అతని వైపు, కింద పడి ఉన్న రాము వైపు మార్చి మార్చి చూస్తున్నారు.
మార్షల్స్ అలా ఎందుకు చూస్తున్నారో అర్ధం కాని రేణుక పెద్ద కొడుకు వాళ్ళ వైపు చూసి, “అలా కళ్ళప్పగించి చూస్తున్నారేంటిరా. ముందు అతనిని పైకి లేపి దెబ్బలేమైనా తగిలాయో చూడండి,” అన్నాడు.
మార్షల్స్ రాముని పైకి లేపడానికి ముందుకు వస్తుండగా రేణుక పెద్ద మనవడు వాళ్ళను ఆగమన్నట్టు సైగ చేసి ముందుకు అడుగులు వేసి రాము దగ్గరకు వచ్చి అతని భుజం మీద చెయ్యి వేసి రెండు చేతులు పట్టుకుని పైకి లేపుతూ, “మీకు ఎలా థాంక్స్ చెప్పాలో అర్ధం కావడం లేదు…పెట్రోలు పోసుకుని సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేసిన అతను మా కంపెనీలో ఎంప్లాయ్… .సమయానికి వచ్చి అతన్ని రక్షించి మంచి పని చేసారు….లేకపోతే అతనికి ఏదైనా అయితే ఇంత సంతోషమైన రోజు మేమందరం బాధ పడాల్సి వచ్చేది,” అంటూ రాముని పైకి లేపి తన వైపుకు తిప్పుకుని రాముని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యంతో తాను చూస్తున్నది కలా నిజమా అన్నట్టు అలాగే రాము వైపు కన్నార్పకుండా చూస్తున్నాడు.
కారణం ఏంటంటే రాము కూడా అచ్చం తనలాగే ఉండటంతో ఇన్నేళ్ళు తన నానమ్మ చెప్పిన అతను ఇతనేనా అన్నట్టు చూస్తున్నాడు.
రాము తమ వైపు తిరిగిన తరువాత అతన్ని చూసిన ఒబరాయ్ ఫ్యామిలీ కూడా ఆశ్చర్యంతో, ఆనందంతో అలాగే నోట మాట రాక రాము వైపు కన్నార్పకుండా చూస్తున్నారు.
రేణుక కూడా ఆనందగా రాము వైపు చూసి నోట మాట రాక అలాగే చూస్తున్నది.
గుళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా రాము, ఒబరాయ్ ఫ్యామిలీలో పెద్ద మనవడు అచ్చుగుద్దినట్టు ఒకేలా ఉండటంతో అలాగే ఏం జరగబోతుందా అని చూస్తున్నారు.
అందరు ఎవరి ఆనందంలో వాళ్ళు, ఆశ్చర్యంలో వాళ్ళు ఉండగా మీడియా వాళ్ళు వెంటనే రాముని, మనవడిని కలిపి ఫోటోలు తీస్తూ, వాళ్ళిద్దరి ఫోటోలతో పాటు ఒబరాయ్ ఫ్యామిలీ ఫోటోలు టకటక తీస్తున్నారు.

6 Comments

  1. Inka eni parts pedutaru. em baledhu story.please appeyandi.edina new story start cheyandi.

  2. స్టోరీ చాల అద్భుతంగా రాసారు నేను మీకు పెద్ద ఫ్యాన్ ఐపోయాను ముఖ్యంగా రేణుక రామ్ ల మధ్య లవ్ స్టోరీ మాత్రం అదిరిపోయింది కానీ రేణుక మళ్ళీ యవ్వనంగా అయితే మాత్రం మీ స్టోరీ చాలా హిట్ అవుతుందని నా గట్టి నమ్మకం ఇది కేవలం సజెసషన్ గా మాత్రమె తీస్కోండి నచ్చకపోతే క్షమించండి?

  3. Bayya story qnvasranga laguthunavu.feell mothamu poyendhi

    1. Superu flashback

  4. aa air hostes ni matram enduku vadilesaru? dani pukuni kuda ramu moddatho dunnipiste bagundu.

Comments are closed.