రాములు ఆటోగ్రాఫ్ – Part 11 90

అంటూ కార్ స్టార్ట్ చేసి రాము చెప్పిన 5 స్టార్ హోటల్ వైపు పోనిచ్చాడు.
పావుగంటకు రాము ఎక్కిన క్యాబ్ Grand Hayatt ముందు ఆగింది.
రాము అతనికి డబ్బులు ఇచ్చి….కారు దిగాడు….అంతలో హోటల్ బెల్ బాయ్ వచ్చి రాముకి విష్ చేసి అతని లగేజీ తీసుకుని లోపలికి వచ్చాడు.
రాము రిసెప్షన్ లోకి వచ్చి బిజినెస్ సూట్ ఒకటి తీసుకున్నాడు.
బెల్ బాయ్ రిసిప్షన్ లో రాము బుక్ చేసిన సూట్ కీస్ తీసుకుని అతని లగేజ్ తీసుకుని రాము వైపు చూసి, “రండి సార్….నేను మిమ్మల్ని సూట్ కి తీసుకెళ్తాను,” అంటూ అక్కడ నుండి కదిలాడు.
రాము అతన్ని వెనకాలే లిఫ్ట్ లోకి వెళ్ళి అక్కడ నుండి ఫోర్త్ ఫ్లోర్ లో ఉన్న తన సూట్ దగ్గరకు వెళ్ళి బెల్ బోయ్ లాక్ ఓపెన్ అవంగానే లోపలికి వెళ్ళాడు.
బెల్ బోయ్ తన చేతిలో ఉన్న సూట్ కేస్, బ్యాగ్ అక్కడ ఉన్న వార్డ్ రోబ్ లో పెట్టి రాము వైపు చూసి, “సార్….ఇది హాల్….అదిగో అది బెడ్ రూమ్…..మీకు ఏదైనా అవసరం ఉంటే రిసెప్షన్ కి ఫోన్ చేయండి….ఇందులో మొత్తం రూమ్ సర్వీస్, రిసిప్షన్ నెంబర్లు ఉన్నాయి,” అంటూ ఫోన్ పక్కనే ఒక క్యాటలగ్ చూపించి….బెడ్ రూమ్ లోకి తీసుకెళ్ళి రూమ్ చూపించాడు.
రాము తన పాకెట్ లో ఉన్న వాలెట్ తీసి అతనికి టిప్ ఇచ్చి బెడ్ మీద పడుకున్నాడు.
బెల్ బోయ్ టిప్ తీసుకుని హాల్లోకి వచ్చి AC ఆన్ చేసి వెళ్ళాడు.
రాము ఐదు నిముషాలు అలాగే పడుకుని బాత్ రూమ్ లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రిసిప్షన్ కి ఫోన్ చేసి లంచ్ ఆర్డర్ చేసాడు.
పది నిముషాలకు రూమ్ సర్వీస్ వచ్చి లంచ్ ఇచ్చి వెళ్ళారు.
రాము భోజనం చేసిన తరువాత కొద్దిసేపు అలాగే ఆలోచిస్తూ పడుకున్నాడు.
సాయంత్రం ఐదు గంటలకు రాముకి మెలుకువ వచ్చి లేచి టీ తెప్పించుకుని తాగిన తరువాత నిద్ర మత్తు మొత్తం వదిలింది.
బెడ్ మీద తన ఫోన్ తీసుకుని ముంబయ్ లో ఒక నెంబర్ కి ఫోన్ చేసాడు.
ఆ నెంబర్ డయల్ చేస్తున్నప్పుడు రాము చేతి వేళ్ళు వణకడం మొదలుపెట్టాయి.
అవతల ఫోన్ రింగ్ అవుతుంటే రాము గుండె శబ్దం తనకే వినబడటం గమనించి, తన మనసులో, “ఎవరు ఫోన్ ఎత్తుతారు…. ఒకవేళ ఫోన్ ఎవరైనా లిఫ్ట్ చేస్తే తాను ఎవరని చెప్పాలి,” అని ఆలోచిస్తున్నాడు.
అంతలో అవతల వైపు నుండి ఫోన్ లిఫ్ట్ చేసి, “హలో…..ఎవరు సార్ మాట్లాడేది….” అన్నారు.
అవతల వైపు నుండి తనను సార్ అని పిలిచేసరికి ఎవరో ఎంప్లాయ్ ఫోన్ లిఫ్ట్ చేసి ఉంటాడని రాము అనుకుని, “హలో….అది స్వస్థిక్ విల్లానా…..” అని అడిగాడు.
“అవును సార్….చెప్పండి….” అన్నారు అవతల వైపు నుండి.
“నేను రేణుక గారితో మాట్లాడాలి…..” అన్నాడు రాము.
“సారీ సార్….మేడమ్ గారు….గుడికి వెళ్ళారు….” అన్నాడు అతను.
“అయితె….ఆమె కొడుకులు కాని, మనవళ్ళు కాని ఎవరైనా ఉన్నారా,” అనడిగాడు రాము.
“లేరు సార్….అందరూ వినాయకుడి గుడికి వెళ్ళారు….ఇవ్వాళ అక్కడ పూజ ఉన్నది,” అన్నాడు.
“సరె….అయితే వాళ్ళను నేను అక్కడే కలుస్తాను….అడ్రస్ చెప్పండి,” అన్నాడు రాము.
దాంతో అతను రేణుక వాళ్ళందరూ వెళ్ళిన గుడి ఎక్కడ ఉన్నదో అడ్రస్ చెప్పాడు.
రాము సరె అని చెప్పి ఫోన్ పెట్టేసి….బెడ్ మీద ఫోన్ పెట్టి తన సూట్ కేస్ లోనుండి తనకు ఎంతో ఇష్టమైన డ్రస్ తీసుకుని బెడ్ మీద పెట్టి బాత్ రూమ్ లోకి వెళ్ళి స్నానం చేసి వచ్చాడు.
స్నానం చేసి వచ్చిన తరువాత రాము డ్రస్ చేసుకుని రూమ్ లాక్ చేసి హోటల్ లో ఉన్న రెస్టారెంట్ కి వెళ్ళి టిఫిన్ చేసి బయటకు వచ్చే సరికి సాయంత్రం 6.30 అయింది.
అలా రాము బయటకు రాగానే ఒక క్యాబ్ వచ్చి అతని ముందు ఆగింది.
రాము క్యాబ్ లో కూర్చుని డ్రైవర్ కి వినాయకుడి గుడికి తీసుకెళ్ళమని చెప్పాడు.
క్యాబ్ డ్రైవర్ అలాగే అంటూ కార్ స్టార్ట్ చేసి వినాయకుడి గుడి వైపుకి పోనిచ్చాడు.
“గుడికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది,” అన్నాడు రాము.
“సార్….దాదాపు గంటన్నర పడుతుంది….ట్రాఫిక్ లేకపోతే గంటలో వెళిపోవచ్చు,” అన్నాడు డ్రైవర్.
“సరె…..తొందరగా పోనివ్వు,” అన్నాడు రాము.
డ్రైవర్ సరె అని తల ఊపుతూ కార్ వినాయకుడి గుడి వైపు పోనిచ్చాడు.
రాము వెనక సీట్లో ఆనుకుని కూర్చుని కళ్ళు మూసుకుని, “వాళ్ళను కలిసి దాదాపు 50 ఏళ్ళు అవుతుంది….అసలు రేణుక నన్ను గుర్తు పడుతుందా…..నా పిల్లలు ఐదేళ్ళ వయసు కన్నా చిన్నప్పుడే వాళ్ళను వదిలి వెళ్ళాను…..పెద్ద అబ్బాయికి కనీసం 45 ఉంటాయి….రెండో వాడికి 44 ఏళ్ళు….నా చిట్టి కూతురుకి 42 ఏళ్ళు ఉంటాయి…..వాళ్ళ పిల్లలు కూడా దాదాపు ఒక్కొక్కళకి పాతికేళ్ళ పైనే ఉంటుంది…..పెద్దోడికి ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి, రెండో వాడికి ఒక అబ్బాయి….కూతురికి ఒక అబ్బాయి అని రేణుక లెటర్ రాసి పెట్టింది….ఇన్నేళ్ళ తరువాత వాళ్ళను కలిసిన తరువాత నేను వాళ్ళను ఎలా పలకరించాలి…..వాళ్ళు నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారు….” అంటూ ఆలోచనల్లో ఉన్న అతనికి ఎంత టైం అయిందో తెలియలేదు.
అలా ఆలోచిస్తున్న రాముకి డ్రైవర్, “సార్….గుడి దగ్గరకు వచ్చాము…..” అని కారుని రోడ్ మీద ఒక పక్కగా తీసి వెనక్కి తిరిగి చెప్పడంతో రాము ఆలోచనల్లోంచి బయటకు వచ్చాడు.
రాము కార్ విండో లోనుండి బయటకు చూసాడు….అంతా హడావిడిగా ఉన్నది.
“సరె…..కారు ఇంత దూరంలో ఆపావెందుకు….గుడి లోపలికి పోనివ్వు,” అన్నాడు రాము.
“సార్….ఇవ్వాళ గుడి చాలా రష్ గా ఉన్నది….లోపలికి పోనివ్వడం కుదరదు….కాని గుడి ముందు ఆపుతాను,” అన్నాడు డ్రైవర్.
“సరె….పోనివ్వు…..ఇంత మంది జనం ఉన్నారు….ఏంటి స్పెషల్,” అనడిగాడు రాము.
“ఇవ్వాళ ఒబెరాయ్ ఫ్యామిలీ వాళ్ళు పూజలు చేయిస్తున్నారు సార్…..అందుకనే ఇంత రష్ గా ఉన్నది,” అన్నాడు డ్రైవర్.
క్యాబ్ డ్రైవర్ అలా అనగానే రాముకి ఇవ్వాళ స్పెషల్ ఏంటో వెంటనే తట్టింది….కాని తన డౌట్ క్లియర్ చేసుకోవడానికి….
“ఏంటి సంగతి….నీకేమైనా తెలుసా,” అనడిగాడు రాము.
“కరెక్ట్ గా తెలియదు సార్…కాని ప్రతి సంత్సరం ఈరోజు పెద్ద పండగలా చేస్తారు…ఎందుకు ఏంటి అని తెలియదు సార్,” అన్నాడు డ్రైవర్.

డ్రైవర్ చెప్పింది విని రాము మనసు సంతోషంతో నిండిపోయింది….తన వాళ్ళు తనను మర్చిపోలేదన్న విషయం తెలిసిన తరువాత రాముకి వాళ్ళను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కలవాలని మనసు తెగ ఆరాటపడిపోతున్నది.
డ్రైవర్ వెనక్కి తిరిగి రాము మొహంలో సంతోషం చూసి ఎందుకంత ఆనందంగా ఉన్నాడో అర్ధంకాక కారు స్టార్ట్ చేసి గుడి ముందుకు వెళ్ళిన తరువాత లోపలికి తీసుకెళ్ళడానికి పార్కింగ్ వైపు తిప్పాడు.
కాని అక్కడ ఉన్న పోలీస్ కానిస్టేబుల్ క్యాబ్ ని ఆపి, “ఇటు వైపు ఎంట్రీ లేదు…..అటు వైపు వెళ్ళు,” అంటూ రాము కూర్చున్న విండో దగ్గరకు వచ్చి, “నువ్వు గుళ్ళోకి వెళ్ళాలనుకుంటే ఇక్కడ నుండి నడిచి వెళ్ళాలి,” అంటూ డోర్ తీస్తున్నాడు.
అంతలో అప్పుడే గుడి లోపల నుండి వాకీటాకీలో మాట్లాడుతూ వస్తున్న ACP వస్తూ తన కానిస్టేబుల్ ఆపిన రాముని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు.
ACP ఒక్కసారి గుడి లోపలికి చూసి మళ్ళీ తల తిప్పి రాము వైపు చూసి తాను చూస్తున్నది కలా నిజమా అన్నట్టు బిత్తరపోయి చూస్తున్నాడు.
అప్పటి దాకా తాను చూసిన వ్యక్తి స్వభావానికి తన ఎదురుగా కనిపిస్తున్న రాము స్వభావం వేరని అతని పోలిస్ బుధ్ధి వెంటనే గ్రహించింది.
కాని ఇదెలా సాద్యం….అయినా ఒకవేళ తన అంచనా తప్పయితే రాముని ఆపిన కానిస్టేబుల్ పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తూ, “ఏయ్….” అని గట్టిగా కానిస్టేబుల్ ని అరుస్తూ, “ఎవరిని ఆపుతున్నావో అర్ధమవుతుందా….ప్రశాంతంగా జాబ్ చేసుకోవాలని లేదా,” అని అరుస్తూ….రాము వైపు తిరిగి, “సార్….సారీ సార్….మా కానిస్టేబుల్ మిమ్మల్ని ఇంతవరకు చూడలేదు కదా….అతనికి మీరెవరో తెలియదు….వాడి తరుపున నేను సారి చెబుతున్నాను….” అన్నాడు.
ACP అలా అనగానే ఆయన తనను ఎవరు అని అనుకుంటున్నాడో అర్ధం అయ్యి రాము తన మనసులో నవ్వుకుంటూ అక్కడ నుండి నడుచుకుంటూ గుడిలోకి వెళ్ళబోయాడు.
కాని ACP అతన్ని ఆపుతూ, “సార్…మీరు నడుచుకుంటూ వెళ్ళడం ఏంటి…” అంటూ ఇంతకు ముందు రాము ఎక్కి వచ్చిన క్యాబ్ అక్కడే ఉండటంతో వెనక డోర్ తీసి పట్టుకుని, “సార్….మీరు కారులో వెళ్ళండి…..డైరెక్ట్ గా VIP ఎంట్రన్స్ దగ్గర దింగండి,” అంటూ డ్రైవర్ తో వెళ్ళమని చెప్పి….తన చేతిలో ఉన్న వాకీటాకీలో రాము ఎక్కిన క్యాబ్ నెంబర్ చెప్పి తన కింద వాళ్ళకు ఆ క్యాబ్ ని ఎక్కడా ఎవరు ఆపొద్ది అని instructions ఇచ్చి, కానిస్టేబుల్ తో, “నువ్వు కూడా సార్ తో పాటు వెళ్ళి VIP ఎంట్రన్స్ దగ్గర దింపు,” అన్నాడు.
దాంతో కానిస్టేబుల్ రాముని ఆపినందుకు ఏమంటాడో అని భయపడుతూ క్యాబ్ ఫ్రంట్ డోర్ తీసుకుని డ్రైవర్ పక్కనే కూర్చున్నాడు.

6 Comments

  1. Inka eni parts pedutaru. em baledhu story.please appeyandi.edina new story start cheyandi.

  2. స్టోరీ చాల అద్భుతంగా రాసారు నేను మీకు పెద్ద ఫ్యాన్ ఐపోయాను ముఖ్యంగా రేణుక రామ్ ల మధ్య లవ్ స్టోరీ మాత్రం అదిరిపోయింది కానీ రేణుక మళ్ళీ యవ్వనంగా అయితే మాత్రం మీ స్టోరీ చాలా హిట్ అవుతుందని నా గట్టి నమ్మకం ఇది కేవలం సజెసషన్ గా మాత్రమె తీస్కోండి నచ్చకపోతే క్షమించండి?

  3. Bayya story qnvasranga laguthunavu.feell mothamu poyendhi

    1. Superu flashback

  4. aa air hostes ni matram enduku vadilesaru? dani pukuni kuda ramu moddatho dunnipiste bagundu.

Comments are closed.