సరే ఇదీ మన మంచికేలే 215

టీపాయ్ మీద నేను ఇచ్చిన బాటిల్, మూడు గ్లాసులూ, సోడా, నీళ్ళూ వున్నాయి . ఒక వైపు ప్లేట్లో చికెన్ కబాబ్ , జీడిపప్పు,రెండు గ్లాసుల్లో మందు కాస్తా మిగిలి వుంది. ఐదు నిమిషాలు చూసి విసుగెత్తి కిందకి దిగాను .

పంకజం మీద ఆలోచనలతో తాగిందంతా దిగిపోతోంది . రెండు గ్లాసుల్లో మందు దేనికి వుంది? పంకజం తాగుతుందా? ఆ మూడో గ్లాస్ దేనికి?

ఇప్పటికి ఆతను వెళ్లి అరగంట లోపే అవుతోంది కాబట్టి అసలు కార్యక్రమం ఇంకా అయినట్టు లేదు.

మరో సిగరెట్టు వెలిగించి గ్లాస్ అందుకుని సిప్ చేసాను.

రమేష్ గోడ ఎందుకు దూకినట్టు? మాకు అటు పక్క ఇంట్లో ఇద్దరు ముసలి దంపతులు వుంటారు . పిల్లలు ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తున్నారు.

ఆ పక్క ఇంట్లో మోహన్ రావు, ఆయన భార్య భారతి, వాళ్లకి ఇద్దరు మగ పిల్లలు . హైస్కూల్లో చదువుతున్నారు . భారతి వెర్రి మొర్రి వేషాలు వేసే మనిషి కాదు . ఆ మాటకొస్తే పంకజం కూడా నాకు తెలిసి అటువంటిది కాదు. మోహన్ రావు మా ఆఫీస్ పక్కనే వున్న రిజిస్ట్రార్ ఆఫీస్ లో పని చేస్తాడు . చేతినిండా సంపాదన.కొద్దిపాటి పరిచయం వుంది .

ఆఖరి ఇంట్లో వెంకటేష్, ఆయన భార్య పార్వతి వుంటారు. ఆయనకి గత రెండేళ్ల క్రితం భార్య బస్సు ఆక్సిడెంట్ లో పోయింది. అందరి బలవంతం మీద మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. పిల్లలు లేరు. అతనికి నలభై దగ్గర ఉంటాయి. ఆమె కనీసం పదేళ్లయినా చిన్నది . ఇద్దరూ ఆర్థోడాక్స్ గా వుంటారు . అతను ఏదో కోపరేటివ్ బ్యాంకు లో పని చేస్తాడు . ఆమె ని చూసిందే తక్కువ . సాధారణం గా బైట కనబడదు. మా శ్రీమతికి పరిచయం వుంది .

ఆలోచనలోనే అరగంట గడిచింది. టైం పావు తక్కువ పది. గ్లాస్ లోని ద్రవం ముగించి తిరిగి స్టోర్ రూమ్ లో కెళ్ళి కుర్చీ ఎక్కి లోపలకి చూసాను.
అప్పుడు తగిలింది మొదటి షాక్ !

ఒక కుర్చీ లో రమణ కూర్చుని వున్నాడు . అతని మొహం సైడ్ నుండి కడబడుతోంది . మరో కుర్చీ నా చూపుకి ఎదురుగానే వుంది. అందులో టిప్ టాప్ గా కూర్చుని వున్నాడు ఒకతను.

అతగాడికి 45, 50 మధ్య ఎంతైనావుండొచ్చు. కానీ మనిషి ఫిట్టుగా , దర్జాగా,దర్పంగా, జాలీ గా వున్నాడు. అతడిని ఒక సారి కలిసాను . ఏదో పని మీద రమణ ఆఫీసుకి వెళ్ళినపుడు పరిచయం చేసాడు .రమణ కంటే పై అధికారి అని అర్ధమైంది. అతని పేరు చలపతి . మా ఆఫీస్ లో చేసే రఘుపతి కి ఆతను దూరపు బంధువు కూడా. పెద్ద పరిచయం లేకపోయినా అతగాడు అలా గుర్తు. మంచి షోకిల్లా పురుషుడని, బాగా డబ్బుందని, పై సంపాదన కూడా బాగా వస్తుందని రఘుపతి చెప్పినట్టు గుర్తు.

ఇద్దరి చేతుల్లోనీ గ్లాస్ లు వున్నాయి .రమణ చేతిలో సిగరెట్టు వుంది .

రమణ లుంగీ, టీ షర్ట్ లో వున్నాడు. అతను పనంటూ చొక్కాలో వున్నాడు.

ఇద్దరూ ఆఫీస్ విషయాలు, ప్రమోషన్ విషయాలూ మాట్లాడుకుంటున్నారు . చలపతి ప్రమోషన్ వచ్చి వేరే రాష్ట్రం వెళ్లనున్నట్టు, ఆ స్తానం లోకి రమణ కి దక్కేటట్టు చలపతి ప్రయత్నం చేస్తున్నట్టు అర్ధమైంది.

” నీ పోజిషన్ స్ట్రాంగ్ గానే వుంది. ఒక సారి నాపొజిషన్ లోకి వస్తే నీకు ఇన్కమ్ బాగా ఎక్కువవుతుంది. జాగ్రత్తగా చేసుకుంటే ప్రమోషన్లు కూడా ఫాస్ట్ గా వస్తాయి . ” అని గ్లాస్ కిందపెట్టేడు చలపతి. అప్పటికి రెండు రౌండ్లు అయ్యాయి .

గ్లాసు మళ్ళీ నింపి “ఇప్పుడే వస్తాను సార్ ” అని రమణ గదిలోంచి వెళ్లి తిరిగి చేతిలో లుంగీ తో వచ్చాడు .

“ఇది కొత్తదే సార్. కట్టుకుని రిలాక్స్ అవండి .” అని అందించాడు .

ఎందుకయ్యా . ఎలాగూ ఇంకో రెండుగంటల్లో ఫ్లైట్ కి వెళ్ళాలి కదా!” అన్నాడు చలపతి .

“అంతవరకూ ఫ్రీగా వుండండి సార్ ” అన్నాడు రమణ.

Updated: November 12, 2020 — 12:18 pm

3 Comments

  1. Why did you stop abruptly. Pls continue immediately. Its so hot snd sexy.
    100/10 stars. So lovely. Pls continue.

Comments are closed.