సేల్స్ స్టార్ 1 399

“సర్లే, ఇంకేదైనా చెప్పు” అంటూ నేను టాపిక్ మార్చాను. అన్నానే గానీ, ఉదయ్ తో పని చేస్తానని తలుచుకుంటే, కొంచం ఎక్సైటింగ్ గానే వుంది. కడుపు లో అనీజీ గా ఏదో తిమ్మిరీగలు తిరుగుతున్న ఫీలింగ్.

వారం రోజుల తర్వాత. బుధ వారం సాయంత్రం 9 గంటలు అయ్యిది అనుకుంటా. ఉదయ్, నేను, ఆఫీసు కాన్ఫరెన్స్ రూం లో తర్వాతి రోజు జినో కార్ప్ మీటింగ్ కి రెడీ అవుతున్నాం. గత కొద్ది రోజులు గా ఇద్దరం మా స్ట్రాటజీ గురించి మాట్లాడుకుంటున్నాం. జినో కార్ప్ గురించి నాకు తెలిసిన విషయాలన్నీ నేను తనకు విడమరచి చెప్పాను. మా ఇద్దరి మధ్య మొదట్లో ఉన్న అనీజీనెస్స్ కొద్ది కొద్ది గా తగ్గుతూ వచ్చింది. ఆ రోజు రాత్రి జినో కార్ప్ కొత్త ప్లాంట్ల గురించి, వాళ్ళ మెషీన్స్ గురించి, మాట్లాడుతూ, వాళ్ళ కొత్త ఆఫీసు ఆర్గనైజేషన్ ఎలా వుంటుందో ఊహిస్తున్నాం.

కుర్చీ లో వెనక్కి వాలి నా మెడ ని అటూ ఇటూ ఊపాను, నొప్పి అన్నట్టు గా.

“మెడ నెప్పి?” అన్నాడు ఉదయ్, నా ఎదురు సీట్ లో కూర్చుని.

“అనుకుంటా. రాత్రి నిద్ర లో పట్టేసైనట్టుంది.”

“ఆలో మీ” అంటూ ఉదయ్ కుర్చీ లోంచి లేచి నా వెనక్కి చేరాడు. నేను వారించే లోపల తన చేతులు నా భుజాల మీద వున్నాయి.

“హేయ్… ఏం చేస్తున్నావ్” అంటూ నేను తన చేతులు తోసెయ్యతానికి ప్రయత్నించాను.

వేసుకున్న టాప్ లైట్ ఫాబ్రిక్ కావటం తో, నా భుజాలకి తన చేతుల వెచ్చదనం తెలుస్తోంది.

“రిలాక్స్, ఏం చెయ్యాలో నాకు తెలుసు” అంటూ ఉదయ్ తన రెండు బొటన వేళ్ళని, వెన్నెముక వైపు జరిపి గట్టిగా వత్తాడు.

“ఓహ్…” అంటూ మూలిగాను నొప్పి తో.

“మొదట కాసేపే నొప్పి గా వుంటుంది. అంతే..”

తను అన్నట్టు గానే, కాసేపటికి నొప్పి తగ్గి రిలాక్స్ అయినట్టు అనిపించింది. ఉదయ్ వేళ్ళు ఎక్స్పర్ట్ గా నా మెడ నరాల్ని, నాట్స్, మజిల్స్ ని జంటిల్ గా మసాజ్ చేస్తున్నాయి.

2 Comments

  1. very good

Comments are closed.