సేల్స్ స్టార్ 1 400

“ఓకే. అయితే మనం ఒక నిర్ణయానికి వచ్చినట్టే. ఉదయ్ జినో కార్ప్ ఎకౌంటు హేండిల్ చేస్తాడు ఇవ్వాళ నించి”

“థాంక్ యు” అంటూ ఉదయ్ లేచి నిలబడ్డాడు, తన షర్టు మడతలు సరి చేసుకుంటూ. ఇంత టెన్షన్ లో నూ, నా మనసు తన బేర్ చస్ట్ మీదకే మళ్ళింది. ఛ! అనుకుంటూ కళ్ళు తిప్పుకున్నాను.

“నాదో చిన్న రిక్వెస్ట్” అన్నాడు ఉదయ్. “ప్రియా ఈ ఎకౌంటు మీద నాతొ పని చేస్తే బావుంటుంది. జినో కార్ప్ చాలా పెద్ద కంపెనీ, ప్రియా కి చాల మంది తెలుసు. తన నాలెడ్జ్ నాకు చాలా ఉపయోగకరం గా వుంటుంది. ”

“పర్వాలేదు ఉదయ్” నాకు ఈ సముదాయింపు ధోరణి నచ్చలేదు. “నీకు నేనేమీ అంత తప్పని సరి కాదు. నాకేమీ ఫేవర్స్ అక్కర్లేదు. థాంక్స్ ఎనీ వే.” అన్నాను, కొంచెం అసహనంగా.

“ఫేవర్ ఏం కాదు. నేను చెప్పింది అక్షరాలా నిజం. నాకు నిజం గా నీ అవరసరం వుంది” ఉదయ్ మాటల్లో నిజాయితీ కనిపించింది.

“సరే, దీనిమీద మన ఇప్పటికే చాల టైం గడిపాం. ఈ ఎకౌంటు మీద ప్రియ, ఉదయ్ ఇద్దరూ కలిసి పని చేస్తారు. సతీష్, క్రెడిట్ ఎవరికి ఎలా ఇస్తావో, నీ బాధ్యత” అంటూ ముగించాడు రాజీవ్.

ఉదయ్ నా వేపు చూసి చిరునవ్వు నవ్వాడు. నేను కూడా తన వేపు చూసి స్మైల్ చేసాను.

——————————–

“సారీ రా, దేవుడి మీద నీకు అంత భరోసా లేదని నాకు తెలుసు, కానీ, జరుగుతున్నది చూస్తుంటే, ఇదేదో పై వాడి మాస్టర్ ప్లాన్ లాగే కనిపిస్తోంది” అంది నీలూ నవ్వుతూ.

“మళ్ళీ మొదలెట్టావా? ఉదయ్, నేను ఒక ఎకౌంటు మీద పని చేస్తున్నాం అంతే. అంత కంటే ఏమీ లేదు.”

“ఇంత కంటే మంచి అవకాశం ఎక్కడ దొరుకుతుంది?”

2 Comments

  1. very good

Comments are closed.