సేల్స్ స్టార్ 3 156

“నిజమేనా?” నా వైపు చూస్తూ అడిగాడు.

“రెడ్డి గారు పెద్దాయన, సర్” అన్నాను కొంచెం సందేహం గా.

“నో, నీ మనసు లో ఏముందో చెప్పు. ఇది చాలా ముఖ్యం. మనం అంతా ఒక ఫామిలీ ఇక్కడ.” కళ్ళల్లో కి సూటి గా చూస్తూ అడిగాడు.

“సర్, అడిగారు కాబట్టి చెబుతున్నా.. ఆయన మా ఆవిడ వైపు అలా తినేసేలా చూడటం, అదీ అందరి ముందర.. అందరికీ కనిపించేలా అలా చెయ్యటం ఏమీ సభ్యత గా లేదు సర్. నాకు చాలా తలవంపు అయింది.” కొంచెం ఆగి అన్నాను. “ఒక పెళ్లి ఐన ఆడ దాన్ని, అందం గా ఉందే అనుకోండి, అదే వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్య, మొగుడు, అత్తగారు, అందరూ చూస్తుండగా అలా చూడటం ఏం మర్యాదగా వుంటుంది చెప్పండి? మా పరువు మర్యాదలు ఏం కావాలి?”

ఆయన ఊహించిన దాని కంటే ఇంకా తెలివి గా మాట్లాడినట్టు ఉన్నాను. నన్ను కొంచెం సీరియస్ గా తీసుకున్నాడు. “నిన్ను అర్థం చేసుకోగలను” ఆలోచిస్తూ అన్నాడు “నువ్వు తెలుసుకోవాల్సిన విషయాలు కూడా కొన్ని ఉన్నాయి.”

“మనం లోపలి వెళ్లి మాట్లాడుకుందాం” అంటూ, ఇంటర్ కాం ఎత్తి అసిస్టెంట్ కి డిస్టర్బ్ చెయ్యద్దని చెప్పాడు.

ఆయన వెనకాల ఉన్న డోర్ తెరిచి, లోపల ఇంకో గది లోకి తీసుకు పోయాడు. రెండు సోఫా లు, మధ్య లో కాఫీ టేబుల్, కార్పెట్ తో ఆ రూం హోమ్లీ గా వుంది. ఒక పక్క చిన్న ఫ్రిట్జ్, గోడ మీద రెడ్డి గారూ, మిస్టర్ అండ్ మిసెస్ సేన్ లు కలిసి దిగిన పెద్ద ఫోటో, నయాగరా ఫాల్స్ బ్యాక్ డ్రాప్ తో వుంది.

ఆయన సోఫా లో కూర్చుంటే, నేను పక్కనే వున్న లవ్ సీట్ లో కూర్చున్నాను.