సేల్స్ స్టార్ 3 156

“ఆఫ్రికా లో మనకి పెద్ద పోటీ. కరప్షన్ ఎక్కువ అవటం మూలంగా, మన ప్రత్యర్ధులు కాంట్రాక్ట్లులు తన్నుకు పోతున్నారు.”

“నన్నేం చెయ్యమంటారు సర్? ” సూటి గా అడిగా.

“ఓ రెండు రోజుల్లో ఏనుగంత పెద్ద మనిషి ఒక అందమైన ఆడదానికి ఎలా దాసోహం అంటున్నాడో నువ్వే చూసావు.” అని ఆగాడు. “ఇలా మాట్లాడుతుంటే, నీకు అభ్యంతరం గా వుంటే చెప్పు”.

“లేదు, లేదు. మన కంపెనీ కి మంచి జరగటానికి నా సాయ శక్తులా ప్రయత్నిస్తా, చెప్పండి” అన్నాన్నేను.

ఆయన కొంచెం ఆలోచించి నా కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు. “మొన్న రాత్రి మొదటి సారి రెడ్డి గారి లాంటి నిగ్రహం వున్న వాడు కూడా, ఒక చిన్న తప్పుడు విషయం నమ్మి ఎలాటి మాయలో పడిపోగలడో గమనించాకే, నాకీ ఆలోచన వచ్చింది. కొంచెం హోమ్లీ టచ్ తో మనం ఎంతటి వాళ్ళనైనా లొంగ దీసుకోవచ్చు.”

ఆయన చెప్పినదంతా బానే వుంది కానీ, ఆ తప్పుడు విషయం ఏమిటో, రెడ్డి గారికి ఎవరు చెప్పారో, నాకు ఇంకా అంతు పట్టలేదు. ధైర్యం తెచ్చి పెట్టుకుని, ఆయన్ని అదే అడిగేసాను.

ఆయన నా వైపు చూసి నవ్వాడు. “అది కూడా చెబుతాను. కాఫీ తాగుతావా?” ఇంటర్ కాం ఎత్తి పీ ఏ కి రెండు కాఫీ లు పంపించమని చెప్పాడు.

“ఇదంతా వింటుంటే, నీకు ఏమనిపిస్తోంది? చెయ్యగలను అనుకుంటున్నావా?”

“ఇది ఒక చాలెంజ్ సర్. వేరే దేశాల్లో అంటే, ఇంట్రస్టింగ్ గా వుంటుంది అనుకుంటున్నా.”

“మంచిది. నీకు నీ ఫామిలీ నించీ సపోర్ట్, కోపరేషన్ వుంటుంది అనుకుంటున్నావా? ముఖ్యం గా మీ ఆవిడ నించీ”

ప్యూన్ లోపలి వచ్చి టేబుల్ మీద రెండు కాఫీలు పెట్టి వెళ్లాడు. ఆయన నా వైపే చూస్తున్నాడు.

ఆయన అంత డైరెక్ట్ గా నన్ను అడిగేసరికి నా ముఖం లో రక్తం ఇంకి పోయింది. కాఫీ రెండు సిప్పులు తీసుకుని ధైర్యం తెచ్చుకుని, అన్నాను. “సర్, మనం కాంపిటీషన్ ని మర్చిపోగూడదు. ఇప్పదికిప్పుడు చెప్పమంటే కష్టమే కానీ, నా భార్య అంటే పరాయి మొగాల్లు ఎలా గుడ్లు అప్పగించి చూస్తారో, నాకు ప్రత్యక్షం గా తెలుసు. అవసరాన్ని బట్టి, అవతలి మనుషుల విలువలని బట్టి, మనం ఎంతో కొంత చెయ్యచ్చు. సర్దుకు పోవచ్చు, అని నా ఉద్దేశం”