సేల్స్ స్టార్ 3 156

మళ్ళీ అమ్మ ఏదో అడిగే లోపులే, అన్నా. “అయినా వాళ్లకి ఏం కావాలిట?”

“ఆవిడ నన్నేం అడగలేదు. సేన్ గారు ఇది నీకు సరి పోయే వుద్యోగమే అన్నారట. అల్ ద బెస్ట్ అని చెప్పింది. కొత్త మేనేజిమెంట్ ఫ్యాక్టరీ లో తెచ్చిన మార్పులు, అభివృద్ధి అందరికీ సంతోషం గా వుంది అంది”

ఇది నిజమేనని నాకూ తెలుసు.

ఇలాంటి పెద్ద మేనేజర్ పోజిషన్ కోసం ఎన్ని రోజులుగా కలలు కన్నాను!! నిజం గానే ఇది పెద్ద సర్ప్రైస్ నాకు. మొన్న రోజు జరిగిన సంఘటనకి, దీనికీ ఏదో సంబంధం వుండి వుండచ్చు అని ఏ మూలో అనిపించింది. నాలో ఆసక్తి రేపింది.

ఇంట్లో పనులు చూసుకోవటానికి అమ్మ వెళ్లి పోయింది. నేను వచ్చి మంచం మీద ఆలోచిస్తూ పడుకుని వుండిపోయాను.

టీ తీసుకుని రచన పైకి వచ్చింది.

“మిసెస్ సేన్ అత్తయ్య కోసం కారు పంపించింది. ఏంటిట విషయం?” అడిగింది.

నేను జరిగిన సంగతి చెప్పాను. రచన నమ్మలేనట్టు చూసింది.

“కాబోయే ఎక్సపోర్ట్స్ డిపార్ట్మెంట్ మేనేజర్ గార్ని చూసి ఇంప్రెస్ అయ్యవా, లేదా?” నవ్వుతూ అన్నా.

రచన చేతులు రెండూ కట్టుకుని నా వైపు పరిశీలన గా చూస్తున్నట్టు చూసి “పర్వాలేదు!” అని నవ్వుతూ తల ఎగరేసింది.

రచన భుజం మీద చెయ్యేసి నొక్కి చెవిలో గుసగుసలాడా. “మరి తలుపేసి దగ్గరికి రా”