అందమైన జీవితం 887

(అటూ ఇటూ చూస్తే, రెడ్ డ్రెస్ లో ముగ్గురు, నలుగురు అమ్మాయిలు కనిపించారు..)

నేను : రెడ్ డ్రెస్ లో ఉన్నాను.

ఆయన bananaకనీసం చూడనైనా చూడకుండా..) నువ్వు డెఫినెట్ గా రెడ్ డ్రెస్ వేసుకు రాలేదు.

(నేను ఆశ్చరయపోయాను.)

నేను : మీకెలా తెలుసు?

ఆయన : ఫస్ట్ టైమ్ తన లవర్ ని కలుసుకోడానికి వచ్చే ఏ అమ్మాయీ రెడ్ డ్రెస్ వేసుకోదు.

నేను : మరి?

ఆయన : పింక్ లేదా బ్లూ లేదా రెండూ కలసిన కాంబినేషన్.

( గబుక్కున నా డ్రెస్ చూసుకున్నా. పింక్ అండ్ బ్లూ…కొంపదీసి నన్ను కనిపెట్టేసాడా అనిపించింది. ఆయన వైపు చూస్తే అసలు ఎటూ చూడకుండా చిద్విలాసంగా కూర్చొని ఉన్నాడు.)

నేను : ఓకే…మీరు చెప్పింది కరెక్ట్. మరి నేనెక్కడున్నానో కనుక్కోండి. మీ అంతట మీరే కనుక్కుంటే, ఇప్పుడే మీరు ఎక్కడకి రమ్మంటే అక్కడకి వస్తా..

ఆయన: లేకపోతే…?

నేను : ఈ రోజుకి అంతే…మనం కలవం…3 మినిట్స్ టైమ్ మీకు..

ఆయన: ఓకె…ఓకే..

ఆయన పైకి లేచి రెస్టారెంట్ అంతా తిరిగి చూస్తున్నాడు. ఇద్దరు అమ్మాయిలతో ఏదో మాట్లాడితే, వాళ్ళు నవ్వి ఏదో చెప్పారు. ఆ తరువాత ఆయన నేను ఉన్న వైపుకు వచ్చారు. నేను టేబుల్ కిందకి దూరా. ఆయన చేతిలో సెల్ నన్ను చూస్తున్నట్టుగా అనిపించి, సిగ్గుపడ్డా. ఒక పది సెకన్ల తరువాత తిరిగి వెళ్ళి, తన సీట్ లో కూర్చొని మళ్ళీ మెసేజ్ పెట్టాడు.

ఆయన : అసలు నువ్వు వచ్చావా?

నేను : వచ్చా…ఇక్కడే ఉన్నా…మిమ్మల్ని చూస్తున్నా..

ఆయన : అసలు నువ్వెలా ఉంటావ్? చిన్న హింట్ అయినా ఇవ్వొచ్చుగా..

నేను : చెప్పాగా 34..26..34

ఆయన : నీ హింట్ తగలెట్టా… బట్టలుంటే కొలతలు కనిపెట్టడం రాదు నాకు.