బేర్ డెవిల్ 70

“ఛ… నిజమా… మరా ఖర్మ మాకు పట్టిందనుకున్నారా?”

“అంటే మీరు ఆత్మహత్య చేసుకోబోవడం లేదా?”

ఆమె నవ్వింది. పగలబడి మరీ నవ్వింది.

“నేనా? ఆత్మహత్యా… యూ… సీ.. ఐయామ్ ఎక్స్పర్ట్ ఇన్? స్విమ్మింగ్…”

“మరైతే రెయిలింగ్…”

“సరదాగా రెయిలింగ్ మీద కూచుందామని…”

అతని మొహం సిగ్గుతో ఎర్రబడింది.

“ఓహ్… అయామ్ సారీ… మీరు ఆత్మహత్య చేసుకోబోతున్నారని పొరపడి…”

అతను సిగ్గుపడిపోయాడు.

“వన్స్ ఎగైన్ సారీ…”

“దట్స్ ఆల్రైట్… ఇంతకీ మీరు…”

“అయామ్ అనుదీప్… ఇండస్ట్రియలిస్ట్ ఏకాంబరం ఏకైక సంతానాన్ని… మరి మీపేరు…?” అందంగా, సెక్సీగా వున్న ఆమె వంక చూసి అడిగాడు.

“అయామ్ విరాళి… ఆప్ కోర్స్… మా ఫాదర్ ఇండస్ట్రియలిస్ట్ కాదు… లేట్ రామ్మూర్తి. చనిపోయి ఆరేళ్ళవుతోంది… ప్రస్తుతం… ఓ ఫ్రెండింట్లో పెయింగ్ గెస్ట్ ని. పాపం తనకి ఘోస్ట్ లా తయారయ్యాను. ఏదో ఓ జాబ్ వెతుక్కునే ప్రయత్నంలో ఉన్నాను.” కింది పెదవిని పైపంటితో నొక్కుకుంటూ అంది.

ఆమెవైపు పరిశీలనగా చూసాడు. ఎంతో మంది అమ్మాయిలను చూసినా, ఇంతందమైన అమ్మాయిని మొదటిసారి చూస్తున్నాడు. చక్కని షేపులతో, చూడముచ్చటగా ఉంది. ఆమె కళ్ళలో సెక్సీనెస్, కంఠంలో హస్కీనెస్…

“ఏంటి… నన్ను చూడకుండా నా షేపులు చూస్తున్నారా?” ఆమె అనడంతో ఉలిక్కిపడి

“అబ్బే… అదేంకాదు…” అన్నాడు.

“ఏంటి… నేను బావోలేనా?”

“ఛ… ఛ…”

“అంత చండాలంగా వున్నానా?”

“అయ్యో …”

“అంత సింపతీ చూపించుకునేలా వున్నానా?”, అప్పటిగ్గానీ ఆమె తనని ఆటపట్టిస్తోందని అర్థం కాలేదు.

అర్థమయ్యాక నవ్వి అన్నాడు.

“మీరు టూ ఇంటిలిజెంట్…” అని

Updated: January 26, 2023 — 1:32 pm