బేర్ డెవిల్ 70

“యూ… డేర్ డెవిల్…” కసిగా అన్నాడు అనుదీప్, విరాళితో.

“యస్.. అయామ్ డేర్ డెవిల్… థ్యాంక్స్ ఫర్ ద సిన్సియర్ కాంప్లిమెంట్…” చిరునవ్వుతో అంది విరాళి.

“నీకస్సలు సిగ్గులేదు” ఇంకా కచ్చగా అన్నాడు అనుదీప్.

“పూర్ అనుదీప్… నాకస్సలు సిగ్గు వుంటే, సిగ్గూ, శరమూ లేని, నీలాంటి క్యారెక్టర్లెస్ స్టుపిడ్ తో ఇలా బెడ్డుమీద బట్టలు లేకుండా వుంటావా? నేను డేర్ డెవిల్ నే కాదు, బేర్ డెవిల్ ని కూడా….” నూలుపోగైనా లేని తన బేర్ బాడీని ఎదురుగా వున్న అద్దంలో చూసుకుంటూ అంది విరాళి.

ఒక్క క్షణం ఏం మాట్లాడాలో, ఏం చేయాలో… అర్థం కాలేదు. తనామెని ఏం చేయలేడు. ఆమె తలచుకుంటే తనని ఏదైనా చేస్తుందేమో… అరగంట క్రితం ఆ బేర్ బాడీని తను తనివితీరా అనుభవించిన విషయం గుర్తొచ్చినా, వళ్ళు పులకించడంలేదు. పైగా చిన్న జలదరింపు కలుగుతోంది.

అసలు వాళ్ళ పరిచయమే చిత్రంగా జరిగింది. ఆరు నెలల క్రితం.

***

అనుదీప్ ఆస్తిపరుడు, పైగా ఒక విధమైన సెక్స్ మానిక్ కనిపించిన అమ్మాయిని వదిలి పెట్టే అలవాటు లేదు. అందుకోసం ఎంత డబ్బయినా ఖర్చు చేయగలడు… ఏ అఘాయిత్యానికైనా సిద్దపడగలడు…

ఓరోజు కారులో వెళ్తున్నాడు. రాత్రి పదకొండు దాటింది.

టాంక్ బండ్ నుంచి కారు వెళ్తోంది.

చల్లటి గాలి రివ్వున లోపలికి వీస్తూ, హాయినిస్తోంది. బుద్ధుడి విగ్రహం నిశ్చలంగా కనిపిస్తోంది. కాసేపాగి, రిలాక్స్ కావాలనుకున్నాడు. అప్పటికే రెండు ఆఫ్ లు పూర్తి చేశాడు. అయినా అనుదీప్ కు కిక్కురావడం లేదు. ఓ పక్కన కారాపాడు.

చల్లగాలి మొహాన్ని స్పృశిస్తోంది. రెయిలింగ్ ని ఆనుకొని నిలబడ్డాడు. వాతావరణం చాలా ఆహ్లాదంగా వుంది. చలికాలం కావడంవల్ల పెద్ద రష్ లేదు. జనాలు ఇళ్ళలో ముసుగు తన్ని పడుకొని ఉంటారు. అప్పుడప్పుడు కార్లు, స్కూటర్లు వెళ్తున్నాయి. ఈ టైంలో ఓ కసక్కులాంటి అమ్మాయి వెంట వుంటే ఎలా ఉంటుందనే ఐడియా అనుదీప్ కు రావడం యాదృచ్చికం కాదు. సర్వ సాధారణం. ఇలాంటి ఐడియాలు అతని మనసులో ఎప్పుడూ స్టాక్ గా వుంటూనే వుంటాయి.

సరిగ్గా అతని దృష్టి అప్పుడు పడింది కాసింత దూరంలో రెయిలింగ్ ని ఆనుకొని నిలబడి ఉన్న అమ్మాయి మీద.

ఇంతరాత్రి వేళ… అదీ ఓ అందమైన అమ్మాయి… కొంపదీసి ఆత్మహత్యా ప్రయత్నం కాదుకదా… ఆ ఆలోచన రాగానే అతనికి ఆమెను కాపాడాలనిపించింది. దానిక్కారణం అతనిలో ఉన్న మానవతా దృక్పధం కాదు, ఆ అమ్మాయి శరీరం తనకు పనికి వస్తుందేమోనన్న ఆశ. అతని బుర్ర చురుగ్గా పనిచేస్తోంది. ఆ అమ్మాయి ఓ కాలుని రెయిలింగ్ కి అటువైపు వేయబోతోంది. అప్పుడే వేగంగా రియాక్టయ్యాడు అనుదీప్. ఆ అమ్మాయివైపు పరుగెత్తాడు. ఆమె రెండో కాలు రెయిలింగ్ కు అటువైపు పడక ముందే, ఆమె భుజాలు పట్టుకున్నాడు. ఆమె మెత్తటి నునుపైన భుజాలు అతని చేతుల్లో నలిగిపోతున్నాయి.

ఆమె ఆ హఠాత్ పరిణామంతో బిత్తరపోయింది. కోపంగా అతని వైపు చూసింది అతనది ఏమాత్రం పట్టించుకోకుండా ఆమెను పక్కకి లాగాడు.

“ఏయ్ మిస్టర్… ఏంటిది?” కోపంగా అడిగింది.

“నేనడగాల్సిన ప్రశ్న మీరడుగుతున్నారు. ఆత్మహత్య చేసుకోవడం మహాపాపం తెలుసా…?

“తెలుసు…అయినా మీకా విషయం తెలిసి ఎందుకు ఆత్మహత్య చేసుకోవడానికి ఇక్కడికి వచ్చారు?” తాపీగా అడిగింది.

అతను తెల్లబోయి… “నేనా… నేను ఆత్మహత్య చేసుకోవడమేమిటి? నాకా ఖర్మ పట్టలేదు…” కోపంగా అన్నాడు.

Updated: January 26, 2023 — 1:32 pm