బేర్ డెవిల్ 70

తను కొత్తగా ప్రారంభించబోయే బిజినెస్కు ముడి సరుకుగా ఓ అమ్మాయి కావాలి… కొన్ని సందర్భాల్లో తను బ్రోకర్గా కూడ మారక తప్పదు. కాంట్రాక్టులు… మంత్రులను ఖుషీ చేయడాలు… అధికారులకు అమ్మాయిల నజరానాలు సమర్పించడాలూ….

అతనికో కొత్త ఆలోచన వచ్చింది.

విరాళిని రంగంలోకి దింపేడు. ‘నా బిజినెస్ ను నువ్వే ప్రమోట్ చేయగలవు’ అన్నాడు. నీకేం కావాలన్నా ఇస్తానన్నాడు. ఆమె తెలివైంది. అందులోనూ పరిస్థితులను తనకు అనుకూలంగా మరల్చుకోగల నేర్పు కలది.

‘సరే’నంది. ఆమె గమనం మారింది. శరీర వ్యాపారమే ఆమె గమ్యమైంది.

అతను ఆమెను అన్ని రకాలుగా వాడుకుంటున్నాడు. అందుకు అతను గిల్టీగా ఫీలవ్వడంలేదు. తన తెలివితేటలకు మురిసిపోతున్నాడు.

అతనిలో కొత్త ఆలోచనలు.

తన బిజినెస్ పెరిగిపోతుంది. దానిక్కారణం బిజినెస్ లో వున్న సిన్సియార్టీ, ప్రోడక్ట్ లో వున్న క్వాలిటీ కాదు. అంతకన్నా అధికారులను బుట్టలో వేసుకునే విధానం, విరాళిని ‘చెక్’గా పెట్టి, మంత్రులతో తను ఆడుకునే వ్యాపార చదరంగపు మేళకువలే.

***

ఇప్పుడతనిలో కొత్త ఆలోచన. రాజకీయాలలోకి వెళ్ళాలనుకున్నాడు.

డబ్బు వెదజల్లి పబ్లిసిటీ, విరాళిని ఎరగా పెట్టి పార్టీ టికెట్ సంపాదించాడు.

సరిగ్గా అప్పుడే, తనూ ఓ పావు కదిపింది విరాళి. తనకి పదికోట్లు కావాలని అడిగింది.

లేదంటే, తన ఆఫర్ని కాదంటే, తను అనుదీప్ తో నగ్నంగా వున్న ఫోటోలు, తనెవరెవరి దగ్గర అనుదీప్ కోసం, పడక సుఖాన్ని అందించిందో, వాళ్ళ చరిత్రలూ… పత్రికలకిచ్చి, అతని పొలిటికల్ కెరీర్ స్మాష్ చేస్తానంది. అతని అపోజిషన్ శిబిరంలో పేయింగ్ గెస్ట్ గా చేరతానంది.

అతను బిత్తరపోయేడు. బిగుసుకు పోయాడు. బిక్కచచ్చి పోయాడు. తెలివి తనసొత్తే అనుకున్నాడు.

***

“యూ… చీట్… బట్టలు విప్పి… ఈ రాత్రి ఇంత సుఖాన్ని అందించి, ఇలా బ్లాక్ మెయిల్ చేస్తావా? డేర్ డెవిల్…” కోపంగా మరోసారి అన్నాడు.

“చెప్పాగా…బేర్ డెవిల్ ని అని కూడా… ఆడదాని బట్టలు విప్పి, సుఖాన్ని అందించి, ఓ గుడ్డముక్క అందిస్తే తృప్తి పడుతుందనుకున్నావా? నన్ను అడ్డంగా పెట్టి, నువ్వు కోట్లు సంపాదించేవు. మరి నిన్ను అడ్డంగా పెట్టి నేను సంపాదించుకోవద్దూ… నా అందం తరిగాక, నన్ను నువ్వు తరిమివేస్తావన్న విషయం నాకూ తెలుసు. ఈ బేర్ అండ్ డెవిల్తో పెట్టుకోకు, సాయంత్రంలోగా క్యాష్.. అక్షరాల పదికోట్లు అందాలి. లేకపోతే… మన బేరీబాడీ ఫొటోలు… గోడలమీద వుంటాయి. పోస్టర్లుగా… మైండిట్.., ఆమె లేచి బట్టలు కట్టుకొని బయటకు నడిచింది.

ఇప్పుడతనికి ఒక్కటే మార్గం. ఆ బేర్ డెవిల్తో రాజీకి రావడం. అయినా ఇద్దరు అవకాశవాదుల మధ్య నైతికా నైతికాలెలా బట్టకట్టి బతుకుతాయి..?

ప్రశ్నలు లేని జవాబులు

“రేపు ఒక కాన్పరెన్స్ కోసం హైదరాబాద్ వస్తున్నాను. కుదిరితే డిన్నర్ కి కలవగలవా?”

ఎన్నిసార్లు ఆ మెసెజ్ చూసుకున్నావో లెక్కేలేదు. అందులో ఒక్కొక్క అక్షరం నీలో ఎన్నో జ్ఞాపకాలను కదిలిస్తోంది. అక్కడికి రమణిని మర్చిపోయావని కాదు. గుర్తుకువచ్చేది. నువ్వు రమణిని వద్దనుకున్న కొత్తల్లో చాలా తరచుగా గుర్తుకువచ్చేది. కానీ నీ చదువులు, ఉద్యోగం, పెళ్ళీ వీటన్నింటి మధ్యలో రమణి జ్ఞాపకం ఎక్కడో తప్పిపోయింది. నువ్వు వూరు వెళ్ళినప్పుడో, రమణితో కలిసి చూసిన పాత సినిమాలు టీవీలో చూసినప్పుడో, ఏదో ఒక అర్థరాత్రి కలలో ఆమె కనిపించినప్పుడో ఒక్కసారిగా అన్నీ గుర్తొచ్చి నిన్ను అతలాకుతలం చేసేవి.

చిన్నప్పుడు గుడి ముందర ఆడిన ఆటలు – దాగుడు మూతలు దండాకోర్ – పిల్లి వచ్చె ఎలకా భద్రం – ఎక్కడి దొంగలు అక్కడనే గప్ చుప్ సాంబార్ బుడ్డి..

Updated: January 26, 2023 — 1:32 pm