బేర్ డెవిల్ 70

“నా యింటలిజెన్సీ ఇప్పుడే ఏం చూశారు?”

అనుకుందామె మనసులో.

“మిమ్మల్ని ఎక్కడైనా డ్రాప్ చేయాలా?” అడిగాడామె ఎర్రటి చెర్రీపళ్ళలాంటి పెదవుల్ని కొరుక్కుతినేలా చూస్తూ.

“మిడిల్ డ్రాప్ అవ్వరుగా…” ఆమె తెలివిగా అంది. ఆమె రిటార్డ్లకు అతని గూబ అదిరిపోతోంది.

***

“ఏంటి… ఫస్ట్ పరిచయంలోనే నా బాధలన్నీ ఏకరువు పెట్టి, నా తెలివి తేటలన్ని మీ మీద ప్రయోగించానని అనుకుంటున్నారా?” కారులో అతని పక్కనే కూచొని, అతని తొడమీద చేయివేసి అంది.

అతని శరీరంలో చిన్నషాక్… ప్లగ్లో వేలు పెట్టినట్టు.

“అదేం లేదు… మీకో దారి చూపించాలని ఆలోచిస్తున్నాను…” అతనన్నాడు.

“రియల్లీ… ఓహ్… థ్యాంక్యూ…” అంది అతని బుగ్గమీద ముద్దు పెట్టుకొని.

ఇప్పుడూ షాక్ కొట్టింది. హై ఓల్టేజితో. ఆ తర్వాత అలాంటి షాక్లు అలవాటయి పోయాయి అతనికి.

***

ఆమె ఫ్రెండింట్లో నుంచి అనుదీప్ గెస్ట్ హౌస్ లోకి షిఫ్ట్ అయ్యింది. జీవితంలో మోరల్ వేల్యూస్ గురించి ఆమె పట్టించుకోలేదు. తనకో మోరల్ సపోర్ట్ కావాలి…. అదీ ఫైనాన్షియల్గా వెల్ బ్యాగ్రౌండ్ ఉన్న వాళ్ళయితేనే… అనుదీప్ గెస్ట్ హౌస్ ఆమె స్వంతమైంది. అనుదీప్ తెలివైనవాడు. అందులోనూ ఉమనైజర్. ఆమె అందాలు ఎలా ఉపయోగించుకోవాలో తెలుసు.

ఆమెను తన గెస్ట్ హౌస్లోకి తెస్తూనే… ఆ రోజంతా అతను ఆమెతో యుద్ధానికి సిద్ధమయ్యాడు.

గెస్ట్ హౌస్ లో పనిచేసే వాళ్లందరికీ సెలవిచ్చేసాడు ఆ రాత్రికి.

***

ఆ రాత్రి గెస్ట్ హౌస్లో ఉన్న ఎ.సి. బెడ్రూంలో అతను సర్వ సుఖాలు, స్వర్గసుఖాలూ చవిచూసాడు. ఆమె అందించే ప్రతీ అనుభవం అతనికి కొత్తగానే ఉంది.

అసలామెలో ఇన్ని టాలెంట్లు వున్నాయా? అన్న ఆశ్చర్యం కలగకపోలేదు.

వాత్సాయనుడు ఆమె చూపించే థ్రిల్లింగ్ ఎమోషన్స్ చూస్తే, తానెలా మిస్సయ్యానా? అని బెంగపడేవాడేమో!

ఆ రాత్రంతా అతణ్ణి నిద్ర పోనివ్వలేదు. ఆమె నిద్రపోలేదు. తన శరీర వీణను ఎలా మీటాలో ఆమె చెప్పింది. అతను కొద్ది క్షణాలు సిగ్గుతో బిక్కచచ్చిపోయేడు. ఆమె ముందు అతనికి తీయని శృంగార ఓటమి ఎదురైంది.

ఆరోజే కాదు, ప్రతీరోజు ఆమెతో అతను స్వర్గసుఖాలు అనుభవిస్తూనే వున్నాడు.

ప్రతి మనిషిని ఎలా ఉపయోగించుకోవాలో తెలిసిన అతనికి, ఆమెను ఎలా ఉపయోగించుకోవాలో తెలిసొచ్చింది.

Updated: January 26, 2023 — 1:32 pm