రమణ : అదే చెప్పాలి అని వచ్చాను నీకు ఒక విషయం చెప్పాలి
విజయ : అవునా ఏంటి అది
రమణ : అదే ఎలా చెప్పాలో తెలియడం లేదు
విజయ : పర్లేదు చెప్పు
రమణ : నేను ఈ రోజు రాత్రి ఢిల్లీ వెళుతున్నా
విజయ : అవునా ఎందుకు
రమణ : నేను R&aw లో recruit అయ్యాను రెండు రోజుల్లో నా అపాయింట్మెంట్
విజయ : అంతే కదా ఇప్పుడు నీకు ఉద్యోగం ఉంది అంటే అది కూడా గవర్నమెంట్ ఉద్యోగం అంటే అమ్మ నీ చాలా తేలిక గా ఒప్పించోచ్చు
రమణ : అది కాదు ఇది చాలా ప్రమాద కరమైన ఉద్యోగం R&aw (ఇప్పుడు RAW నీ ఒకప్పుడు అలా పిలిచే వారు) అంటే మిలిటరీ లో ఒక రహస్య ఉద్యోగం వెయ్యి లో ఒక పది మంది నీ సెలెక్ట్ చేస్తారు నేను అందులో ఒకరిని నను పాకిస్తాన్ లో ఒక సీక్రెట్ మిషన్ మీద పంపే అవకాశం ఉంది అందుకే నేను తిరిగి వస్తానో లేదో కూడా తెలియని పరిస్థితి కాబట్టి నిన్ను చివరి సారిగా చూసి నా ప్రేమ విషయం చెప్పాలి అని వచ్చాను
అది విన్న వెంటనే విజయ కళ్లలో నుంచి నీళ్లు సూడులు గా తిరిగాయి “అంటే నా మీద ప్రేమ గురించి చెప్పడానికి కాదు నను నీ ప్రేమ నడి రేయి లో ఒంటరిగా వదిలి వెళ్లుతున్నా అని చెప్పడానికి వచ్చావు అంతే కదా నీతో ఒక జీవితం మొత్తం ఊహించుకున్నాక నను ఊహాలోకం నుంచి బయటకు వచ్చి నిజాని చూడమంటున్నావూ అంతే గా సరే అలాగే వెళ్లే ముందు నీకు నేను ఎప్పటి నుంచో చెప్పాలి అనుకుంటున్న మాట ఇప్పుడు నీకు చెప్తున్నా I Love you ” అని చెప్పి రమణ పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్లి పోయింది తను బయటికి రాగానే బస్ వచ్చి ఆగింది తను సరిగా చూస్తే తన కార్ పార్కింగ్ లో ఆగింది అప్పుడు విజయ హోటల్ లోకి వెళ్లింది.
సిద్ధు సైబర్ క్రైమ్ బ్రాంచ్ కీ వెళ్లి నిన్న ఉదయం తన ఫోన్ సిగ్నల్ పక్కన ఉన్న ఇంకో నెంబర్ గురించి సిగ్నల్ టవర్ నుంచి హాకింగ్ చేసి కనిపెట్టడం మొదలు పెట్టాడు అప్పుడు తను స్టేషన్ నుంచి బయటికి వచ్చిన తరువాత ఉన్న ఇంకో రెండు నెంబర్ లు దొరికాయి దాని చూసి వాటి డిటైల్స్ తీస్తే ఒకటి ఆటో డ్రైవర్ నెంబర్ ఇంకొకటి రమణ మూర్తి అనే వ్యక్తి ది ఇప్పుడు ఆ నెంబర్ ఎక్కడ ఉందో ట్రేస్ చేయడం మొదలు పెట్టారు ఆ నెంబర్ హోటల్ లొకేషన్ చూపిస్తూ ఉంది అదే హోటల్ కీ విజయ కూడా వెళ్లింది.
విజయ హోటల్ లోకి వెళ్లి రమణ కోసం వెతుకుతూ ఉంది అప్పుడు ఒకతనూ లేచి నిలబడి విజయ వైపు చూస్తూ ఉన్నాడు తనని చూడగానే విజయ మొహం వెయ్యి దీపాల కాంతి తో వెలిగి పోయింది తన ముందు వెళ్లి కూర్చుంది రమణ మాత్రం ఇన్ని రోజుల తరువాత చూసిన కూడా విజయ తన యవనం లో ఉన్నటే ఆ రూపం కళ్ల ముందు మెదిలింది, అప్పుడే సుమా కూడా వచ్చి “మామయ్య ఇంటికి వెళ్లాదామా” అని అడిగింది రమణ నీ తన ఎదురుగా ఉన్న విజయ నీ చూసిన సుమా “హమ్మయ్య మేడమ్ మొత్తానికి వచ్చారా మీరు వస్తారో లేదో తెలియక ఇంక మామయ్య నీ ఇంటికి తీసుకొని వెళ్లదాం అనుకున్న అయినా లెటర్ రాసి అడ్రస్ రాసి టైమ్ రాసి మీరే లేట్ వస్తే ఎలా మేడమ్” అనింది సుమా దాంతో విజయ షాక్ అయ్యి చూసింది “అది ఏంటి రమణ కదా లెటర్ రాసింది ఇక్కడికి రమ్మని చెప్పింది తనే కదా “అని ఏమీ అర్థం కాక రమణ సుమా వైపు చూస్తూ ఉంది విజయ ఈ లోగా సిద్ధు రమణ ఫోన్ సిగ్నల్ నీ ట్రాక్ చేసి హోటల్ వైపుగా రావడం మొదలు పెట్టాడు ఇది అంతా అక్కడే మూలన కూర్చొని డిన్నర్ చేస్తూన్న ఒక వ్యక్తి వాళ్ల వైపు చూసి
” Let the game begins ” అన్నాడు.
అసలు ఏమీ జరిగిందో జరుగుతూందో అర్థం కాక కూర్చొని ఒకరి మోహలు ఒకరు చూసుకుంటు కూర్చున్నారు విజయ, రమణ, సుమా వాళ్ళని దూరం నుంచి చూస్తున్న వ్యక్తి తన చెవికి ఉన్న Bluetooth తో సిద్ధు కీ ఫోన్ చేసాడు “మీ అక్క విజయ అలియాస్ విజయలక్ష్మి నీ నువ్వు చివరి సారి చూడాలని అనుకుంటున్నావా” అని అన్నాడు, దానికి సిద్ధు ఆవేశం గా “రేయి ఎవడు రా నువ్వు మా అక్క ఎక్కడ ఉంది ఎమ్ చేశావు మా అక్క నీ” అన్నాడు “ప్రస్తుతం బాగానే ఉంది కానీ మరో పది నిమిషాల లో చనిపోవచ్చు నీకు కుదిరితే కాపాడుకో” అని ఫోన్ కట్ చేసి స్వీచ్ ఆఫ్ చేసాడు అప్పుడు తన దగ్గరికి వచ్చిన ఒక వెయిటర్ కీ 500 నోటు ఇచ్చి విజయ ఫోన్ నీ స్వీచ్ ఆఫ్ చేసి అక్కడే పెట్టమని చెప్పాడు అప్పుడు సిద్ధు హోటల్ కీ వెళ్లకుండా ఇంటికి వెళ్లాడు విజయ కోసం దారి లో ఫోన్ మీద ఫోన్ చేశాడు విజయ కీ కానీ ప్రయోజనం లేకుండా పోయింది, విజయ ఏమో ఎన్నో ఏళ్లుగా దూరం అయిన తన ప్రేమ తిరిగి తన దగ్గరికి రావడంతో కొంచెం అయోమయం వదిలి ఎలా వస్తే ఏంటి అని రమణ వైపు చూస్తూ
విజయ : సరే అది అంతా వదిలేయి ఇంతకీ ఎలా ఉన్నావూ
రమణ : చూస్తూ ఉన్నావూ గా వయస్సు అయిపోయి ఒక ఆక్సిడేంట్ లో కాలు పోగొట్టుకోని జీవచ్ఛవం లా మిగిలి ఉన్న
విజయ : అయ్యో ఎప్పుడు ఎలా జరిగింది అని బాధ తో కూడిన గొంతు తో అడిగింది
What nonsense stories are posting like detective and most worst stories are posting
Why discontinued
Katha chala bagundi nenu oka story rasanu Ela submit cheyalo cheppandi
Very worst stories are posting
True Sony
Updates pl