హనీమూన్ 153

అప్పుడే నా చేతిలోని ద్రాక్ష గుత్తిని చూసి నవ్వింది ఆమె.

“ఏం నవ్వుతున్నావు” అడిగాను, నేనూ నవ్వుతూ.

“ద్రాక్ష పళ్లును చూసి, మన శోభనం రాత్రి జరిగిన ఘటన గుర్తుకు వస్తేను” చెప్పింది ఆమె.

నేనూ దానిని గుర్తుకు తెచ్చుకొని నవ్వేశాను.

ఆ రోజు – శోభనం రాత్రి, చిలిపి చేష్టల నడుమ, ద్రాక్ష పళ్ల ప్రస్తావన చోటు చేసుకుంది మా మధ్య.

ఆమె వెల్లకిలా పడుకొంటే, ఆమె నగ్న పొట్ట మీద కొంత ఎత్తు నుండి దోసిళ్ల నిండుగా ద్రాక్షపళ్లను తీసి, వాటిని నేను ఒక ఉదుటన విడిచి పెట్టాలి. అలా పడే ద్రాక్షపళ్లలో, ఆమె లోతైన బొడ్డులో పడి, నిలుస్తున్న ద్రాక్ష పళ్లను మాత్రమే నేను నోటితో అందుకొని తినాలి.

“ఏమిటో నాకు ఒక్క పండు కూడా తినే అవకాశం దక్కలేదు” అన్నాను నీరస పడిపోతూ.

“మరే, అప్పటి మీ టెన్షన్ అటువంటిది. ఆత్రం అతి అయితే వచ్చే ఫలితం శూన్యమే మరి” అంది మళ్లీ కవ్వింతగా.

“ఏదైనా, ఫస్టునైట్ టెన్షన్ మాత్రం పటాపంచలైనట్టు నువ్వు మెసలడం మాత్రం మహా దొడ్డదిస్మీ” అన్నాను నేను అప్పుడే గుర్తువచ్చినట్టు.

“మరే, నాలో భావాలు ఉన్నాయి. సిగ్గూ ఉంది. అలాగని మీ తొందరపాటుకు, చేష్టలకు నేను సహకరించుకు పోతోంటే, ఏం జరుగుతోంది? పెళ్లి అయ్యి సంవత్సరం కాక మునుపే సంతానం – ఇకపై సంసారం … బరువు, బాధ్యతలు. ముచ్చట్లు ఏవి! అందుకే నేనే ముందు పడ్డాను. చెప్పాలను కున్నవి చెప్పేశాను” అంది.

“అవును. నిజమే. తొందర సంతానం, ఎక్కువ సంతానం మూలంగా ఏమి జరుగుతుందో అవగతం అయ్యింది, నువ్వు విడమర్చి చెప్పాక” అన్నాను.

“కాదా, అందుకే మనకు మూడేళ్ల వరకు సంతానం వద్దన్నది. ఆ తర్వాతైనా, ఒకే ఒక బిడ్డ చాలన్నది. అంత వరకు మనం శారీరక సుఖానికి దూరం కానవసరం కూడా లేదు. అందుకు నేడు ఎన్నో ఎన్నెన్నో ఆధునిక పద్ధతులున్నాయి. వాటిని కాస్త జాగ్రత్తగా ఆచరిస్తే చాలు. మనం ఇప్పుడు అలా చెయ్యడం లేదా … మనం చక్కని అనుభూతులు పొందడం లేదా” అంది ఆమె.

ఆమె మాటల్లో శోభనం రాత్రినాటి బింకమే ధ్వనించింది.

నేను “లక్కీ ఫెలోని” అన్నాను ఆగి.

“కాదు. మనం లక్కీ పర్సన్స్ మి. అవగాహన – భావ ప్రకటనలో నీతీ, నిజాయితీలు కొనసాగిస్తే మాత్రం, మనం ఎప్పటికీ లక్కీ పర్సన్స్ మే” అందామె నిబ్బరంగా.

“ష్యూర్ ష్యూర్” అన్నాను నేను ఉత్సాహంగా.

ఆమె తన కుడి చేతి బొటన వేలుతో, చూపుడు వేలుతో నా కింది పెదవిని పట్టి, ముందుకు సాగతీసి, దాని మీద ముద్దు పెట్టి వదిలింది.

నేనా పెదవిని చప్పరించుకున్నాను.

గాలి వడి క్రమంగా హెచ్చింది.

కరెంట్ రాలేదింకా.

నా చేతిలోని ద్రాక్ష పళ్ల గుత్తిని చూస్తూ, “ఇంకా వాటిని పట్టుకొని ఉన్నారా” అంది గుబుక్కున.

నేను నవ్వేశాను.

నా చేతిలోనుంచి ద్రాక్ష పళ్ల గుత్తిని తీసుకుంటూ – “ఈ సారి ఒక్కొక్క ద్రాక్ష పండును నేను చప్పరించి, దానిని మీ నోటికి అందిస్తాను. మీరు దానిని ఎంచక్కా తినవచ్చు” అంది ఆమె.

నేను హుషారు అయ్యాను.