మదిలోని భావాలు 50

ఆ ఇద్దరి పెదాల మధ్య కమలాపండు తొన సున్నితంగా అదమ బడుతోంది. ఆ పెదాలు సుతి మెత్తగా ముందుకు జరుగు తున్నాయి.

ఆ తొన వ్యాకోచనం చెందుతోంది ఆ పెదాల ఒత్తిడికి – ఒక క్షణాన అది ‘టప్’ మని పగిలింది. రసం చిమ్మింది. ఆ చిట్లిన తొన జారి పోతుండగా చటుక్కున తన పై పెదవితో కింద పెదవిని పట్టుకుంది ఆమె – అంతే, ఆ పెదాల మధ్య ఆ తొన సగం పట్టుబడి వ్రేలాడుతోంది, రసం చిందిస్తోంది.

వెంటనే అతడు తన నాలుకను ఆమె చుబుకం కు అతి సమీపాన, కిందన చేర్చాడు. రసం చుక్క, చుక్కగా అతడి నాలుకపై పడుతోంది. పులకించే తనువులతో ఆ ఇద్దరు ఏదో గమ్మత్తైన అనుభూతిని కొద్ది క్షణాలు అనుభవించారు.

ముందుగా ఆమె తేరుకుంది. తన పెదాల మధ్యన ఇమిడి ఉన్న తొనను జార విడిచింది.

ఆ తొన, అతడి నాలుకపై పడింది. అతడు దాన్ని చప్పరించాడు, ఎంతో మృదువుగా. పిమ్మట దాన్ని ఆర్తితో గుటక వేశాడు – “మధురానికి రుచి ఇలా ఉంటుందా” అన్నాడు, తన్మయంగా.

ఆమె ఒళ్లు ఒక్కసారిగా జలదరించింది – “థాంక్స్” అంది ఆమె, పారవశ్యంగా.

ఆమె పేరు సంజు. అతడి పేరు రాహుల్.

“ఇలా మరొకటి” అన్నాడు రాహుల్.

“నో, ప్లీజ్, రాహ్. ఈ తొనలు తీసుకో. ఇంక నేను వెళ్తాను.” అంది సంజు.

“సంజూ” అన్నాడు రాహుల్, మారాంగా.

“డాడీ ఆఫీసు పని మీద క్యాంప్ వెళ్తున్నారు. అమ్మ బ్యాగ్ సర్దుతుంది. నేను నీకు తొనలు ఇవ్వాలని ఇలా వచ్చేశాను.” నవ్వుతూ చెప్పింది సంజు.

ఆ వెంటనే, అక్కడి నుండి వెళ్లిపోయింది.

ఐదారు నిముషాల తర్వాత – ‘ఇంటర్ కమ్’ లో తన మేడ మీద అతిథిగా ఉన్న రాహుల్ ని పిలిచారు, సంజు తండ్రి రాఘవరావు.

రాహుల్ మేడ మీద నించి క్రిందకు వచ్చాడు.

రాఘవరావు ప్రయాణంకు సిద్ధమై ఉన్నారు.

“వెల్, రాహుల్ – హైదరాబాదు వెళ్తున్నాను. సి.యం. గారి నోడల్ ఆఫీసర్స్ మీటింగ్ ఉంది. అందుకు మీ డాడీ కూడా వస్తారు. మేము కలుస్తాం. ఏమైనా చెబుతావా?” అడిగారు రాఘవరావు.

“నథింగ్ అంకుల్” అన్నాడు రాహుల్.

“నీ కంప్యూటర్ వేర్స్ యూనిట్ గురించి…” చిన్నగా నవ్వేరు రాఘవరావు.

“బాగానే నడుస్తోంది.” చెప్పాడు రాహుల్.

“సంజు చదువు నీకు ఉపకరిస్తోందా?” అడిగారు రాఘవరావు, రాహుల్ ని.

“తను కంప్యూటర్స్ లో డిప్లొమోస్ పొంది ఉండడం నాకు ఉపకరిస్తోంది.” చెప్పాడు రాహుల్.

పిమ్మట – “బై” అంటూ రాఘవరావు వెళ్లారు.

మూడు రోజుల తర్వాత –

రాహుల్ కై ‘ఇంటర్ కమ్’ కలిపింది సంజు.

రాహుల్ రిసీవర్ అందుకొని, “హలో” అన్నాడు.

“రాహ్, టైమెంతమ్మా!” అడిగింది సంజు కింద నించి, ‘ఇంటర్ కమ్’ లో.

“ఈ రోజు ఆదివారం బేబీ” చెప్పాడు రాహుల్.