హనీమూన్ 153

నోట్లో చాక్లెటును గబగబ నమిలి పూర్తిగా మింగేశాను.

ఆమె దుప్పటిలోకి దూరాను. ఆమెను దగ్గరగా లాక్కున్నాను. ఆమె శరీరం ఇంకా నగ్నంగా ఉందని పోల్చుకోగలిగాను. ఆమె నుదుట ముద్దు పెట్టు కున్నాను. ఆమె తలా తడితడిగా ఉంది. కొన్ని క్షణాల తర్వాత ఆమె –

“రాత్రి నేను గదిలోకి వచ్చేస్తూ, మిమ్మల్ని కుదిపాను. మీరు లేవలేదు” అంటూ –

“తెల్లవారిపోయిందా” అని అడిగింది.

“తెల్లవారుతోంది” చెప్పాను.

“మరి, నేను వెళ్తాను. మా వాళ్లు లేచి ఉంటారు. ఎనిమిది గంటలకు రైలు కదా. మళ్లీ ఆషాఢం తర్వాతే కలిసేది” అంది నా మీదకు మరింతగా ప్రాకిపోతూ.

“అందుకే ఆషాఢంలో నువ్వు అక్కడ, నేను ఇక్కడ కంటే, హనీమూన్ టూర్ లో చక్కా ఉందాం” అన్నాను.

“వద్దు, కుదరదు అన్నానుగా” అందామె చటుక్కున.

నేను మళ్లీ దిగులుపడ్డాను.

“మన పూర్వీకులు ప్రకటించిన సాంప్రదాయాలు అర్ధవంతమైనవి. వాటి ఆచరణ, అమలు విధానాలు, నేటికి అనుగుణంగా మనం మార్చుకొన్నా, వాటి ఆంతర్యాలను విస్మరించరాదు. అలాగైతేనే వాటి ఫలితాలు మనమూ అనుభవించగలం.” అంది ఆమె.

“ఏముంది. ఆషాఢంలో కొత్త దంపతులు కొన్నాళ్లు విడిగా ఉండండి అన్నది గొప్పా” అన్నాను ఉక్రోషంగా.

“ముమ్మాటికి. ఆ మాసం ఎడబాటుతో, పిమ్మట ఎంతో, ఏదో మధురాతి మధురం పొందవచ్చుననిపిస్తోంది. పొందగలమనిపిస్తోంది” అన్నాదామె.

నేను ఏమీ అనలేదు. తర్వాత ఆమె చటుక్కున లేచి, మంచం దిగింది. చకచకా నైటీని ధరించింది.

వెంటనే నా పెదాలపై గాఢంగా ముద్దు పెట్టుకొని ఆ గది లోనుంచి బైటకు నడిచింది – “ఆషాఢం కాగానే మరు నిముషాల్లోనే, మీరు నా దగ్గరకు వచ్చేయాలి. వస్తూ, మన హనీమూన్ టూర్ కు, మీకు నచ్చిన ప్రదేశాన్ని ఎంపిక చేసుకొని, అక్కడకు మనకు టిక్కెట్లు రిజర్వేషన్ చేయించుకొని, వాటిని పట్టు కొని రండి.” అని చెప్పేసి.

ఒక్కసారి గట్టిగా తల విదిలించుకున్నాను.

క్రమంగా నా మనస్సు, శరీరం ఆర్తితో పులకరిస్తున్నాయి, పరవశిస్తున్నాయి, పరితపిస్తున్నాయి – ఆ రాబోవు మా ‘హనీమూన్’కై.
*********