జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 24 63

పింక్ రంగు లెహంగా వేసుకొని ఒక వైపు ఓరిగి తుడుచుకొంటుండటం వల్ల మరొక వైపు వయ్యారంగా నడుము అందంగా కనిపిస్తూ తుడుచుకొంటూ కదులుతుండటం వలన మూసుకుపోతూ మళ్ళీ కనిపిస్తుండగా , కళ్ళు ఆశగా అక్కడే చూస్తూ మెల్లిగా ముందుకు వెళ్లి వేళ్ళతో సున్నితంగా రాస్తూ వెనకనుండి తలపై ముద్దు పెట్టగా , నా స్పర్శకే గుర్తుపట్టేస్తూ “బా…వా….” అంటూ టవల్ ను జారవిడిచి వెనక్కు వాలిపోగా ,

నా రెండు చేతులను మహి చుట్టూ వేసి “మహి” అంటూ ప్రేమగా పిలిస్తూ తలపై ముద్దులు పెట్టగా ,అమాంతం బావ అంటూ నా వైపుకు తిరుగుతూ అపద్ద0 చెప్పినందుకు కళ్ళల్లో కన్నీళ్ళతో నా ఛాతిపై సున్నితంగా కొడుతూ వెంటనే సంతోషంతో గట్టిగా కౌగిలించుకొని కొట్టిన దగ్గర ప్రేమగా ముద్దులు పెడుతూ ఇంకా గట్టిగా హత్తుకుపోగా , “నా మహి ముఖం లో చిలిపితనం తో పాటు ఇంత ప్రేమ చూడాలనే అపద్ద0 చెప్పి నేనే నీ ముందరికి వచ్చి సర్ప్రైస్ ఇచ్చాను” అని చెబుతూ గట్టిగా కౌగిలించుకుంటూ వీపుపై నిమురుతూ నుదుటిపై ప్రేమగా ఘాడమైన ముద్దులు వదలకుండా పెడుతుండగా ,

“Sorry బావ” అంటూ మళ్ళీ కన్నీరు కార్చగా తుడుస్తూ తల వెనుక చెయ్యి వేసి ప్రేమగా నిమురుతూ ముద్దులు పెడుతూ గుండెలపై కౌగిలించుకొని, “నా మహి నాపై ప్రేమ చూపించాలి , కోపం చూపించాలి , తప్పు చేస్తే కొట్టాలి , తిట్టాలి …” అంటూ ఆగకుండా చెబుతుండగా “పో బావ” అంటూ ముసి ముసి నవ్వులు నవ్వగా , హృదయం పులకించిపోతుండగా ఇంకా ఇంకా గట్టిగా కౌగిలించుకుంటూ , “ఇలా నా మహి ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి” అంటూ ఎంతసేపు అలా ఉండిపోయామో మాకే తెలియకుండా కదలకుండా ప్రేమగా ముద్దులు పెడుతూ వీపుపై నిమురుతూ ఉండిపోయాను.

కింద వంట గదిలోకి అమ్మ, ఇందుఅమ్మను పిలుచుకొని వెళ్లగా చప్పుడికి వెనక్కు తిరిగి “వదినా ఎప్పుడు వచ్చారు , ఎలా ఉన్నారు” అంటూ సంతోషంతో ఆశ్చర్యపోతూ ఆత్రంగా చేతులు కడుక్కొని టవల్ తో తుడుచుకుంటూ ఆప్యాయంగా కౌగిలించుకొని , ఇందుఅమ్మను ఎక్కడో చూసిన దానిలా చూస్తూ ఉండిపోగా, అమ్మ, అత్తయ్యతో “ఎవరో చెప్పుకో చూద్దాము” అని అడుగగా , “వదినా చాలా దగ్గరి బంధువులా అనిపిస్తున్నారు. ఎవరు వెంటనే చెప్పండి” అని ఆతృతగా అడుగగా ,

“నీవు పాలిచ్చి ప్రాణం పోసిన నీ బుజ్జికి జన్మనిచ్చిన తల్లి” అని చెప్పగా అత్తయ్య కళ్ళల్లో ఆనందం , ఆశ్చర్యం తొణికిసలాడుతూ షాక్ కొట్టినట్లుగా కదలకుండా ఉండిపోగా , అమ్మ, అత్తయ్య భుజం పై చెయ్యి వేసి కదుపుతూ గట్టిగా పిలువగా లోకంలోకి వస్తూ “వదినా నిజమా” అంటూ అడుగుతూ , అమ్మ మాట్లాడేంతలో “నిజమే అయ్యి ఉంటుంది. అందుకే నాకు చాలా చాలా ఆత్మీయురాలిలా చూడగానే నా బుజ్జే కనిపించాడు” అంటూ ఇందుఅమ్మను ఎలా పిలువాలో తెలియక అమ్మ వైపు చూడగా , “చెల్లి పేరు ఇందు. ప్రాణంగా చూసుకోవాలి” అని చెప్పగా ,

“వదినా మీరు మరీ చెప్పాలా” అంటూ ఇందుఅమ్మ చేతులు అందుకోబోయేందుకు సంసయిస్తుండగా , ఇందుఅమ్మ, అత్తయ్య చేతులు రెండు చేతులతో పట్టుకొని కన్నీరు కారుస్తూ , “ఒక తల్లి కంటే ఎక్కువ ప్రేమగా చూసుకొని ఇంత వాణ్ణి చేసినందుకు నా జీవితాంతం మిమ్మల్ని సేవించుకుంటాను” అని ఉద్వేగంతో చెప్పగా , “బుజ్జిని మాకు అందించినందుకు మేమే జీవితాంతం మీ రుణం తీర్చుకోలేము” అంటూ అత్తయ్య మరింత భావోద్వేగంతో చెప్పగా , ఇందుఅమ్మ అత్తయ్య ఒడిలో వాలిపోగా , అత్తయ్య సంతోషంతో మురిసిపోతూ “చివరికి ఆ భగవంతుడు అందరూ సంతోషంగా కలిసేలా చేసాడు” అని చెబుతుండగా , “అవును చెల్లి” అంటూ అమ్మ కూడా ఇద్దరిని కౌగిలించుకోగా ,

వంట గది మొత్తం సంతోషమనే భావోద్వేగంతో నిండిపోగా అత్తయ్య “ఈ ఆనందంలో నాకు చేతులు కాళ్ళు ఆడటం లేదు , మిమ్మల్ని ఇంకా నిలబెట్టే ఉంచాను రండి వదిన , ఇందు” అంటూ చేతులు అందుకొని హాల్ లోకి వస్తూ సోఫాలో కూర్చోబెడుతూ ఇందుఅమ్మ పక్కనే కూర్చుంటూ ఆపకుండా చాలాసేపు మాట్లాడుతూ , మాట్లాడిస్తూ ఇందుఅమ్మ కంగారు అంతా పొగుడుతూ చాలా దగ్గర అయిపోతూ , చిన్నప్పుడు అమ్మకు తెలియకుండా నేను చేసిన చిలిపి పనులు సంతోషంగా చెబుతూ హాల్ మొత్తం మా నవ్వులతో నిండిపోగా , ఇందుఅమ్మ గోవా లో ఉంటూ ఎంత బాధను అనుభవించిందో అమ్మ అత్త య్యకు వివారిస్తుండగా,