హాల్ లో మొబైల్ మ్రోగుతున్న శబ్దానికి మెలకువ రాగా లేస్తూ హాయిగా ఒకరి చెంపపై మరొకరు చేతులు వేసి హాయిగా నిద్రపోతున్న అమ్మలిద్దరిని చూస్తూ లవ్ యు అమ్మ అంటూ నుదుటిపై ప్రేమగా చెరొక ముద్దు పెడుతూ బెడ్రూం బయటకు వచ్చి తలుపు వేసి మొబైల్ అందుకొని చూడగా ఉదయం 6 గంటలు అవుతుండగా మళ్ళీ రింగ్ అవ్వగా కాల్ ఎత్తగా , సర్ మేము లగేజీ ట్రాన్స్పోర్ట్ సర్ మీరిచ్చిన అడ్రస్ బయట వెహికల్ తో రెడీగా ఉన్నాము అని చెప్పగా ,
ఒక్క నిమిషం అంటూ తలుపు తెరువగా కంటైనర్ లారీ బయట పార్క్ చేయబడి కొంత మంది వేచి చూస్తుండగా గేట్ తెరిచి దగ్గరికి వెళ్లగా ఒక వ్యక్తి నా దగ్గరికి వస్తూ లాప్టాప్ తెరిచి పేరు , మొబైల్ నెంబర్ , డెస్టినేషన్ అడ్రస్ మరియు అక్కడ రిసీవ్ చేసుకునే వారి పేరు , మొబైల్ నెంబర్ టైప్ చేస్తూ లగేజీ చూశాక బిల్ వేస్తాము సర్ అని చెప్పగా , సరే అంటూ వారిని లోపలికి పిలుచుకొని వెళుతూ ముందుగా మాల్ నుండి వచ్చిన బాక్స్ లను చూడగా కొద్దిగా తెరిచి ఉండగా ప్యాక్ చేస్తూ వాటిని , అమ్మకు కావాల్సిన వస్తువులను , ప్రేమగా పెంచుకున్న కాంపౌండ్ లోని పూల కుండీలను ఒక్కొక్కటే కంటైనర్ లోకి పెడుతుండగా ,
బయట ఒక పక్క కొంతమంది ఎవరి కోసమో ఎదురు చూస్తూ ఉండగా దగ్గరికి వెళ్లి చూడగా , ఆశ్రమం పెద్దలని గుర్తుపెడుతూ గౌరవంగా పలకరించగా , మేడం వేరే ఊరు వెళ్లిపోతున్నారని పేపర్ లో చదివి మూడు రోజుల నుండి వస్తున్నాము బాబు ఇంటికి తాళం వేసి ఉండటంతో నిరాశతో వెనుదిరిగాము , ఇవాళ ఎలాగైనా కలవాలని తెల్లవారుఘాము నుండి ఎదురు చూస్తున్నాము అని చెప్పగా , క్షమించండి పెద్దయ్య రెండు రోజులు మేడం ముంబై వెళ్లినందువల్ల అలా జరిగింది ఈ రోజే ప్రయాణం, లోపలికి రండి అని ఆహ్వానించగా ఇద్దరు మాత్రమే వస్తూ మిగతావారు కారులో ఆత్రంగా వెళ్లిపోగా , లోపలికి పిలుచుకొనివెళ్లి కాంపౌండ్ లో కుర్చీలు వేసి కూర్చోబెడుతూ , మేడం ఇంకా నిద్రపోతున్నారు పిలుచుకువస్తాను అని చెప్పగా , ఆపుతూ ఆ దేవత కోసం ఎంతసేపయినా వేచి చూస్తాము మావల్ల మేడం డిస్టర్బ్ కాకూడదు అని చెబుతూ కూర్చోగా ,
పాల ప్యాకెట్లను అందుకొని అందరికీ టీ చేసుకొని అందిస్తూ ఇంటికి కావలసిన నిత్యావసర వస్తువులు తప్ప మిగతా వాటినన్నింటినీ చప్పుడు చెయ్యనీయకుండా ఎత్తిస్తుండగా , ఇందు అమ్మ ఫ్రెండ్ రాగా పలకరిస్తూ లోపలికి పిలుచుకొని వెళ్లి అమ్మ దగ్గర విడుస్తూ తలుపు వేసి బయటకు రాగా ,, విక్రమ్ సర్ , అక్కయ్య మరియు పిల్లలతో పాటు రాగా అక్కయ్య లోపలికి వెళ్లగా పిల్లలను సంతోషంగా చెరొకవైపున ఎత్తుకుంటూ లోపలికి పిలుచుకొని వెళ్లి ఓపెన్ చెయ్యకుండా ఉంచిన పెద్ద కుప్పలాగా ఉన్న గిఫ్ట్స్ ను చూపిస్తూ మీకు ఎన్ని కావాలో అన్ని తీసుకొమ్మని చెప్పగా థాంక్స్ మామయ్య అంటూ సెలెక్ట్ చేసుకుంటుండగా సర్ ను చూస్తూ అందరూ భయపడుతూ వినయంగా నమస్కరిస్తుండగా , కొద్దిసేపట్లో బెడ్ రూమ్ లో ఉన్న వస్తువులు తప్ప అన్ని ఎక్కించగా , కొద్దిసేపు వారిని వేచి చూడమని చెబుతూ ,
15 నిమిషాలలో స్నానం చేసి బట్టలు వేసుకొని రెడి అయ్యి రాగా తలా రెండు గిఫ్ట్స్ మాత్రమే తీసుకొని సర్ తో పాటు సోఫాలో కూర్చుని ఉండగా , చాలా అని అడుగగా , చాలు మామయ్య అనగా వాటిని తీసుకువెళ్లి సర్ జీప్ లో పెట్టిస్తూ , సర్ తో మాట్లాడుతుండగా , నేను మొదటగా గోవా కు వేసుకొని వచ్చిన నా కారు వస్తూ సాగర్ తో పాటు వాళ్ళ నాన్న గారు కూడా రాగా గౌరవంగా పలకరించి ఆహ్వానించగా నన్ను మనసారా కౌగిలించుకుంటూ మహేష్ నువ్వు వెళ్లిపోతున్నందుకు నాకు చాలా బాధగా ఉంది కాని నువ్వు ఎప్పుడు గోవా వచ్చినా కచ్చితంగా ఇంటికి రావాలి అని పీలుస్తూ ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండమని ఆశీర్వధిస్తుండగా కారులో నుండి స్వాతి దిగగా , రాత్రంతా నిద్రలేనట్లు కళ్ళు మొత్తం ఎర్రగా అయ్యి ఉండగా ప్రేమగా చూస్తుండగా , మేము వస్తున్నామని తెలుసుకొని నేను వస్తాను అని అడుగగా కాలేజ్ కు వెళ్లి పిలుచుకొనివచ్చాము అని సాగర్ చెప్పగా , కళ్ళతోనే ప్రేమగా పలకరిస్తుండగా, వరుసపెట్టి వాహనాలు ఉదయం వెళ్లిన వాహనంతో పాటు ఒకటి తరువాత ఒకటి వచ్చి నిలబడుతూ , వాటిలో నుండి ఆశ్రమం పిల్లలు ఒక్కొక్కరుగా దిగుతూ క్రమశిక్షణతో అప్పుడే పడుతున్న ఎండలో నిశ్శబ్దన్గా నిలబడగా , కూర్చున్న పెద్దలు నా దగ్గరికి వచ్చి పిల్లలు వార్త చదివి కలవాలని కోరగా వారిని కూడా పిలుచుకొని రావడం జరిగింది అని చెప్పగా ,
పిల్లలు నిలబడడానికి ప్లేస్ సరిపోకపోవడంతో కాంపౌండ్ లోపలికి కూడా రమ్మనగా మొత్తం రోడ్ వరకు పిల్లలతో నిండిపోగా ప్రతి పిల్లవాడి ముఖం లో అమ్మను చూడాలన్న ఆశ కనిపిస్తుండగా , అమ్మ కోసం స్వయంగా పిల్లలు రావడం చూస్తూ జీవితంలో ఇంతకన్నా గొప్పతనం ఏముంటుంది అనుకొని హృదయం సంబరపడిపోతూ ఆనందం పట్టలేకపోతుండటంతో చిరునవ్వులు చిందిస్తూ, పెద్దయ్య పిల్లలు ఏమైనా తిన్నారా అని అడుగగా , బాబు మేడం ను చూసిన తరువాతే తింటామని ఒక్క పిల్లవాడు కూడా తినలేదు అందుకే ఇక్కడికే తీసుకొనివచ్చాము అని చెప్పగా , మంచిపని చేశారు అని అభినందిస్తూ , “స్వాతి” దగ్గరికి వెళ్లి గుంపులో చేతిని అందుకొని ఎవ్వరూ చూడకుండా ప్రేమగా నుదుటిపై ముద్దుపెడుతూ రాత్రి నిద్రపోలేదు కదూ అంటూ బాధగా అడుగుతూ , స్వాతి నువ్వు భాధపడితే నేను అక్కడ సంతోషంగా ఉండలేను ప్లీస్ ఒకసారి నవ్వవా అని అడుగగా , మహేష్ నీ సంతోషమే నా సంతోషం అంటూ చిరునవ్వు నవ్వగా , లవ్ యు అంటూ మరొకసారి అత్యంత ప్రేమతో నుదుటిపై ముద్దుపెడుతూ కళ్ళల్లోకి ప్రేమగా చూస్తుండగా ,
మామయ్య ఎవరు వీళ్లంతా అని అడుగగా , మనలాగా ప్రేమగా చూసుకునే అమ్మ నాన్నలు మరియు ఇల్లు లేని అనాధపిల్లలు , కాబట్టి మనమే వాళ్ళను ప్రేమగా చూసుకోవాలి అని చెప్పగా , ఇద్దరూ ఆలోచిస్తూ కిందకు దిగుతూ జీప్ దగ్గరికి వెళ్లి జీప్ లో పెట్టిన గిఫ్ట్స్ తీసుకుని వస్తూ తమ వయసు ఉన్న నలుగురు పిల్లలకు ఇస్తూ తమ పేర్లు చెబుతూ వారి పేర్లు కనుక్కుంటూ చేతులను కలుపుతూ మనం ఫ్రెండ్స్ అంటూ కౌగిలించుకోగా అది చూసి విక్రమ్ సర్ సంతోషంతో పొంగిపోగా ,