అప్పుడే రెడి అయ్యి అమ్మలిద్దరూ బయటకు వస్తూ పిల్లలందరినీ మరియు విక్రమ్ సర్ పిల్లలు వారికి గిఫ్ట్స్ ఇచ్చేయడం చూస్తూ ఇందుఅమ్మ దగ్గరికి వెళ్లి గుడ్ అంటూ చెరొక ముద్దు పెడుతూ లోపల ఉన్నవి కూడా ఇచ్చేద్దామా ? అని అడుగగా , ఇచ్చేద్దాము అంటూ ఎగిరి గెంతేస్తూ చెప్పగా , అయితే తీసుకువచ్చి ఇచ్చెయ్ అని చెప్పగా వెనక్కు వెళ్లి ఇంతకు ముందే ఫ్రెండ్స్ గా మారిన మిత్రులను లోపలికి పిలుచుకొని వెళుతూ కొన్ని కొన్ని రెండు చేతులతో తీసుకువస్తూ చిన్న పిల్లలందరికీ పంచెయ్యగా , పిల్లలందరి ముఖాల్లో ఆనందం పరిమలించగా మిగితా పెద్ద పిల్లలు చప్పట్లు కొడుతూ వారిని అభినందించసాగారు.ఆశ్రమం పెద్దలు అమ్మ దగ్గరికి వస్తూ మీరు వెళ్లిపోతున్నారని తెలిసి పిల్లలు చాలా బాధపడ్డారు , మీరు జీవితంలో ఇంకెంతో ఎదగాలని తెలుసుకొని సంతోషంగా కలవడానికి వచ్చాము , మీరు ఎక్కడున్నా మా ఆయుష్షు కూడా పోసుకొని సంతోషంగా ఉండాలని మనఃస్ఫూర్తిగా కోరగా , నమస్కరిస్తూ పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి అని చెబుతూ నావైపు చూడగా అర్థమయ్యి లోపలికి వెళ్ళి ఇందుఅమ్మ చెక్ బుక్ తీసుకురాగా ఊహించనంత అమౌంట్ రాసి ఇవ్వగా , తమ రెండు చేతులను జోడించి నమస్కరిస్తుండగా ఆపుతూ ఎలాంటి సహాయం కావాలన్నా ఫోన్ చెయ్యండి అని చెబుతూ ,
పెద్దయ్య పిల్లలు ఏమైనా తిన్నారా అంటూ నా మనసులోని మాటనే అడుగగా , వెహికల్ లో నుండి పెద్ద పెద్ద పాత్రలను ధింపుతూ 15 నిమిషాలలో పిల్లలందరికీ వడ్డించగా , ఇందుఅమ్మ కూడా అందుకొని అమ్మకు , మా అందరికీ ఇస్తూ పిల్లలతోపాటు మధ్యలోకి వెళ్లి అందరమూ తినసాగాము. ఇందుఅమ్మ కాసేపు పిల్లలందరితో సంతోషంగా మాట్లాడి 360 డిగ్రీస్ లో సెల్ఫీ తీసుకొని ఎండ ఎక్కువ అవుతోంది పిల్లలను జాగ్రత్తగా తీసుకువెళ్లండి అని చెప్పగా , పిల్లలందరూ వెహికల్స్ ఎక్కేంతవరకూ బై మేడం , happy జర్నీ మేడం అంటూ అరుస్తూ కేరింతలు కొడుతూ వెళ్లిపోయారు. మిగిలిన అందరి ముఖాల్లో సంతోషం తాండవమాడసాగింది.
పిల్లలంతా పోయాక గాని తెలియలేదు మొత్తం మీడియా ఇక్కడే ఉందని , ఒక్కరి కోసం వందలాది పిల్లలు రావడాన్ని మొత్తం కవర్ చేసుకొని మీరు నిజంగా దేవత మేడం అంటూ వెళ్లిపోగా , పని వాళ్ళు మీకు సహాయం చేస్తున్నందుకు మాకు చాలా సంతోషం అంటుండగా స్వాతి ఒక్క నిమిషం అంటూ లోపలికి వెళ్ళి , అమ్మలిద్దరి కొన్ని జతల బట్టలను బ్యాగులో పెట్టుకొని మిగతావన్నీ బీరువాలలో పెడుతూ లాక్ చేసి బెడ్ రూమ్ లో ఉన్న అమ్మకు ఇష్టమైన వస్తువులన్నీ కంటైనర్ లోకి పంపుతూ 9 గంటలకల్లా కావలసిన వస్తువులన్నీ ఎత్తించగా మొత్తానికి లెక్క వేసి అమౌంట్ చెప్పగా పే చెయ్యగా రేపటి లోపు చేరవేస్తామని చెబుతూ వెళ్లిపోయారు, బయటకు వచ్చి తాళాలు వేసి విక్రమ్ సర్ కు ఉంచామని అందిస్తూ ,
మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా చూసుకున్నందుకు మనఃస్ఫూర్తిగా విక్రమ్ సర్ ను మరియు పిల్లలను కౌగిలించుకొని , సాగర్ కు కారును నా గుర్తుగా ఉంచుకోమని చెబుతూ వారి నాన్న గారి ఆశీర్వాదం తీసుకొని , స్వాతిని కళ్లతో సైగ చేస్తూ రమ్మని అమ్మలిద్దరికీ సాగర్ చెల్లెలు అని పరిచయం చెయ్యగా అమ్మలిద్దరి కాళ్లకు నమస్కరించగా , స్వాతి అంటూ లేపి ఎంత మంచి పిల్ల అంటూ హృదయానికి హత్తుకోగా సంతోషంతో మురిసిపోతూ థాంక్స్ అత్తయ్య అని చిన్నగా అంటూ అమ్మలిద్దరిని ఆప్యాయంగా హత్తుకొని అలాగే ఉండిపోయింది.ఇందుఅమ్మ తన ఫ్రెండ్ ను కౌగిలించుకొని వెళ్ళొస్తామని చెబుతూ కింద ఉంచిన మరొక బ్యాగును నాకు ఇస్తూ కారులో వెనుక ఎక్కగా , బ్యాగును ఇంతకుముందు ఉంచిన బ్యాగుతో పాటు ఉంచి డ్రైవింగ్ సీట్ లో కూర్చోగా , మహేష్ ఒక్క నిమిషం అంటూ జీప్ దగ్గరికి వెళ్లి రకరకాల ఫైన్ వైన్ మరియు విస్కీ బాటిళ్లు ఉన్న పెద్ద బాక్స్ ను వెనుక డోర్ తెరిపించి సీట్ కింద పెడుతూ మీ కోసం గోవా లోనే ఉత్తమమైన ఓల్డేస్ట్ మందు బాటిళ్లను తెప్పించాను , ఇందులో ఒకటి విశ్వ గాడికి నా తరుపున ఇవ్వు అని చెబుతూ మిగతావి నీ ఇష్టం అంటూ ఏదైనా సమస్య అయితే ఈ లెటర్ చూపించమని ఇస్తూ , ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో ఎలాంటి అది ఎంతటి ప్రాబ్లెమ్ వచ్చినా నెనున్నానని మరిచిపోకు అంటూ డోర్ విండో నుండే కౌగిలించుకుంటు సేఫ్ జర్నీ మహేష్ అని చెప్పగా , థాంక్యూ సర్ అంటూ పిల్లలకు టాటా చెబుతూ , స్వాతికి కళ్ళతోనే నవ్వుతూ ప్రేమగా వెళ్ళొస్తామని చెబుతూ ప్రయాణం మొదలెట్టాను.
మొబైల్ కు మెసేజ్ రాగా “లవ్ యు మహేష్ , జాగ్రత్తగా వెల్లు , happy జర్నీ ….నీ ప్రియమైన స్వాతి” అంటూ మెసేజ్ పెట్టగా , “లవ్ యు soooooo మచ్ స్వాతి” అంటూ కిస్ సింబల్ రిప్లై ఇస్తూ , అద్దం లో అమ్మలిద్దరిని చూడగా మాతో పాటు వైజాగ్ వచ్చేస్తున్న ఆనందం ఇందుఅమ్మ ముఖం లో వెలిగిపోతుండగా అమ్మ మోచేతి చుట్టూ రెండు చేతులు వేసి అమ్మ భుజం పై వాలిపోగా , అమ్మ ఇందుఅమ్మ తలపై ముద్దుపెడుతూ కన్నయ్య అమ్మమ్మకు వైజాగ్ వెళ్తున్నట్లు కాల్ చేసావు అని అడుగగా , ఈ హడావిడిలో మరిచిపోయాను అమ్మ అంటూ మొబైల్ తీసుకొని అమ్మమ్మకు కాల్ చేస్తూ స్పీకర్ on చేస్తూ అమ్మమ్మ ఎలా ఉన్నారు అంటూ అమ్మకు ఇవ్వగా నీ మధురమైన స్మృతులతో మళ్ళీ నీ రాక కోసం ఎదురుచూస్తూ ఉన్నాను బంగారు అంటూ బదులివ్వగా ,
అమ్మా అన్న పిలుపుకు అమ్మమ్మ జానకి అని ప్రేమగా బదులివ్వగా ఇందుఅమ్మ చెంపపై నిమురుతూ వైజాగ్ బయలుదేరాము అమ్మా అని చెప్పగా , నాకు ఉన్న ఏకైక దిగులు కూడా ఈ రోజుతో తీరబోతోంది నాకు చాలా చాలా సంతోషంగా ఉంది జానకి అని చెబుతూ అమ్మతోనే మాట్లాడుతుండగా , చెల్లి ఎలా ఉందో అడుగరా అని మాట్లాడగా , నా పెద్ద కూతురు పక్కన ఉండగా అది మహారాణిలా ఉంటుంది నాకు ఏ దిగులు లేదు అని బదులివ్వగా , నీవు ఎలా నేను ఉండాలనుకున్నావో అంతకన్నా సంతోషంగా ఉన్నానమ్మా అంటూ అమ్మను ఆప్యాయంగా హత్తుకోగా కొద్దిసేపు మాట్లాడి పెట్టెయ్యగా ,
ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో నెమ్మదిగా పోనిస్తూ అమ్మ దగ్గర నుండి మొబైల్ అందుకుంటూ కృష్ణ గాడికి కాల్ చెయ్యగా , అరే మామా ఎన్ని రోజులురా ఏమి చేస్తున్నావు అక్కడ , ఇక్కడ అమ్మ ఫోన్ చేశారా లేదా అంటూ నన్ను తిడుతోంది , అంటీ ఎలా ఉన్నారు , నేనే ఫోన్ చేస్తాను అని చెప్పి ఇన్ని రోజులకా చేసేది , ఇక్కడ దివ్యక్క , అమ్మ మీకోసం చాలా దిగులుపడుతున్నారు అని చెప్పగా అంటూ ఏకి పారేస్తూ ఇదిగో అమ్మ మాట్లాడుతుందంట అంటూ అంటీ కి ఇవ్వగా , క్షమించండి అంటీ మీరు ఎలా ఉన్నారు అని అడుగగా , ఆతృతగా మేము బాగానే ఉన్నాము నీవు , అది ఎలా ఉన్నారు అంటూ అమ్మపై కోపాన్ని చూపగా ,