ప్రేమ శక్తివంతమైనది 123

రాజా : మీరు కేరళ నుంచా అని అడిగాడు

రమ్య : అవును నేను సగం మలయాళీ సగం తెలుగు

రాజా : అది ఏంటి

రమ్య : అంటే పెద్ద స్టోరీ

రాజా : పర్లేదు మనకు జర్నీ కీ టైమ్ పాస్ అవుతుంది

రమ్య : సరే మా నాన్న కేరళ నుంచి MBA చేయడానికి అహ్మదాబాద్ వెళ్లారు అక్కడ అమ్మ కూడా చదువుతోంది ఒక ప్రాజెక్ట్ పని మీద ఇద్దరు కలిసి పని చేశారు కానీ ఆ ప్రాజెక్ట్ వల్ల ఇద్దరు ప్రేమలో పడ్డారు అలా అమ్మ తెలుగు నాన్న మలయాళీ ఇంట్లో పెద్దవాళ్లు ఒప్పుకోలేదు ఇద్దరు లేచిపోయి పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత నేను నా చెల్లి పుట్టాక మళ్లీ ఫ్యామిలీ లు కలిశాయి అని తన కుటుంబ చరిత్ర చెప్పింది రమ్య

కానీ తన మాటలు ఏవి రాజా చెవిలోకి వెళ్లడం లేదు తను మాట్లాడుతూ ఉండగా ఎగురుతున్న తన కన్ను బొమ్మలు, పిండితే తేనె కారిపోయేలా ఉన్న తన ఎర్రని పెదవులు, నేరేడు పండు లాంటి పెద్ద కళ్లు ఆ చూపులు తన మనసులో కీ బాణం లాగా దూసుకొని వెళ్లి గాయపరచుతున్నాయి. అప్పుడే రాజా ఫోన్ మొగ్గింది ఈ టైమ్ లో ఎవడు రా అని చిరాకు తో ఫోన్ ఎత్తి “హలో ఎవరూ” అని అడిగాడు “నీ అమ్మకు మొగుడు” అని అవతలి నుండి వచ్చింది ఆ మాట ఎవరూ అని ఫోన్ వైపు చూశాడు వాళ్ల నాన్న దాంతో రాజా కొంచెం బెదిరి

రాజా : హా నాన్న చెప్పు

రామ్మూర్తి : ఏరా ఎప్పుడు ఫోన్ లో ఎవరు చేశారో చూసుకోవా

రాజా : అది కాదు నాన్న రామ్ గాడు ఏదో మెయిల్ అడిగితే దాని గురించి చూస్తూ చూసుకో లేదు

రామ్మూర్తి : సరే బయలుదేరావా

రాజా : హా నాన్న ట్రైన్ లోనే ఉన్న

రామ్మూర్తి : సరే అయితే తిరుపతి దాకా అవసరం లేదు కడప లోనే దిగేయి మీ అమ్మ అందరం కలిసి ఇంటి నుంచే వెళ్ళదాం అంటుంది

దాంతో రాజా గుండె లో బాంబ్ పేలినట్టు అయింది

రాజా : నాన్న అది కాదు రిజర్వేషన్ తిరుపతి దాకా చేశాను డబ్బులు వేస్ట్ చేయదు అని నువ్వే అంటావు ఇప్పుడు ఏమీ చేయాలి అని అడిగాడు

రామ్మూర్తి : సరే అయితే తిరుపతి లో కలుదాం అని ఫోన్ పెట్టేసాడు

ఇక్కడ రమ్య మాత్రం గూగుల్ లో ఏదో అడ్రస్ తెగ వెతుక్కుంటూ ఉంది

రాజా : ఏమీ అయ్యింది అని అడిగాడు

రమ్య : నాకూ జాబ్ వస్తే తిరుపతి వస్తా అని ముక్కుకున్నా

రాజా : మంచిది ఇప్పుడు ఏమీ అయింది

రమ్య : తిరుపతి నాకూ కొత్త అక్కడ నా ఫ్రెండ్ వుంటుంది వాళ్లు ఊరికి వెళ్లారు అంటా అడ్రస్ ఇచ్చింది వాళ్ల ఇంటి స్పేర్ కీ అక్కడ పెట్టి వెళ్తాము నువ్వు వెలు అంటుంది

రాజా : అంటే మీరు దర్శనం కీ రెడీ అవ్వడానికి ఒక ప్లేస్ కావాలి అంతే కదా

రమ్య : అవును

4 Comments

  1. Gurrala Rakesh ready

    Super vundhi story complete cheyali bro madyala vodhileyakandi

  2. Yerri puku story

  3. After long gap vedavapuku storyni post i think stories are not available to the admn.

  4. After long gap vedavapuku storyni post i think stories are not available to the admn.

Comments are closed.