నాకు మధ్య రాత్రి మెలుకువ వచ్చింది. టైం చూస్తే రాత్రి రెండయ్యింది. స్వీటీ నా పక్కన లేదు. లేసి చూసాను. బాత్రూం లో నీళ్ల శబ్దం వినిపించింది. బాత్రూం డోర్ లాక్ చేసి లేదు. నెమ్మదిగా వెళ్లి డోర్ తీసి చూసాను. స్వీటీ బాత్రూమ్ లో షవర్ డోర్ వెనకాల కింద కూర్చొని బాగా బాధలో ఏడుస్తుంది.
నేను వెళ్లి తన పక్కనే కూర్చున్నాను. షవర్ ఆన్ చేసే ఉంది. నెమ్మదిగా నీళ్లు పడుతున్నాయి. నిద్ర పట్టలేదని చెప్పింది. నెమ్మదిగా షవర్ ఆపేసి తనని దగ్గరకు తీసుకొని అలాగే ఇద్దరం ఉండిపోయాము.
కొన్ని రోజుల తరువాత:
నెమ్మది నెమ్మదిగా స్వీటీ మళ్ళి మాములుగా అయ్యింది. ఇక వచ్చే వారమే మా హనీ మూన్.
టైం రాత్రి పదయ్యింది. స్వీటీ నేను బెడ్ లో పడుకుని కబుర్లు చెప్పుకుంటున్నాము.
“స్వీటీ, చాల రోజుల తరువాత నువ్వు మళ్ళి సంతోషంగా కనిపిస్తున్నావు…… తెలుసా ??”
“థాంక్స్ సంజు….. నాకు సపోర్ట్ గా ఇన్ని రోజులు ఉన్నందుకు…….”
“hmmmm……”
“సంజు……”
“ఏంటే ??”
“సరే, నా వల్ల ఇదంతా జరిగింది కాబట్టి, నేను నీకోసం ఏమైనా చేయాలని అనుకుంటున్నాను…….”
“స్వీటీ నేనిదంతా ప్రేమతో చేసాను, ఏదో ఆశించి కాదు……”
“సంజు…. నాకు తెలుసు….. కానీ నాకు కొంచెం గిల్టీ గా ఉంది…… నా వల్ల మన ప్లన్స్ అన్ని చెడిపోయాయి….. నువ్వు కూడా ఇన్ని రోజులు నాకోసం అన్ని అడ్జస్ట్ అయ్యావు……”
నేనేం మాట్లాడలేదు, తననే చూస్తూ ఉండిపోయాను.
“సరే నా ఫోన్ చార్జర్ పక్కన టేబుల్ పైన పెట్టుంది…… అది తెచ్చివ్వు…..చాలు” అన్నాను.
స్వీటీ నన్ను కొట్టి “సంజు…నేను సీరియస్ గా చెబుతున్నాను …….”
“సరే అయితే ….. నా ఫోన్ చార్జర్ పక్కన టేబుల్ పైన పెట్టుంది, సీరియస్ పేస్ పెట్టి నాకు తెచ్చివ్వు…..”
స్వీటీ నన్ను చిరుకోపంతో చూసి “చి….. నేను నీతో మాట్లాడను…..”
“అయితే ప్రశాంతంగా పాడుకోవొచ్చు….ఈ రోజు …. ”
“ఆ ?? అంటే నీ ఉద్దేశం ఏంటి ?? నిన్ను…….” అంటూ నన్ను కొట్టడం స్టార్ట్ చేసింది.
“స్వీటీ….. ఆపవే……ప్లీస్…….”
“లేదు….. ఎప్పుడు నన్ను టీస్ చేయటమే నీకు పని……” అంటూ మళ్ళి మళ్ళి కొట్టింది. నా చేతులు అలాగే అడ్డం పెట్టుకొని ఉండిపోయాను.
“సరే సరే…… సారీ……. ఆపు….. ప్లీస్…..స్వీటీ….. ఆపవే….” అంటూ నవ్వుతు చెప్పాను.
మధ్యలో ఆపింది.
నేను చేతులు తీసేసి తననే చూస్తున్నాను. ఇద్దరి మోహంలో పెద్ద చిరునవ్వే దాగుంది. స్వీటీ నవ్వే వరకు నేను నవ్వకూడదని అలాగే చూస్తూ ఉండిపోయాను.
“అయ్యిందా ??” అని అడిగాను.
“లేదు…..”
“మరి ??”
నానా చేయి మీద ఒకసారి కొట్టింది. కానీ ఇద్దరిలో ఆ చిరునవ్వు అలాగే దాగుంది.
“అయ్యిందా ఇప్పుడు ??” అని అడిగాను.
తలూపింది.
నేను కొంచెం నవ్వటం స్టార్ట్ చేసాను, తను కూడా నవ్వటం స్టార్ట్ చేసింది. ఇద్దరం నవ్వుకున్నాము. నేను తనని దగ్గరకు తీసుకొని కౌగిలించుకున్నాను. అలాగే కొంచెం సేపు ఉండిపోయాము. అలా స్వీటీని దగ్గరగా కౌగిలించుకుంటే చాల హాయిగా అనిపించింది.
స్వీటీ నన్ను చూసి “సంజు…… సీరియస్ గా అడుగుతున్నాను……..” అనింది.
“నాకేం కావాలో నీకు ఆల్రెడీ తెలుసు……” అన్నాను.
స్వీటీ నన్ను అదోలా చూసింది.
“స్వీటీ ఏదో నేనంటే ఎవరో తెలియక నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లు నువ్వు ఫేస్ ని పెట్టావ్ తెలుసా ??”
స్వీటీ నవ్వేసింది. ఇద్దరం అలాగే ఒకరి కళ్ళలోకి ఒకరం ప్రేమతో చూసుకున్నాము. నేను నెమ్మదిగా స్వీటీ పెదాల దగ్గరకు నా పెదాలను తెచ్చి ఇద్దరం ముద్దిచ్చుకున్నాము. అలాగే కొన్ని క్షణాలు ముద్దుపెట్టుకున్నాం.
“సంజు……చెప్పు…ప్లీస్ ..సీరియస్ గా అడుగుతున్నాను……”
“సరే……….అయితే నువ్వు నన్ను ఇప్పటి నుంచి రా తో పిలువు……”
“ఆ?”
“సంజు అని కాకుండా “రా” తో పిలువు నన్ను…..”
స్వీటీ ఏమి మాట్లాడలేదు…….
