నా అందమైన అనుభవాలు 254

P.A. ఒక కవర్ సిన్హా చేతికి ఇచ్చి బయటకు పంపాడు, వాడు బయటికి వచ్చి కవర్ తీసి చూసాడు, అందులో అతన్ని కంపెనీ నుండి టెర్మినేట్ చేసినట్లు ఉంది. అతనికి రావలసిన.అన్నిరకాల అమౌంట్ స్టేట్మెంట్ వేసి ఆ అమౌంట్ కి చెక్ కలిపి ఉంది.

సిన్హా తల వంచుకొని అవమానంతో ఆఫీస్ నుండి బయటకు వెళ్ళిపోయాడు.

కాసేపటికి మా.స్టాఫ్ లో ముగ్గురిని పిలిచి వన్ బై వన్ కాసేపు మాట్లాడి పంపారు.

చివర్లో నన్ను లోనికి పిలిచారు, నేను చైర్మన్ గారి ముందుకు వెళ్లి నమస్కరించాను.

సో యూ ఆర్ మిస్టర్ కిరణ్ ?

ఎస్ సార్ అన్న

ఎంత వరకు చదువుకున్నావ్ ?

ప్రైవేట్ గా MBA చేస్తున్నాను సర్.

ఇంత లేట్ గా ఎందుకు చదువుతున్నావ్ ?

ఫైనాన్సియల్ ప్రాబ్లమ్ సర్.

ఎన్ని సంవత్సరాలనుండి ఇక్కడ పనిచేస్తున్నావ్ ?

7 ఇయర్స్ సర్.

Ok, కాసేపు బయట వెయిట్ చేయండి అన్నాడు.

థాంక్యూ సర్ అని బయటకు వచ్చాను.

10 నిమిషాలకు చైర్మన్ బయటకు వచ్చాడు.

మా స్టాఫ్ అందరిని వైపు చూసి,
నేను ఇక్కడికి రావడానికి ముఖ్యమైన కారణం ఉంది. ఇక్కడ అకౌంట్స్, సిస్టం సరిగా మైంటైన్ లేదు. అందుకే సిన్హా ను తీసేసాను.

మీకు రాబోయే కొత్త మేనేజర్ ఎవరో తెలుసా, అంటూ అందరి వంకా చూసాడు.

అందరం టెన్షన్ గా వింటున్నాం, ఈసారి ఎక్కడి నుండి వస్తాడో, ఎలాంటి వాడో అని.

యువర్ న్యూ మేనేజర్ ఈస్ మిస్టర్ కిరణ్ అన్నాడు.

నాకు తల భూమి ఎంతగా గిర్రుమని తిరుగుతుందో అలా తిరిగింది, కాసేపు ఏమి అర్ధం కాలేదు, పక్కనున్న వాళ్ళు నాకు కంగ్రాట్స్ చెపుతుంటే అలా చూస్తుండి పోయాను.

అందరూ కలిసి క్లాప్స్ కొడుతున్నారు, చైర్మన్ గారు నా చేతికి అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు.

చైర్మన్ గారు వెళుతూ రమ్మని సైగ చేసారు, నేను ఆయన వెనుక వెళ్ళాను, ఆయన కారులో కూర్చుని , చాలా మంచి పని చేసావు.

చైర్మన్ కే పర్సనల్ మెయిల్ చేసేంత ధైర్యం ఉంది అంటే, నీ లాంటి వాడు నాకు కావాలి. అందుకే నిన్ను మేనేజర్ ను చేసాను. జ్జాగ్రత్తగా చూసుకో బై మిస్టర్ కిరణ్ అంటూ వెళ్ళిపోయారు.

నేను ఆఫీస్ లోనికి వెళ్ళాను, మా వాళ్ళు అందరూ నాకు ఎలా ఇంత పెద్ద జాక్పాట్ తగిలింది అని చర్చించు కుంటున్నారు.

నేను కామ్ గా వచ్చి నా బాగ్ తీసుకుని బైక్ దగ్గరకు వెళ్ళాను.
ఇంటికి వెళ్ళేటప్పుడు కె జీ స్వీట్స్ తీసుకెళ్ళాను.

ముఖం డల్లు గా పెట్టుకుని బెల్ కొట్టాను. రూప డోర్ తీసింది నవ్వుతూ, నా ముఖం చూడగానే తన నవ్వు ఎగిరిపోయింది.

ఏమైంది అంటూ నా చేయి పట్టుకుంది, నేను లోనికి వచ్చి డోర్ వేసి లెటర్ తన చేతికి ఇచ్చాను. తను అందుకుని నావైపు విస్మయంగా చూసి చదివింది.

పూర్తి కాకుండానే ఓ మై గాడ్…అంటూ పెద్దగా కేక పెట్టి నన్ను గట్టిగా కౌగిలించుకుంది.

నేను తనని ఎత్తుకుని గిరగిరా తిప్పాను. ఇంతలో పిల్లలు తల్లి కేక విని వచ్చారు.

ఆరాత్రి మాకు మళ్ళీ శోభనం రాత్రి లా గడిచింది. రూప సంతోషాన్ని దాచుకోలేక పోతుంది. నా కల గురించి తనకు తెలుసు.

ఉదయం త్వరగా ఆఫీస్ కు వెళ్ళాను.

స్టాఫ్ అంత టైం కంటే ముందుగా వచ్చి నాకు కంగ్రాట్స్ చెప్పారు.

వనజ ముఖంలో డల్ నెస్ కనిపించింది, శ్రీదేవి ముఖంలో మాత్రం సంతోషం స్పష్టంగా కనిపిస్తుంది,

తను మనస్ఫూర్తిగా నాకు కంగ్రాట్స్ చెప్పి షేక్ హాండ్ ఇచ్చింది.