న్యూ హ్యాపీ ఎండింగ్ Part 11 78

“హ్మ్ రా” అంది పూర్ణ

కాసేపటికి కాలింగ్ బెల్ మొగుతుంటే వెళ్లి డోర్ ఓపెన్ చేసింది ఎదురుగా శ్రీకాంత్ నిలబడి ఉన్నాడు.

“ఏంట్రా బేబీ ఇంకా రెడీ అవ్వలేదు ఆఫీస్ కి” అన్నాడు నైటీ లో ఉన్న పూర్ణ ని చూసి.

పూర్ణ కి ఏం చెప్పాలో అర్ధం కాలేదు. అసలు ఆ రోజు థియేటర్ కి వెళ్లబట్టే ఇంత ప్రాబ్లెమ్ వచ్చింది. కానీ తప్పంతా శ్రీకాంత్ ది కాదు. ప్రకాష్ బుద్దే అలాంటిది. దీనిని సాకుగా చూపకపోయినా వేరొకటి చూపించి తనని అనుభవించాలి అని చూసేవాడు.

“ఏంటి బంగారం ఏమైంది రా, అడుగుతుంటే సైలెంట్ అయిపోయావ్” అన్నాడు శ్రీకాంత్ మెల్లగా పూర్ణ దగ్గరికి వచ్చి తనని కౌగిలిలోకి తీసుకుని.

ఎందుకో ఆ మరుక్షణమే మొన్నటి నుండి మోస్తున్న బాధ మొత్తం కన్నీళ్ల రూపంలో బయటకు వచ్చేసింది. పూర్ణ కన్నీళ్ళని చూసిన శ్రీకాంత్

“ఏమైంది రా? నేను వచ్చేసా కదా ఏమైందో చెప్పు. నా వల్ల అయితే సారీ బంగారం. ఇంకా కోపం ఉంటే కోపం పోయేలా కొట్టు” అన్నాడు పూర్ణ కన్నీళ్ళని తన చేతులతో తుడుస్తూ.

“నీ వల్ల కాదు రా, ఉద్యోగం మానేశాను అక్కడ” అంది పూర్ణ మెల్లగా.

“ఏమైంది రా అసలు” అన్నాడు శ్రీకాంత్ తన చేత్తో పూర్ణ తలని నిమురుతూ.

“నచ్చట్లేదు అక్కడ” అంది పూర్ణ.

కానీ ఎందుకో పూర్ణ అబద్దం చెప్తుంది అనిపించింది.

“నా మీద ప్రామిస్ వేసి చేసి ఏం జరిగిందో” అన్నాడు శ్రీకాంత్.

పూర్ణ కళ్ళు మళ్ళీ కన్నీళ్లతో నిండిపోయాయి. కాసేపటికి కుదుటపడి ఆఫీస్ లో జరిగింది మొత్తం చెప్పేసింది. అది విని శ్రీకాంత్ మొహం కోపంతో ఎర్రబడింది.

“చాలా భయంగా ఉంది రా జాబ్ లేదు, పైన వాళ్ళు కూడా ఖాళీ చేసారు. అసలు ఇంటిని ఎలా నడపాలో అర్ధం కావట్లేదు” అంది పూర్ణ.

శ్రీకాంత్ గట్టిగా ఊపిరి పీల్చుకుని కోపాన్ని ఆపుకున్నాడు.

“ఇప్పుడు జాబ్ యే కదా కావాల్సింది” అన్నాడు పూర్ణ కళ్ళలోకి చూస్తూ

“అవును రా కానీ మంచిది దొరకాలి కదా, అక్కడ వచ్చిన శాలరీ ఇస్తారో లేదో కూడా తెలియదు” అంది.

“అక్కడ ఎంత ఇచ్చేవాళ్ళు” అన్నాడు

“అన్ని పోను 26 వేలు వచ్చేవి రా” అంది

“సరే ముందు వెళ్లి స్నానం చేసి రెడీ అయ్యి రా మాట్లాడుకుందాం” అన్నాడు.

పూర్ణ సరే అని తల ఆడించి తన బెడ్ రూమ్ లోకి వెళ్ళింది. కాసేపటికి స్నానం చేసి, బ్లూ కలర్ చీర కట్టుకొని, జడ వేసుకుని బయటకు వచ్చింది. శ్రీకాంత్ అప్పటివరకు సోఫాలో కూర్చుని వెయిట్ చేసాడు. పూర్ణ రాగానే తన చేయి పట్టుకొని బయటకి తీసుకొని వెళ్ళాడు.

“బైక్ ఎక్కరా” అన్నాడు

పూర్ణ ఎక్కి కూర్చుని

“ఎక్కడికి రా ఇప్పుడు?” అంది

“చెప్తాను పద” అన్నాడు.

కాసేపటికి గచ్చిబౌలి లోని ఒక పెద్ద ఆఫీస్ ముందు బైక్ పార్క్ చేసాడు. పూర్ణ తల ఎత్తి పేరు చూసింది. అది సిటీ లోనే పేరు మోసిన హోమ్ ఇంటీరియర్ ఆఫీస్.

“ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చావ్” అంది పూర్ణ ఆశ్చర్యం గా.

“అబ్బా అంతా కంగారే రా నీకు లోపలకి పద చెప్తాను” అన్నాడు.

ఇద్దరు లిఫ్ట్ లో 4 వ అంతస్థుకి చేరుకున్నారు. లోపలకి అడుగుపెడుతుంటే అందరూ శ్రీకాంత్ కి గుడ్ మార్నిగ్ చెప్తున్నారు నవ్వుతూ. పూర్ణ కి అసలు ఏం అర్ధం కావట్లేదు. భయం భయం గా శ్రీకాంత్ వెనుక వెళ్ళింది.

శ్రీకాంత్ మెల్లగా నడుస్తూ అందరిని పలకరించాడు. ఎదురుగా ఉన్న MD రూమ్ లోకి పూర్ణ ని రమ్మని సైగ చేసాడు. పూర్ణ భయపడుతూనే లోపలికి వచ్చింది. లోపల MD చైర్ లో ఒక 55 సంవత్సరాల మనిషి కూర్చున్నాడు. పూర్ణ ని శ్రీకాంత్ ని చూసి నవ్వుతూ.

“రండి ఇలా కూర్చోండి” అన్నాడు

పూర్ణ కి ఏం జరుగుతుందో అసలు అర్ధం కావట్లేదు.

“బాబాయ్ ఇందాక చెప్పాను కదా తనే పూర్ణ” అన్నాడు శ్రీకాంత్.

పూర్ణ అది విని షాక్ అయింది. ఏంటి MD ని పట్టుకుని బాబాయ్ అంటున్నాడు అని.

“హాయ్ పూర్ణ, నా పేరు సూర్యారావుమ్ మా వాడు అంతా చెప్పాడు నీ గురించి. మన కులం పిల్ల జాబ్ కోసం ఇబ్బంది పడుతుంటే నాకు నచ్చదు. ఈ రోజు ఎటు తిరిగి 20 కదా రేపు 1 నుండి ఆఫీస్ కి వచ్చేయ్. అకౌంట్స్ బాగా వచ్చు కదా?” అన్నాడు అతను నవ్వుతూ

అది విని పూర్ణ మొహం ఆనందంతో వెలిగిపోయింది.

“వచ్చు…. వచ్చు సార్” అంది తడబడుతూ.

“నువ్వు చెప్పినట్టు మరీ అమాయకంగా ఉంది రా. మన పిల్ల అంటే ఎలా ఉండాలి. అన్నిటికి గట్టిగా సమాధానం చెప్పాలి ఇలా ఉంటే కుదరదు” అన్నాడు సూర్యారావు.

“కొత్త కదా బాబాయ్ అలవాటు పడితే బాగానే మాట్లాడుతుంది” అన్నాడు శ్రీకాంత్.

ఇంతలో సూర్యారావు తన చేతి దగ్గర ఉన్న రిమోట్ తీసుకొని నొక్కాడు. కాసేపటికి డోర్ ఓపెన్ చేసుకొని ఒక అమ్మాయి లోపలకి వచ్చింది.

“సార్ చెప్పండి” అంది వినయంగా

“చెప్పాను కదా కొత్తగా అమ్మాయి జాయిన్ అవుతుంది అని తనే, పూర్ణ తన పేరు శృతి ఒకసారి తనతో వెళ్ళు ఆఫీస్ అంతా చూపిస్తుంది” అన్నాడు సూర్యారావు.

పూర్ణ తల తిప్పి శ్రీకాంత్ కళ్ళలోకి చూసింది. వెళ్ళు అన్నట్టుగా తల ఆడించాడు. పూర్ణ పైకి లేచి శృతి వెంట వెళ్ళింది. మొత్తం ఆఫీస్ 4 ఫ్లోర్స్ లో ఉంది. ఫస్ట్ ఫ్లోర్ నుండి 4 వ ఫ్లోర్ వరకు మొత్తం చూపించింది. పూర్ణ ఉండే అకౌంట్ సెక్షన్ 3 వ ఫ్లోర్ లో ఉంటుంది. ఆఫీస్ ఎంత బాగుంది అంటే పూర్ణ కళ్ళలో కనిపిస్తున్న ఆనందాన్ని బట్టి చెప్పేయొచ్చు. అసలు ఇది కలో నిజమో కూడా అర్ధం కావట్లేదు. కాసేపటికి శృతి మళ్ళీ పూర్ణ ని MD రూమ్ ముందు వదిలిపెట్టి

“మళ్ళీ కలుద్దాం బాయ్” అంటూ నవ్వుతూ వెళ్ళిపోయింది.