పూర్ణ సరే అని అలానే నవ్వుతూ ఉంది.
“అవును అడగటం మర్చిపోయాను శ్రీవారికి తాగే అలవాటు ఉందా?” అంది
“ఒకప్పుడు ఉండేది, శ్రీమతి గారి పరిచయం అయ్యాక అన్నీ మానేశాను” అన్నాడు
అది విని చాలా హ్యాపీగా ఫీల్ అయింది పూర్ణ.
“గుడ్ బాయ్” అంది పూర్ణ
“సరే కానీ రేపు మా ఫ్రెండ్స్ ని తీసుకొని వస్తాను శ్రీమతి గారు, మళ్ళీ సంతోష్ కి డౌట్ రాకూడదు కదా” అన్నాడు.
“హ్మ్ అవును” అంది
“కానీ ఎన్ని రోజులని దాస్తాం చెప్పు రా ఏదోక రోజు తెలియాలి కదా” అన్నాడు
“ఇప్పుడు వాడు అర్ధం చేసుకునే వయసులో లేడు రా, కొంతకాలం ఇలానే ఉందాం. అర్ధం చేసుకుంటాడు అన్నప్పుడు నేనే చెప్తాను” అంది పూర్ణ
“సరే రా బంగారం” అన్నాడు శ్రీకాంత్.
“పడుకుందామా ఇంక” అంది మెల్లగా
“రమ్మంటావా మరి” అన్నాడు శ్రీకాంత్ నవ్వుతూ
“నువ్వు నీ కుళ్ళు జోకులు” అంది పూర్ణ నవ్వుతూ
“హాహా సరే గుడ్ నైట్ రా బంగారం రేపు కలుద్దాం” అన్నాడు
“మరి రేపు ఏం చీర కట్టుకోమంటావ్?” అంది పూర్ణ మెల్లగా
“హ్మ్ ఆ నెమలి పింఛం చీరనే కట్టుకోరా” అన్నాడు శ్రీకాంత్
“సరే శ్రీవారు గుడ్ నైట్ ఉమ్మాహ్… ” అంటూ ముద్దు ఇచ్చింది పూర్ణ
శ్రీకాంత్ కూడా తిరిగి ముద్దు ఇచ్చాడు. ఇద్దరు మెల్లగా పడుకుని నిద్రలోకి జారుకున్నారు.
