“సరే టికెట్ తెమ్మని చెప్పనా నాన్నకి” అంది
“వద్దమ్మా నేనే బుక్ చేసుకుంటాను” అంది
మేఘన తన ఫోన్ తీసుకొని టికెట్ బుక్ చేద్దాం అని చూసింది. కానీ ఒక్క క్షణం జాన్ గురించి ఆలోచించింది. వెంటనే మేరీ దగ్గరికి వెళ్లి రేపు తను వెళ్తున్నట్టు చెప్పింది. ఆ విషయం మేరీ ద్వారా జాన్ కి తెలుస్తుంది అప్పుడు అయినా మాట్లాడతాడు అనే ఆశతో కానీ జాన్ నుండి ఎలాంటి సమాధానం రాలేదు. ఆ రోజు రాత్రి వరకు చూసి ఇంక విసుగు వచ్చి తనకి టికెట్ బుక్ చేసుకుంది.
మరుసటి రోజు ఇంట్లో అందరికి చెప్పి హైదరాబాద్ తిరుగు ప్రయాణం అయింది. జాన్ తన వెనుకనే కనపడకుండా బస్ స్టాప్ వరకు వచ్చాడు. మేరీ చెప్పినా కూడా మేఘన తో మాట్లాడాలి అంటే ధైర్యం రావట్లేదు. మేఘన బస్ ఎక్కుతుంటే అలా చూస్తూ ఉన్నాడు. మెల్లగా బస్ ముందుకి కదిలింది.
***** ***** ****** ****** ****** ****** *****
సరిగ్గా 9:30 అవుతుండగా శ్రీకాంత్ ఫోన్ మోగింది చూస్తే పూర్ణ దగ్గర నుండి వీడియో కాల్ వస్తూ ఉంది. ఇప్పుడే చేద్దాం అనుకున్నాడు కానీ అంతలో పూర్ణ దగ్గర నుండే రావటంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వెంటనే లిఫ్ట్ చేసాడు.
“ఏం చేస్తున్నావ్ రా” అంది పూర్ణ
“నేనే కాల్ చేద్దాం అనుకుంటున్నా నువ్వే చేసావ్” అన్నాడు.
“హ్మ్, మిస్ యు రా” అంది పూర్ణ మెల్లగా
“మిస్ యు టూ రా బంగారం” అన్నాడు శ్రీకాంత్.
“అయినా అంత కోపం ఏంట్రా నీకు?” అంది.
“దేని గురించి రా?” అన్నాడు
“ఇందాక మా మేనేజర్ ని అలా కొట్టావ్ కదా” అంది
“మరి నిన్ను ఎవరన్నా టచ్ చేస్తేనే నాకు కోపం వస్తుంది అలాంటిది వాడు……” అంటూ పళ్ళు కొరికాడు.
“లవ్ యు సో మచ్ రా” అంది శ్రీకాంత్ తన మీద చూపిస్తున్న ప్రేమకి సంతోషం గా
“లవ్ యు టూ బేబీ” అన్నాడు
ఇద్దరు కాసేపు ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు.
“బేబీ” అన్నాడు మెల్లగా శ్రీకాంత్
“హ్మ్ చెప్పరా” అంది పూర్ణ
“ఏంటి మరి ఏం లేదా ఈ రోజు?” అన్నాడు నవ్వుతూ
“ఏం కావాలిరా?” అంది
“నాకు ఏం కావాలో నీకు తెలియదా?” అన్నాడు చిలిపిగా చూస్తూ.
“ఎందుకు తెలియదు శ్రీవారు” అంది పూర్ణ కూడా చిలిపిగా నవ్వుతూ
అది విని శ్రీకాంత్ ఉప్పొంగిపోయాడు.
“ఇంకొకసారి చెప్పరా” అన్నాడు ముద్దుగా
“ఎందుకు తెలియదు” అంది పూర్ణ నవ్వుతూ
“ఓయ్ ఇంకొక మాట మిస్ చేసావ్” అన్నాడు.
“నేనేం మిస్ చేసాను” అంది ఆటపట్టిస్తూ
“ఇందాక చెప్పింది పూర్తిగా చెప్పలేదు ఒక మాట మిస్ చేసావ్” అన్నాడు మళ్ళీ
“లేదు అదే చెప్పాను” అంది పూర్ణ నవ్వుతూ
“చెప్పరా ప్లీజ్” అన్నాడు శ్రీకాంత్
“ఏం చెప్పాలి శ్రీవారు” అంది పూర్ణ ముద్దు ముద్దుగా
“దేవుడా చంపేస్తున్నావ్ ఆ మాటతో ఎట్లా ఉందో తెలుసా నా పరిస్థితి” అన్నాడు సంతోషం గా
