ఆది : సర్లే…నాకు టాబ్ రాని నువ్వు ఉన్నావు అనే మర్చిపోతాను అస్సలు పట్టించు కొను అని అన్నాడు…
సరోజ ఆది వైపు చూస్తూ అనుమానం గా నవ్వుతూ…మొత్తం ఇది అంతా టాబ్ కోసమే చేస్తున్నావు రా నాకు తెలుసు అని అంది…లేదంటే నీకు నా మీద ఇంత ప్రేమ ఉందా
ఆది : హ్మ్మ్ సర్లే నువ్వు అనుకునేది అనుకో…
సరోజ : అయితే నేను అదే అనుకుంటున్నా అని నవ్వింది..
ఆది : ఏది
సరోజ : టాబ్ కోసం ఆడిన డ్రామా అని నాకు అర్థం అయ్యింది అని నవ్వింది…
ఆది కి అమ్మ కి తన మనసులో బాధ అర్థం చేసుకోదు తనకి నచ్చిందే తను అనుకుంటుంది అని అర్థం అయ్యి హ్మ్మ్ అవును అని అన్నాడు..
సరోజ ఒక్క సారిగా నవ్వేసి ఓరి వెధవా నేను అడిగితే కొని పెట్టనా దానికి ఇంత కథ నడపాలా అని అంది…
ఆది కి అమ్మ తనని వెర్రి వాడిని చేయటానికే మొత్తం తన ఏడుపు నీ ఒక్క మాటతో తెగ్గొట్టింది అని అర్థం అయ్యి నవ్వలేక ఒక చిన్న నవ్వు నవ్వాడు…
సరోజ ఆది నవ్వుకి ఆశ్చర్య పోతూ…అమ్మో అంటే నిజమే నా అని అడిగింది…
ఆది : నువ్వే అంటున్నావు కదా మరి
సరోజ : వారి వెధవా…నేను ఇంకా నా మీద నా కొడుక్కి ఎంత ప్రేమో అని పొంగి పోతున్నా అని అంది…
ఆది ఈ సారి నిజం చెప్పాడు…అస్సలు లేదు అని..
సరోజ నవ్వుతూ ఆది దగ్గరకి వచ్చి చెవి మెలిక పెట్టి ఎంత బాగా నటించావు రా అంటే ఈ జ్వరం కూడా నటనే నా అని అంది
ఆది కి కోపం వచ్చి అవును సంక లో ఉల్లిపాయలు పెట్టుకుని తెచ్చుకున్నా అని చెయ్యి కడుక్కుని రూం లోకి వెళ్ళిపోయాడు…
సరోజ గట్టిగా నవ్వుతూ హా అదే చేసి ఉంటావు లే అని అంది……
కాసేపటికి సరోజ ఆది రూం కి వెళ్లి… జ్యూస్ ఇస్తూ….తాగు బలం రావాలి కదా అమ్మని ఏదో ఒకటి అనటానికి అని అంది నవ్వుతూ..
ఆది : నేను పట్టించు కోవటం మానేశా అని చెప్తున్నా కదా అని అన్నాడు జ్యూస్ అందుకుంటూ…
సరోజ : హమ్మయ్య…చాలు రా ఆ మాట మీద ఉండు..నువ్వు ప్రశాంతం గా ఉండు నన్ను ప్రశాంతం గ ఉండని అంది నవ్వుతూ
ఆది సరే లే అని తాగేసిన గ్లాస్ ఇచ్చాడు…
అంత లో సరోజ గారు సరోజ గారు అని బయట నుండి పిలుపు వినిపించింది…
సరోజ : కేబుల్ సీను గాడు వచ్చినట్లు ఉన్నాడు…
ఆది : వెళ్ళు మీ తమ్ముడు వచ్చినట్లు ఉన్నాడు…మా టీవీ రాలేదు అని పిలిచావు గా..
సరోజ నవ్వి రా నువ్వు కూడా వచ్చి కూర్చో హాలో లో అని అంది …
ఆది : నాకు ఎందుకు నేను పట్టించు కోవటం మానేశా గా అని దుప్పటి కప్పుకుని పడుకున్నాడు..
సరోజ : పోరా నువ్వు పట్టించుకున్న పట్టించుకొకపోయినా…వాడు మాత్రం నా తమ్ముడు లాంటి వాడే అని నవ్వి హా వస్తున్నా రా సీను అని వెళ్లింది…
