ప్రాజెక్ట్ – Part 3 225

కాల్పులు జరిగినట్టు బులెట్ లు గోడల్లో ఉన్నాయి ,,కొన్ని డెడ్ బాడీస్ ఉన్నాయి …
ఫోరెన్సిక్ వాళ్ళు అధరాలు వెతుకుతుంటే ఎస్ ఐ వాచ్మాన్ తో మాట్లాడుతున్నాడు …
అక్కడ ఆ పని లో ఉండగానే ,,మల్లి కంట్రోల్ రూమ్ నుండి ఫోన్ ,,పేపర్ జర్నలిస్ట్ ఇబ్రహీం ను కాంటీన్ టాయిలెట్స్ వద్ద కాల్చేశారు అని ..
నేను వింతగా కార్ లో అక్కడికి వెళ్ళాను ,,కొద్ది గంటల్లో నా ఏరియా లో ఇన్ని హత్యలు జరగడం, నేను బాడ్ సెక్యూరిటీ అధికారి అని పేరు ఉండటం తో కమిషనర్ మాట్లాడాడు ఫోన్ లో “కేసు లు స్పెషల్ టీం కి ఇద్దాం”అని .
“సార్ నేను సిబిఐ లో పని చేశాను ,,ఈ క్రైమ్ ను నేను హేండిల్ చేస్తాను “అన్నాను
సాయంత్రం అయ్యేసరికి ఢిల్లీ మీడియా లో ,న్యూస్ లో ఇదే టాపిక్ .
మర్నాడు జర్నలిస్ట్ హత్య కి నిరసనలకు జర్నలిస్ట్ లు పెర్మిషన్ తెచ్చుకున్నారు .
#####
ఈ హత్య ల న్యూస్ టీవీ లో చుసిన రజియా సుల్తానా అనుకుంది “ఫ్లాట్ లో ఉండాల్సిన జావేద్ ,విద్య చనిపోయారా ,,,ఇబ్రహీం ను ఎవరు చమ్పారు “అనుకుంది
ఫోన్ మోగడం తో తీసాను “నేను పీఎం వైఫ్ రజియా సుల్తానా “అంది అవతల నుండి .
“చెప్పండి మాడం “అన్నాను షాక్ తో .
“ఫ్లాట్ లో చనిపోయిన వారి వివరాలు ,జర్నలిస్ట్ ను చంపినా వారి వివరాలు తెలిసాక నాకు చెప్పు “అంది అధికార స్వరం తో
“ఓకే మాడం “అన్నాను వినయం గ
ఫోన్ పెట్టేసాక “పోదున్నే ఈమె గురించి మాట్లాడింది సౌందర్య ,,ఇప్పుడు ఈమె డైరెక్ట్ గ నాతోనే మాట్లాడింది “అనుకున్నాను అయోమయం గ
#####
పాకిస్తాన్ లో న్యూస్ చూస్తున్న ఇంతియాజ్ “అసలు అక్కడ ఏమి జరుగుతోంది ,,ఫ్లాట్ లో చనిపోయింది ఎవరు ,,మన అజెంట్స్ ను ఆక్టివేట్ చేయండి “చెప్పాడు .
టీవీ లో నన్ను చూస్తుంటే వాడికి యాసిన్ ,మసూద్ గుర్తు వచ్చారు .