ప్రాజెక్ట్ – Part 4 193

“ఇబ్రహీం ,జావేద్ పోయారు ,ఇక తరిక్ ,రజియా ఇద్దరే ఉన్నారు…ఆమె ఇంకా ఇక్కడే ఉంది అంటే పాకిస్తాన్ కి ఏదో బేరం పెట్టివుంటుంది…లేకపోతే జావేద్ ఎన్ని సార్లు చెప్పినా బయటకు రాలేదు కదా”అన్నాను.
“విద్య చెప్పింది కదా,రజియా పాక్ నీ ఏమి అడిగిందీ “అంది సౌందర్య..
“చెప్పింది ,నేను ఆర్డర్ లో వస్తున్నాను,, పాక్ కి ఏదో బేరం పెట్టింది,,వాడు ఒప్పుకోలేదు,,ఎదురు తిరిగింది ,,కానీ ఖాళీగా లేదు,,డబ్బు సంపాదిస్తోంది.పదవి లోకి వెళ్ళింది “ఆగాను..
“సో”
“అక్కడ దొరకనివి ఇక్కడ పొందుతోంది,,సో ఇంకా ఏదో చేస్తుంది,,,అంటే ఇంకా బలపడుతుంది ,,బట్ హౌ”అన్నాను..
“Come-on dcp ,,అవన్నీ ఎందుకు “అంది విసుగ్గా సౌందర్య..
“మేడం bombshell ఆన్ లో ఉంది ,, ఆమెకి ఇప్పుడు లింక్ కావాలి మళ్లీ పాక్ తో,,,సో ,,పాక్ ఎంబస్సి మీద నిఘా ఉంచండి…రజియా ఎవర్ని కలుస్తోంది తెలుసుకోండి,,ఫోన్ టాప్ చేయండి..ఎక్కడ దొరికితే అక్కడ ఆమెని తప్పించి విద్య మాడం ను ఉంచుదాం..”అన్నాను..
సౌందర్య ఐబీ,సీబీఐ లకి ఆర్డర్స్ వేసింది..పాక్ ఎంబసీ మీద నిఘా మొదలు అయ్యింది..రజియా సుల్తానా ఫోన్స్ టాపింగ్ లోకి వెళ్తున్నాయి..
నేను బయలుదేరుతూ ఉంటే “మాడం ఏమిటో జావేద్ మీద అంత అభిమానం చూపిస్తోంది ,శత్రువు అని తెలిసి కూడా,,జరుగుతున్న వాటికి కారణం,ఇంతియాజ్ ,జావేద్ ,రజియా కారణం కదా”అంది సౌందర్య వింతగా..
“మనం బయట ఉన్నాము,,ఆమె ఊబిలో కూరుకుపోయారు….దాదాపు నెల పైన వాడు ఆమెని మర్యాదగా హాని చేయకుండా చూసుకున్నాడు,,గాంగ్ హత్య చేయబోతే అ డ్డం పడి రక్షించాడు…ఆమెకి మరి వాడు దేముడు కాకుండా ఎలా ఉంటాడు..ఆమె మర్చిపోయింది ఇదంతా క్రైమ్ అని… bombshell అనే పెద్ద క్రైమ్ లో చిన్న క్రైమ్ లు జరుగుతున్నాయి అని…. తేరుకుంటారు,,వారం లోపు,,ఆమెకి అర్ధం అవుతుంది జావేద్ శత్రువు అని….ఇది మామూలే క్రైమ్ లో”అన్నాను వెళ్తూ..
“మేడం తో సెక్స్ చేసి ఉంటాడా ,లేకపోతే ఇంత బాధ ఉండదు”అంది సౌందర్య..
“నాలాంటి ,జావేద్ లాంటి వాళ్ళకి సెక్స్ పెద్ద విషయం కాదు,,విద్య మాడం కి సెక్స్ ఏమిటో నాకు తెలియదు….బట్ ఎవరు ఎవరితో సెక్స్ చేస్తున్నా నేను పట్టించుకోను,,అది క్రైమ్ కాదు “అని వెళ్ళిపోయాను..
++++
సౌందర్య ఆలోచిస్తోంది”సెక్స్ క్రైమ్ కాదు”అంటే….